సెప్టెంబర్ 15 – ఇది మొదలుకొని!
“ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను …. అని సెలవిచ్చినదేమనగా” (హగ్గయి.2:19,20).
ప్రభువు యొక్క ప్రవక్తయైన హగ్గయి, ప్రభువు యొక్క మాటను ఇజ్రాయేలు జనులకు మాత్రము గాక, మనకు కూడాను తీసుకొని వచ్చుచున్నాడు. ఆశీర్వాదము లేక, వేధనతోను, కన్నీటితోను జీవించిన ఇశ్రాయేలు ప్రజలను చూచి : ఇది మొదలుకొని ప్రభువు మిమ్ములను ఆశీర్వదించును” అని చెప్పుచున్నాడు. ఎంతటి ఆనందకరమైన వార్త!
ప్రభువు ఎప్పుడు ఆశీర్వదించును తెలియునా? దేవుని యొక్క ఆలయమును కట్టుచున్న దినము మొదలుకొని ఆయన మిమ్ములను ఆశీర్వదించును. “నా యొక్క ఆలయమును కట్టుడి. అందులో నేను ఇష్టుడనైయుందును. అంత మాత్రమే కాదు, మిమ్ములను కూడా నేను ఆశీర్వదించెదను” అని చెప్పుచున్నాడు. మీరు ఆలయమును కట్టుటకు తీర్మానించుటయును, ఆలయమునకు ఇచ్చుచున్న ప్రాధాన్యతను, ఘనతను ప్రభువు చూచుచున్నాడు.
లేఖన గ్రంథమునందు కొందరు బలిపీఠములను కట్టిరి. సొలోమోను మహిమగల ఆలయమును కట్టెను. ఆ తరువాత ఎజ్రా, నెహెమ్యా, జెరుబాబేలు వంటి వారు మరల ఆలయమును కట్టిరి. ప్రభువు యొక్క ఆశీర్వాదమును పొందుకొనిరి.
నేడు మీరు కట్టవలసిన ఆలయము, మీయొక్క ఆత్మీయ జీవితముగా ఉన్నది. ఆకాశ మహాకాశములను కలుగజేసిన ప్రభువు, చేతుల చేత నిర్మించబడుచున్న ఆలయములో నివాసముండడు. మన యొక్క శరీరమునే ఆయన ఆలయముగా చేసుకొనుచున్నాడు, నివాసస్థలముగా చేసుకొనుచున్నాడు, ప్రార్ధన మందిరముగా చేయుచున్నాడు, అతి పరిశుద్ధ స్థలముగా చేయుచున్నాడు. క్రీస్తు, మహిమగల నిరీక్షణగా మీయందు నివాసము చేయుచున్నాడు (కలస్సీ. 1:27).
ఏ మనుష్యుడైతే, ‘నేను ప్రభువునకు ఆలయముగా ఉండవలెనే, నాలో నివాసము ఉన్న పరిశుద్ధాత్మునికి నేను శ్రేష్టమైన ఒక నివాసస్థలముగా ఉండవలెనే” అను తలంపుతో ప్రార్థనా జీవితమును, లేఖన గ్రంథమును చదువుటయును అత్యధికము చేయుచున్నాడో, ఆ దినము మొదలుకొని నిశ్చయముగా ప్రభువు అతనిని ఆశీర్వదించును. లోక ప్రకారముగా మాత్రముగాక, ఆత్మియానుసారముగాను పరలోక సంబంధముగాను ఆశీర్వదించును.
ప్రవక్తయైన హగ్గయి కాలములో జెరుబాబేలు వైరాగ్యముతో ఆలయమునకు పునాది వేసెను. గుండునూలును చేతపట్టుకొని ఆలయమును కట్టుటకు ప్రారంభించెను. ప్రభువు దానిని చూచినప్పుడు, ఆయన యొక్క హృదయము సంతోషము చేత నిండెను. జెరుబాబేలు అను నా సేవకుడా, నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసికొని ముద్ర ఉంగరముగా చేతును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు” (హగ్గయి. 2:23) అని చెప్పెను.
దేవుని బిడ్డలారా, ప్రభువు మిమ్ములను ముద్ర ఉంగరముగా ఉంచును. కావున మీ యొక్క ఆత్మీయ జీవితమును కట్టి లేవనెత్తుడి. మీయొక్క శరీరమను ఆలయములో పరిశుద్ధాత్ముడు నివాసము చేయుచున్నాడు అను తలంపుతో మీ పరిశుద్ధతను కాపాడుకొనుడి. రాజుల యొక్క వ్రెళల్లో ముద్ర ఉంగరమును ధరించుకొని రాజ్యపు చట్ట దిట్టాలను ముదిరించునట్లుగా, రాజాధిరాజు మిమ్ములను ముద్ర ఉంగరముగా ఉపయోగించును.
నేటి ధ్యానమునకై: “దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారివైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను” (ఎజ్రా. 6:16,22).