సెప్టెంబర్ 14 – రాజ్యమును శక్తియును
“మమ్మును శోధనలోకి తేక, దుష్టుని నుండి మమ్మును తప్పించుము, రాజ్యమును, శక్తియును, మహిమయును నిరంతరమును నీదైయుండును” (మత్తయి. 6:13).
ప్రభువు యొక్క ప్రార్థనలో: “రాజ్యమును, శక్తియును, మహిమయును నిరంతరము నీదైయుండును” అని చెప్పి ప్రభువును మహిమపరచునట్లు యేసు సూచించుచున్నాడు. అవును, రాజ్యమును, శక్తియును, మహిమయును ఒకదానితో ఒకటి ఏకమైయుండును. ఒక రాజు తన రాజ్యమును బహు చక్కగా పరిపాలించవలెను అంటే, ఆయనకు శక్తి కావలెను. బలమైన సైన్యాపు యోధులు లేకుండా ఆయన రాజ్యమును సమాధానముతో పరిపాలించలేదు.
మన ప్రభువు యొక్క శక్తి ప్రకృతినంతటిని రూపించినది మాత్రము కాదు, సమస్తమును ఏలేటువంటి రాజరీకపు శక్తియైయున్నది. “(బలము తనదని) శక్తి దేవునిది” (కీర్తనలు. 62:11). ప్రభువు అబ్రహామును పిలిచినప్పుడు: “నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము” (ఆది.కా. 17:1).
మీరు ఎల్లప్పుడును ప్రభువును తెరిచూచి, ప్రభువా నీవు శక్తి గలవాడు, సర్వశక్తి గలవాడు అని చెప్పి స్తుతించుడి. అప్పుడు, సాతాను యొక్క శక్తి తొలగిపోవును. మీరు దేనికిని భయపడరు. ప్రభువు యొక్క శక్తిని ఆశ్రయించినప్పుడు, సింహమువలె ధైర్యముగలవారై ముందుకు కొనసాగి పోవుడి.
క్రీస్తును గూర్చి ప్రవక్తయైన యెషయా: ఆయన “శక్తిగల దేవుడు” అని చెప్పెను (యెషయా. 9:6). రోగములను స్వస్థపరచు శక్తి ఆయనకు గలదు. శాపము యొక్క వెన్నెముకను విరిచి వేసేటువంటి శక్తి ఆయనకు కలదు. దయ్యములను వెళ్ళగొట్టేటువంటి శక్తి ఆయనకు కలదు. మృతులను సజీవముగా లేపేటివంటి శక్తి ఆయనకు కలదు. ఆయన తన యొక్క శక్తిచేత రాజ్యపరిపాలన చేయుచున్నాడు.
అట్టి సర్వ శక్తిమంతుడ్ని తేరి చూడుడి. మీరు తలంచువాటికంటేను, ప్రార్ధించువాటికంటేను బహు అత్యధికముగా మీలో క్రియను చేయుటకు ఆయన శక్తి గలవాడు. ఆయన వద్ద అప్పగించిన దానిని చివరి వరకు నిలబెట్టుటకు శక్తి గలవాడు. నిశ్చయముగా ఆయన నేడు మీకు ఒక అద్భుతమును చేయును.
అబ్రహాము యొక్క శరీరము మృతతుర్యమైన స్థితిలోను తనకు ఒక సంతానమును కలుగజేయుటకు ఆయన శక్తి గలవాడు అను సంగతిని విశ్వసించెను. తన యొక్క కుమారున్ని మోరియా పర్వతపు బలిపీఠముపై పరుండపెట్టినను, మృతులలో నుండి అతనిని సజీవముగా లేపుటకు ఆయన శక్తి గలవాడు అని విశ్వసించెను. అట్టి సర్వశక్తిమంతుడే తొట్రిల్లకుండా చివరి వరకు మిమ్ములను కాపాడుటకు శక్తి గలవాడు. మిగుల సంతోషముతో మిమ్ములను నిష్కలంకులుగా పరలోకమునందు నిలబెట్టుటకు శక్తి గలవాడు.
కావున, ప్రభువు యొక్క శక్తిని ఎల్లప్పుడును ఆశ్రయించుడి. మేము ఆరాధించుచున్న దేవుడు మమ్ములను విడిపించుటకు శక్తి గలవాడు. కాపాడుటకు శక్తి గలవాడు. అంతము వరకు త్రోవ నడిపించుటకు శక్తి గలవాడు అని చెప్పి, విశ్వాసపు ఒప్పుకోలును చేసి, విజయపు నడకను వేయుడి.
నేటి ధ్యానమునకై: “ఇదిగో, పాములను, తేళ్లను త్రొక్కుటకును, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీకెంత మాత్రమును హానిచేయదు” (లూకా. 10:19).