Appam, Appam - Telugu

జూన్ 15 – మెప్పు!

“ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని, తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు” (2. కోరింథీ. 10:18).

మెప్పు అనేక రకములైయున్నది. తన్ను తాను మెచ్చుకొనే మెప్పు కలదు. పొరుగువారి వద్ద మేలును పొందుకొనునట్లు వారిని వంచనతో మెచ్చుకునేది కూడా కలదు. అదే సమయమునందు, ప్రభువు వలన వచ్చుచున్న గొప్ప ఔనత్యమైన మెప్పును కలదు. అవును, ప్రభువు వలన మెచ్చుకొనువాడు యోగ్యుడు.

ఒక దినమున అపో. పౌలు కొరింతీ సంఘమును చూచెను. ఒక వైపున, ఎట్టి విషయములోను లోపము లేకుండా అన్నిటియందును పరిపూర్ణత చెందిన సంఘముగా అది కనబడెను. ఆత్మీయ వరములను ఉపయోగించుచున్న సంఘముగా ఉండెను. మరోవైపునైతే, తమ్మును తాము మెప్పులతో మెచ్చుకొనుచు స్వప్రఖ్యాతులను కోరుకొనుచున్నవారు అక్కడ ఉండెను. యేసుక్రీస్తు చెప్పెను: “మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ” (లూకా. 6:26).

కొందరు తమ్మును మనుష్యులు మెచ్చుకొనవలెను అని దానధర్మములను చేయుదురు. ఆలయములకు గొప్ప విరాళమును ఇచ్చి తమ యొక్క పేరు బయటికి రావాలెను అని కోరుకొనుచున్నారు. ఆలయములకు బల్లలు, కుర్చీలు, దీపాలు మొదలగునవి కొన్ని ఇచ్చుచున్నప్పుడు తన యొక్క పేరును అందులో పొదిగించి ఇచ్చుదురు. ఇట్టివారు, లోకమునుందే తమ యొక్క మెప్పునకు గల ఫలితమును పొందుకొనుట చేత పరలోకమునందు అట్టివారికి మెప్పు లేకుండా పోవుచున్నది.

ప్రభువు అంతరంగము యొక్క ఉద్దేశములను ఎరుగువాడు. స్వప్రఖ్యాతి కొరకు చేయుచున్న దానధర్మములు ఏదియు ఆయన అంగీకరించుటలేదు. కావున మీరు దేనిని చేసినను మనుష్యుల యొక్క మెప్పు కొరకు చెయ్యక ప్రభువు కొరకే మనఃపూర్వకముగా చేయవలెను. అప్పుడు రహస్యమందు చూచుచున్న ప్రభువు బహిరంగముగా మీకు పత్రిఫలమును ఇచ్చును.

“ఆయనే నీకు (కీర్తనీయుడు) మెప్పును; నీవు కన్నులార చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే” (ద్వితి. 10:21). అట్టి ప్రభువు నేడును మీకు ఒక వాక్కును ఇచ్చుచున్నాడు. “ఆయన తాను సృజించిన సమస్త జనముల కంటె నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునను” అని సెలవిచ్చిచున్నాడు (ద్వితీ. 26:19).

ప్రభువు మనలను గొప్ప చేసి పొగుడుచున్నప్పుడు, మనుష్యులు ఎన్నడను మనలను కించపరచలేరు. మన యొక్క పేరును చెరుపుటగాని అవమానముగా మాట్లాడుటగాని చేయలేరు. అబ్రహాము వద్ద ప్రభువు: “నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు” (ఆది.కా. 12:2) అని చెప్పెను.

యేసు క్రీస్తు యొక్క మాదిరికరమైన జీవితమును తేరి చూడుడి. ఆయన మనుష్యుల యొక్క మెప్పును కాంక్షించలేదు. తన తండ్రి వలన మెచ్చుకొన బడవలెను అనుట కొరకు ఆయన కనిపెట్టుకొనియుండెను. ఆనాడు ఉన్న పరిసయ్యులను, సదుకయ్యులను చూచి: “నేను మనుష్యుల వలన మహిమ పొందువాడనుకాను. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు?” (యోహాను. 5:41,44) అని అడిగెను. దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క నోరే మిమ్ములను మెచ్చుకొనవలెను. ఆయననే ప్రియపరచుడి.

నేటి ధ్యానమునకై: “అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవునివలననే కలుగును” (రోమీ. 2:29).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.