Appam, Appam - Telugu

నవంబర్ 21 – చూచుచున్న ప్రభువు!

“యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును” (సామెతలు. 15:3).

చైనా దేశమునందు ఒకానొక కాలములో చక్రవర్తిగా ఉన్న మిగుల గొప్ప పేరుగాంచిన, షిహాంగ్ (Shi Huang) నకు ఎనభై వేల కన్నులు అని చెప్పుచున్నారు. ఎందుకని ఆయనకు అట్టి పేరు వచ్చేనో తెలియునా? ఆయన తన దేశమునకు చుట్టూతా గొప్ప ప్రహరీ గోడను కట్టి అందులో నలభై వేల కావలి గోపురములను నిలబెట్టేను. విరామము లేకుండా దేశమును కావలి కాయుట కొరకు, పగటియందు నలభై వేల మంది యుద్ధ యోధులను, రాత్రియందు నలభై వేల మంది యుద్ధయోధులను నియమించెను.

పగటివేల ఎనబై వేల కన్నులు దేశమును కావలి కాసెను. రాత్రివేళ ఎనబై వేల కన్నులు కావలి కాసెను. తమ్మును అంత ప్రేమతోను, అక్కరతోను జాగ్రత్తగా కాపాడుచూ పరిపాలించుచున్న అట్టి రాజును ప్రజలు బహుగా కీర్తించిరి.

సొలోమోను తాను కట్టిన ఆలయమును ప్రతిష్ట చేసినప్పుడు ప్రభువు తట్టు చూచి: “యెహోవా నా దేవా, …. ఈ స్థలమైన యీ మందిరముతట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక (1. రాజులు. 8:28,29) అని చెప్పి ప్రార్ధించెను.

అంత మాత్రమే కాదు, “కాబట్టి నీ దాసుడనైన నేను చేయు విన్నపము మీదను, ఇశ్రాయేలీయులగు నీ జనులు చేయు విన్నపము మీదను, దృష్టియుంచి, వారు ఏ విషయములయందు నిన్ను వేడుకొందురో ఆ విషయములయందు వారి విన్నపముల నాలకించుము” (1. రాజులు. 8:52) అని చెప్పి విజ్ఞాపన చేసెను.

ప్రభువు యొక్క కన్నులు ఎటువంటి కన్నులు? “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది” (2. దినవృ. 16:9).

ప్రభువునకు ఏడు కన్నులు ఉండుటను బైబిలు గ్రంధమునందు చదివి తెలుసుకొనగలము. దాని తాత్పర్యము ఏమిటి? ఆయన సమస్తమును సంపూర్ణముగా చూచువాడు. ఆయన దృష్టియందును, గమనించుటయందును ఒక పరిపూర్ణత కలదు. ఆ ఏడు కన్నులు అనుట ప్రభువు వద్ద నుండి బయలుదేరి వెళ్ళుచున్న ఏడు ఆత్మలను సూచించుచున్నది.

బైబిలు గ్రంధము సెలవిచ్చుచున్నది: “వధింపబడినట్లుండిన ఒక గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు” (ప్రకటన. 5:6).

మిమ్ములను బహు జాగ్రత్తగా కాపాడుచున్న మన ప్రియ ప్రభువును గూర్చి బైబిలు గ్రంధము “ఆయన నీ పాదమును తొట్రిల్లనియ్యడు; నిన్ను కాపాడువాడు కునుకడు. ఇదిగో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు” (కీర్తనలు. 121:3,4) అని చెప్పుచున్నది.

దేవుని బిడ్డలారా, కునుకని కన్నులు గలవాడిని మీరు మనసారా స్తుతించదెరా? ఆయన యొక్క కన్నులు ఎల్లప్పుడును మీ మీద తదేకముగా ఉన్నది.

నేటి ధ్యానమునకై: “ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దానిగూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను” (యెషయా. 27:2,3).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.