మే 13 – యూదా గోత్రపు సింహము!
“ఇదిగో, దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను” (ప్రకటన. 5:5).
బైబిలు గ్రంథమునందు, మూడు రకాల గుంపు వారిని సింహమునకు పోలిన వారిగా వర్ణించబడుటను చూచుచున్నాము. మొదటిగా, యూదా గోత్రపు సింహమైయున్న యేసుక్రీస్తు (ప్రకటన. 5.5). రెండోవది, నీతిమంతులు (సామెతలు. 28:1). మూడోవది, ఎవరిని మృంగుదునా అని సంచరించుచున్న సాతాను (1. పేతురు. 5:8).
సాతానును బైబిలు గ్రంథము సింహమువలె అని చెప్పినను అతడు సింహమువలె ధైర్యము గలవాడు కాదు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “కాబట్టి, దేవునికి లోబడియుండుడి; అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్ద నుండి పారిపోవును” (యాకోబు. 4:7).
సాతాను పిరికితనపు స్వభావము గలవాడు. ముందుగానే ఓడించ బడినవాడు. క్రీస్తు సిలువలో అతని తలను చితకకొట్టెను, అతని యొక్క శక్తిని, అధికారమంతటిని పెరికివేసేను. నీతిమంతులు ధైర్యముగా అతనిని ఎదిరించి నిలబడి జయమును పొందుదురు. అతడు సమస్యలను తీసుకుని వచ్చుచున్నప్పుడు మనము అతనిని ఎదిరించి నిలబడవలెను. పోరాటములు వచ్చుచున్నప్పుడును, వ్యతిరేకత పెరుగుచున్నప్పుడును సొమ్మసిల్లిపోకూడదు. ఆపత్కాలమునందు మనము సొమ్మసిల్లి పోయినట్లయితే మనము బలమును క్షీణించినవారమై యుందుము.
కొందరు బల్లి, బొద్దింక వంటి వాటికి భయపడుదురు. మీరు చిట్టెలుక కాదు, చిట్టెలుకయే భయపడి అక్కడికి ఇక్కడికి పరిగెత్తి దాగుకొనును. మీరు సింహములు, యూదా గోత్రపు రాజు, సింహాసనమునందు మీకు సమీపములో ఆసీనుడైయున్నాడు.
ధైర్యమును, ఆసక్తి గల ప్రార్ధనయు మిమ్ములను బలపరుచుచున్నవై ఉండును. వ్యాధులలోనే అతి పెద్ద వ్యాధి, భయము అను వ్యాధియే. కొందరు ప్రతికూలమైన ఓటమి మాటలను మాట్లాడి వ్యాధిగ్రస్తులను భయపెట్టుదురు.
ఇట్టి రోగము వచ్చినట్లయితే నూటికి ఒక్కరే బ్రతుకుదురు అనియు, నాకు తెలిసిన ఇరవై మందికి ఈ రోగము వచ్చిన వారిలో పంతొమ్మిది మంది చనిపోయిరి అనియు చెప్పుదురు. ఈ సంగతిని విన్న రోగిష్ఠి భయము చేతనే మరణించెదరు. అయితే నీతిమంతులు, ఇటువంటి మాటలకు భయపడక సింహమువలె ధైర్యముగా ఉందురు.
పేతురును యోహానును మాట్లాడుచున్న ధైర్యమును ప్రజలు చూచి, వారు విద్యాలేని పామరులనియు, జ్ఞానము లేని వారనియు గ్రహించియున్నందున ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తుపట్టిరి. పేతురు యొక్క ధైర్యమునకు గల రహస్యము ఏమిటి? ఆయన యేసుతో కూడా ఉండినవాడు అనుటయె.
సింహముతో కూడా ఉంటున్న సింహపు పిల్లకు కూడాను సింహమువలె ధైర్యమును కలిగియుండును. మనము ఎంతకెంతకు ప్రభువు యొక్క ప్రసన్నతలో ఉందుమో, ఎంతకంతకు ఆత్మలో నింపబడుచున్నామో, అంతకంతకు ధైర్యమును శక్తియు మనలో ఉండును. పేతురును, యోహానును అతి గొప్ప వేదశాస్త్రులు కారు. అయితే వారు వరిసయ్యులు, సద్దుకయ్యులు ఎదుట సువార్తను ధైర్యముగా ప్రకటించిరి. గొప్ప ఉజ్జీవమును కలుగజేసిరి. దేవుని బిడ్డలారా, ధైర్యముగా ఉండుడి; ప్రభువు మీతో కూడా ఉన్నాడు.
నేటి ధ్యానమునకై: “నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి; నా ప్రాణములో త్రాణపుట్టించి నన్ను ధైర్యపరచితివి” (కీర్తనలు. 138:3).