సెప్టెంబర్ 13 – ప్రభువు యొక్క రాజ్యము!
“పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, భూమియందును నెరవేరునుగాక” (మత్తయి. 6:9,10).
“తండ్రి, నీ రాజ్యము మా దేశమునందు వచ్చుగాక” అని తెలుగులో ఈ ప్రార్ధన అమర్చబడియున్నది. అయితే గ్రీకు బైబులు గ్రంథమునందు ప్రభువునకు ప్రేమతో ఆజ్ఞాపించునట్లుగా, “వచ్చుగాక నీ రాజ్యము, నెరవేరునుగాక నీ చిత్తము ” అని తెలియజేయబడియున్నది.
ఒక దినము వచ్చును, నిశ్చయముగా లోకమునందు గల సకల సామ్రాజ్యములును, ఏలుబడులును ప్రభువైయున్న యేసు క్రీస్తునకును, ఆయన పరిశుద్ధులకును సొంతమగును. న్యాయముతోను, నీతితోను ఏలుబడి చేయు దేవుని కుమారుడు లోకరాజ్యముల యొక్క ఏలుబడి బాధ్యతను వహించును. ఆయన పరిశుద్ధులతో కలసి పరిపాలించును.
మన దేశమునందు పలు రకాల అవినీతిలను చూచుచున్నప్పుడు, లంచగొండితనములను, అత్యలను, మానభంగములు మొదలగునవి పెరిగి ఉండుటను చూచి కలత చెందుచున్నప్పుడు, ‘అయ్యా! ప్రభువు యొక్క రాజ్యము త్వరగా వచ్చినట్లయితే, ఎంతగానో బాగుండును’ అని తలంచి తపించుచున్నాము. గ్రహం స్టైన్స్ అను ఆస్ట్రేలియా మిస్టరీ సజీవముగా దహించబడినప్పుడు, ఇట్టి క్రూరత్వమైన స్థితికి ఒక ముగింపు కలుగదా, ప్రభువు యొక్క ప్రేమ రాజ్యము స్థాపించబడదా అని తపించాము.
క్రొత్త నిబంధనలో సుమెయోను అను భక్తుడు నీతిమంతుడుగాను, భక్తిపరుడుగాను ఉండుట మాత్రము గాక, ఇశ్రాయేలు యొక్క ఆదరణ వచ్చుట కొరకు కనిపెట్టుచున్నవాడై ఉండెను. మనము కూడాను ప్రభువు యొక్క రాజ్యము వచ్చుటను ఆశతో ఎదురుచూచి కనిపెట్టుచున్నాము. ప్రవక్తినియైన అన్న బహు కాలము గడిచిన వృద్ధురాళ్ళైనప్పటికిని యెరూషలేము యొక్క విమోచన కొరకు కనిపెట్టుకొనియుండెను అని చదువుచున్నాము (లూకా. 2:38).
రెండు వేల సంవత్సరములకు పూరము బాప్తిస్మమిచ్చు యోహాను పరలోక రాజ్యము సమీపించియున్నది అని ప్రసంగించియున్నట్లయితే, నేటికి పరలోక రాజ్యము ఎంత అత్యధికముగా సమీపించి వచ్చియున్నది అను సంగతిని మనము అర్థము చేసుకొనగలము.
ప్రభువైన యేసు క్రీస్తు వచ్చుచున్నప్పుడు, సాతాను యొక్క సామ్రాజ్యమునకు ఒక ముగింపును కలుగజేయును. చేతి సహాయము చేత పెక్కిలింపబడని రాయియైన యేసుక్రీస్తు వచ్చునప్పుడు, లోక సామ్రాజ్యములను కొట్టి వేసి ఆయన ఒక్కడే రాజాధిరాజుగాను, ప్రభువుల ప్రభువుగాను ఏలుబడిచేయును.
“దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనేయున్నది” (1. కోరింథీ. 4:20). అట్టి శక్తి పరలోకము నుండి వచ్చుచున్న శక్తి (లూకా. 24:49). పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తినొందెదరు (అపో. కా. 1:8). అట్టి శక్తిచేతనే ప్రభువు యొక్క రాజ్యమును భూమి మీద మీరు స్థాపించగలరు.
‘నీ రాజ్యము వచ్చుగాక’ అని మీరు ప్రార్థించుచున్నప్పుడల్లాను, ప్రభువు యొక్క శక్తి కొలతలేకుండా దిగి వచ్చును గాక. ఒకవైపు సాతాను యొక్క ఏలుబడియైయున్న అంధకారపు శక్తులను మీరు ఎదిరించి నిలబడుడి. మరోవైపు క్రీస్తు రాజ్యము జనుల యొక్క హృదయములలో స్థాపించబడినట్లుగా సువార్తను ప్రకటించుడి.
నేటి ధ్యానమునకై: “నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల, నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది” (లూకా. 11:20).