Appam, Appam - Telugu

జూలై 01 – ప్రభువు యొక్క స్వరము!

“నేడు, మీరు ఆయన మాట నంగీకరించిన యెడల ఎంత మేలు: ‘అరణ్యమందు …. మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి” (కీర్తనలు. 95:7,8).

ప్రభువు మీతో మాట్లాడవలెనని కోరుచున్నాడు. ఆయన మిమ్ములను ఉజీవింపచేయాలనియు, మిమ్ములను నడిపించాలనియు, తన యొక్క మార్గములో మిమ్ములను తీసుకొని వెళ్లాలనియు కోరుచున్నాడు. కావున మీరు ఆయన యొక్క స్వరమును శ్రద్ధతో విని విధేయత చూపించవలెను.

29 ‘వ కీర్తన అనునది ప్రభువు యొక్క స్వరమునకు అంకితము చేయబడిన ఒక ప్రత్యేకమైన అధ్యాయము. అక్కడ మనము ఇలా చదువుచున్నాము: “యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది; మహిమగల దేవుడు ఉరుముచున్నాడు; మహా జలములమీద యెహోవా ఆసీనుడైయున్నాడు. యెహోవా స్వరము బలమైనది; యెహోవా స్వరము ప్రభావముగలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచుచున్నది; యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచుచున్నాడు.” (కీర్తనలు 29:3-5).

ప్రభువు యొక్క స్వరమును వినడానికి సిద్ధముగా ఉండుడి. ఆదాము మరియు అవ్వలు పగలు చల్లపూట సమయమున దేవుని యొక్క స్వరమును వినిరి (ఆది.కా. 3:8). శాస్త్రవేత్తలు చెప్పుచున్న మాట, రోజులో అత్యంత చల్లపూట సమయము తెల్లవారుజామున మూడు నుండి నాలుగు గంటల మధ్యలో ఉంటుంది. ప్రభువు స్వయముగా ఇలా సెలవిచ్చుచున్నాడు: “నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు.” (సామెతలు 8:17).

ఈ లోకపు శబ్దములు మీ చెవులను, మనస్సులను నింపుటకు ముందుగానే, ప్రభువు స్వరమును వినడానికి ఉదయము పెద్దలకాడనే లేవండి. ఆయన యొక్క హృదయము ఆనందించేలా ఆయనను స్తుతించుడి మరియు ఆరాధించుడి.

ప్రవక్తయైన ఎలీషా ప్రజలకు ప్రభువు యొక్క సందేశమును అందించడానికి ముందు దేవుని యొక్క సన్నిధి కొరకు ఆశపడెను. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: ఒక వాద్యకుడు వచ్చి వాయించుచుండగా ప్రభువు యొక్క కృపగల (హస్తము) సన్నిధి అతని మీదికి వచ్చెను, ప్రవచన అభిషేకము అతనిపై నిలిచెను గనుక, అతను ఈ మాటలను ప్రవచించెను (2 రాజులు 3:15).

మనము లేఖన గ్రంథమునందు బిలామును గురించి కూడాను చదువుచున్నాము. దేవుని యొక్క స్వరమును వినుటకును, ఆయన యొక్క మాటలను పలుకుటకు కోరినప్పుడు, అతడు ఏడు బలిపీఠములను కట్టించి, ప్రభువుకు బలులను అర్పించి, దేవుని వద్ద నుండి వినుట కొరకు కనిపెట్టెను (సంఖ్యా. 23:1-2).

నేడు, ప్రభువు కోరుకునేటువంటి బలి విరిగిన మనస్సే. “విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు.” (కీర్తనలు 51:17). ఆయనను సంతోషపెట్టేటువంటి బలి స్తుతియాగమే; అదియే మన యొక్క జిహ్వాఫలము. మీరు విరిగి,నలిగిన హృదయముతో కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధి మిమ్ములను ఆవరించును. ప్రభువు యొక్క మృదువైన స్వరము మీ యొక్క ఆత్మలో ప్రతిధ్వనించును.

మీ చుట్టూతా వేలాది స్వరములు గందరగోళమను సృష్టించుచున్నప్పటికని, వాటి మధ్యలో “ఇది నా ప్రియుని స్వరము” అని మీరు గుర్తించి, చెప్పేలా ప్రభువు మీ యొక్క ప్రాణమును మేల్కొల్పును.

దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడు మీతో మాట్లాడుటకును మరియు మీ యొక్క సహవాసమునందు ఆనందించుటకును క్రిందకు దిగివచ్చును. పరిశుద్ధాత్ముడు తన నిశ్శబ్దమైన, మృదువైన స్వరముతో మీతో మాట్లాడుటకు కోరుచున్నాడు. అట్టి ప్రేమపూర్వకమైన స్వరమునకై మీ హృదయమును ఎల్లప్పుడును తెరిచియుంచండి.

నేటి ధ్యానమునకై: “నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొనియున్నది నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, నాకు తలుపు తీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టుచున్నాడు” (ప.గీ. 5:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.