అక్టోబరు 31 – మూలరాయి!
“ఇదిగో, సీయోనులో పునాధిగా రాతిని వేసినవాడను నేనే; అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాధియైన మూలరాయియైయున్నది” (యెషయా. 28:16).
మీకు క్రీస్తు పునాదియైనవాడిగా ఉండినట్లయితే, మీరు ఎన్నడును కదల్చబడరు. మీ యొక్క మూలరాయియైనవాడు క్రీస్తే అయితే మీరు ఎన్నడును దిశ తప్పిపోరు.
ఆకాశమునంటు ఎత్తునకు నిలబడు భవనములను చూచి మనము ఆశ్చర్యపడి నివ్వరపోవుచున్నాము. అయితే అట్టి భవనము యొక్క బలము మరుగైయుండు దాని పునాధిలోనే ఉన్నది. పూచి పూతపట్టి ఫలమును ఇచ్చు చెట్టు యొక్క సిటారు కొమ్మలను చూసి ఉల్లసించుచున్నాము. అయితే అట్టి ఫలమును కాయుటకు గల రహస్యము భూమిలో దాగియుండు ఆ చెట్టు యొక్క వేరులోనే ఉన్నది. ప్రకాశవంతముగా వెలుగునిచ్చు దీపమును చూచి మనము ఆనందించుచున్నాము. అయితే వెలుగు యొక్క రహస్యము దీపము యొక్క అడుగు భాగమునందున నూనెలోనే ఉన్నది.
దేవుని బిడ్డలారా, మీ యొక్క క్రైస్తవ ఎదుగుదల, రక్షణ యొక్క సంతోషము అంతయును క్రీస్తు అను పునాధిలోనే ఉన్నది. మిమ్ములను ఔనత్య పరచి, గొప్ప చేయుటకు కొరకు ఆయన పరిశోధించబడి, శ్రమ పొంది సీయోనులో స్థిరమైన పునాధియైన మూలరాయి ఆయెను. కల్వరిలో తన యొక్క అమూల్యమైన రక్తమును చిందించి రక్షణకు మూలరాయి ఆయెను.
వేయ బడినదియునైయున్న పునాదియగు యేసు క్రీస్తే తప్ప, మరియొక పునాధి ఎవడును వేయనేరడు (1. కొరింథీ. 3:11). “దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది” (2. తిమోతి. 2:19).
సీయోనులో పునాధిగా నిలబడుచున్న క్రీస్తు యొక్క పేరులలో ఒకటి. “ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధుడు” అనుటయైయున్నది. ఇశ్రాయేలు ప్రజలతో పాటు, తనను కలుపుకొని ఆయన ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధుడు అని పిలవబడుచున్నాడు. పునాధి పరిశుద్ధముగా ఉంటెనే, భవనము కూడాను పరిశుద్ధముగా ఉండును. కావున భవనము అంతయును పరిశుద్ధముగా ఉండునట్లు మిమ్ములను ఆయన పరిశుద్ధపరచుచున్న దేవుడిగాను ఉన్నాడు.
ప్రభువు పరిశుద్ధతలో పరిపూర్ణుడు. ఆయన వద్ద పుట్టము వేయు పరిశుద్ధ అగ్ని ఉన్నది (యెషయా. 10:17). అట్టి పరిశుద్ధమైన అగ్నిచేత ఆయన పాపములను, అశుద్ధతలను, శాపములను కాల్చి వేయుచున్నాడు. శత్రువు యొక్క బలమును విరిచివేయచున్నాడు. తన యొక్క పిల్లలను పరిశుద్ధముగా కాపాడుటకు వైరాగ్యుమును కలిగియున్నాడు.
మీ యొక్క ఆత్మీయ జీవితమునకు పునాధిగాను, మూలరాయిగాను ఉన్నాడు. క్రీస్తు తానే మీయొక్క పరిశుద్ధతపై అక్కరగలవాడై మీయొక్క పరిశుద్ధ జీవితమునకు సహకారిగా నిలబడుచున్నాడు. “పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను” (యెషయా. 41:14)
దేవుని బిడ్డలారా, ఇట్టి పరిశుద్ధుడైన దేవుని హస్తమును పట్టుకొని పరిశుద్ధమైన బాటలో ఉత్సాహముగా నడిచి ముందుకు సాగుడి. ఆయన మిమ్ములను పరిశుద్ధతలో నుండి అత్యధిక పరిశుద్ధతను పొందుకొనునట్లు చేసి పరిపూర్ణపరచును.
నేటి ధ్యానమునకై: “జడివాన కురిసెను, పెద్దవరద వచ్చెను, గాలి విసిరి, ఆ యింటిమీద కొట్టెను గాని; దాని పునాధి బండమీద వేయబడెను గనుక అది పడలేదు” (మత్తయి. 7:25).