Appam, Appam - Telugu

మే 27 – ఏర్పరచబడిన వంశము!

“అయితే మీరు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును , పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునైయున్నారు” (1. పేతురు. 2:9).

బైబులు వాక్యములను పలుసార్లు మరలా మరలా చదువుచున్నప్పుడు మనము ఎవరు అను సంగతిని మనలను గూర్చి దేవుని యొక్క ఉద్దేశ్యము ఏమిటి అను సంగతిని తెలుసుకొని ప్రభువును మహిమ పరచగలము. ప్రభువు యొక్క దృష్టిలో మనము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును , పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునైయున్నాము.

పాత నిబంధన కాలమునందు అబ్రహము యొక్క వంశమునైన ఇశ్రాయేలీయులను ప్రభువు తన కొరకు ఏర్పరచుకొనెను. వారికి వాగ్దానములను దయచేసెను. వారితో నిబంధనను చేసెను. వారిలో మూలపితులను లేవనెత్తును. వారికై వ్యాజ్యమాడి యుద్ధము చేసెను. కనానులోనున్న ఏడు జనాంగములను ముఫైఒక రాజులను తరిమివేసి పాలును తేనెయు ప్రవహించుచున్న దేశమును స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఏర్పరచబడిన వంశముగా ఉండెను అనుటయె దానికి గల కారణము.

అయితే క్రొత్త నిబంధనకు వచ్చుచున్నప్పుడు దేవుడు క్రీస్తునందు మనలను ఏర్పరచుకొనెను. మన కొరకు అమూల్యమైన రక్తమును చిందించి పాప క్షమాపణను రక్షణ సంతోషమును దయచేసెను. మనకు వాగ్దానములను దయచేసెను. తన యొక్క రక్తము చేత నిబంధనను చేసెను. మనకు పరమ కానానైయున్న పరలోక రాజ్యమును వాగ్దానము చేసి ప్రేమతో వెంటపెట్టుకుని వెళ్ళుటకు సంకల్పించెను.

ప్రభువు దావీదును ఏర్పరచుకున్నప్పుడు తన కుటుంబమలో అల్పముగా ఎంచబడిన తనను ఏర్పరచుకొని గొప్ప చేసిన దయను తలంచి చూడుడి. “ప్రభువు నాకు చేసిన సమస్త మేలుల కొరకు నేను ఏమి చెల్లించెదను” అని ఆయన యొక్క అంతరంగము కృతజ్ఞతతో తపించెను. “రక్షణ పాత్రను చేత ఎత్తి పట్టుకుని ఆయన యొక్క నామమును సన్నుతించెదను” అని చెప్పెను.

కొందరిని ప్రభువు శ్రమల కొలిమిలోను, తల్లి యొక్క గర్వమునందును ఏర్పరచుకొనుచున్నాడు. అయితే కొందరిని, జగత్తు ఉత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొనుచున్నాడు. ఆయన యొక్క ఏర్పాటు ఆశ్చర్యమైనది. జ్ఞానులను సిగ్గుపరచునట్లుగా అజ్ఞానులను ఏర్పరచుకొనుచున్నాడు. బలవంతులను సిగ్గుపరచునట్లుగా బలహీనులను ఏర్పరచుకొనుచున్నాడు. అల్పముగా ఎంచ బడిన వారిని, పరదేశులను ఏర్పరచుకొనుచున్నాడు.

అందుచేతనే పేతురు: “ఆత్మవలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, …. వ్రాయునది” (1. పేతురు. 1:2) అని సూచించుచున్నాడు. దేవుని బిడ్డలారా మీరు ఈ లోకమునందు యాత్రికులును, పరదేశులని పిలవబడినప్పటికీ కూడాను మీరు ఉన్నతమైన దేవుని చేత కొన్నబడిన వారైయున్నారు.

నేటి ధ్యానమునకై: “యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు” (1. పేతురు. 2:5).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.