జూలై 18 – రాజ కిరీటము!
“రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు” (ఎస్తేరు. 1:10)
బైబిలు గ్రంథములో మన భారత దేశమును సూచించుచున్న ఒకే వచనము ఎస్తేరు. 1:1 మాత్రమే. తెలుగులో హిందూ దేశము అనియు, ఆంగ్లములో ఇండియా అనియు ఈ వచనమునందు సూచించపబడియున్నది. అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి పేర్లు బైబిలు గ్రంధములో చోటు చేసుకోలేదు.
భారతదేశము యొక్క పేరును వ్రాసి పెట్టుట మనకు గొప్ప సంతోషము కదా? అంత మాత్రమే కాదు, తన పన్నెండు మంది శిష్యులలో ఒక్కడైనా అపోస్తులుడు తోమాను భారతదేశమునకు అదియు తమిళనాడునకు పంపించి, అక్కడ ఆయన పరిచర్యను చేసి రక్తము చిందించుట తమిల ప్రజలకు లభించిన గొప్ప ధన్యత కదా?
అహష్వేరోషు అను రాజు గొప్ప విందును జరిపించి, అట్టి విందునకు తన భార్యయైన వస్తిని రాజకిరీటమును ధరించుకొనినదై రావలెను అని ఆమెను పిలువగా, అయితే ఆమె నిరాకరించుటను ఎస్తేరు యొక్క చరిత్ర గ్రంథమునందు చుచుచున్నాము.
నేడు రాజాధి రాజైయున్న యేసుక్రీస్తు, మనకు ఆత్మీయ సౌందర్యమును, స్వాతంత్రమును అనుగ్రహించెను. గొర్రె పిల్లయైనవాని వివాహ విందుకు పిలచుచున్నాడు. ఆయన కోరుకునేటువంటి అలంకరణ బాహ్యపు అలంకరణ కాదు, అంతరంగముందు గల అలంకరణ. దేవుడు కోరుకునేటువంటి మొదటి అలంకరణ పరిశుద్ధతయైయున్నది. కావున పరిశుద్ధ అలంకారముతో మనము దేవుణ్ణి ఆరాధించవలెను. దేవుని యొక్క ఆలయమునకు వచ్చుచున్నప్పుడు ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ వస్త్రమును, నీతి వస్త్రమును, బుట్టా అల్లికగల వస్త్రములతో రావలెను.
రెండోవ అంశము, దేవుని బిడ్డలకు గల అలంకరణ సమర్పణగల జీవితమునైయున్నది. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము. అప్పుడు ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు” (కీర్తనలు. 45:10,11). ఇక్కడ తండ్రి ఇంటిని గూర్చి అని చెప్పబడుట ఆది తండ్రియైయున్న ఆదాము యొక్క అవిధేతయు ఆదాము యొక్క స్వభావములే. అందుచేతనే ప్రభువు అబ్రహామును పిలుచున్నప్పుడు: “నీవు నీ దేశమునుండియు, నీ బంధువుల యొద్దనుండియు, నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి, నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము” (ఆది.కా. 12:1) అని చెప్పెను.
మూడోవ అంశము, దేవుని పిల్లల యొక్క అలంకరణ ఏమీటి? “జడలు అల్లుకొనుటయు, దేశమునందుగల బంగారపు ఆభరణపు నగలను పెట్టుకొనుటయు, ఖరీదైన వస్త్రములను ధరించు కొనుటయునైన వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, అక్షయాలంకారముగల
సాధువైనట్టియు, మృదువైనట్టియునైన ఆత్మయగు మీ హృదయపు అంతరంగ గుణమను స్వభావమే మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది” (1. పేతురు 3:3,4).
ప్రభువు మీకు అలంకరణను మాత్రము గాక, కిరీటములను కూడాను అనుగ్రహించియున్నాడు. కిరీటములు అని ఇక్కడ చెప్పబడుట ప్రభువు అనుగ్రహించియున్న అభిషేకము, ఏలుబడి, అధికారములు, శక్తియు మొదలగునవియైయున్నది. మంచి పోరాటమును పోరాడి పరుగును కడ ముగించునప్పుడు, ప్రభువు నీతి కిరీటమును మీకు దయచేయును (2. తిమోతి. 4:7,8).
నేటి ధ్యానమునకై: “శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును” (యాకోబు. 1:12).