Appam, Appam - Telugu

మే 31 – ఆనకట్టలేదు!

“నైలునది ప్రవహించునట్లుగా నీవు నీ దేశములో ప్రవహించుము, నీ దేశమునకిక (నడి) ఆనకట్టు లేకపోవును” (యెషయా. 23:10).

ప్రవక్తయైన యెషయా పలు దేశములను గూర్చి ప్రవచనమును ప్రవచించి చివరిగా తర్షీషు కుమారిని చూచి నది ప్రవహించునట్లుగా నీవు నీ దేశములో ప్రవహించుము, నీ దేశమునకిక ఆనకట్టు లేకపోవును అని చెప్పుచున్నాడు.

మనమైతే ప్రభువు యొక్క నదులము, దేవుడును గొర్రెపిల్ల యొక్క సింహాసనము వద్ద నుండి బయలుదేరి వచ్చుచున్న నదులము. మనలోనుండి జీవజలముల నదులు బయలుదేరి వచ్చును. నదులు దేశమునకు గొప్ప ఆశీర్వాదకరముగా ఉన్నాయి.

నదులు అనేవి నీళ్లను దేశములో ప్రవహింపకొండునట్లు కొందరు అడ్డగించి ఆనకట్టను నిర్మించి నీళ్లను నిలువ చేసి ఉంచుదురు. ప్రభువైతే మనము ఒకచోట నిలువ చేయబడి ఉండుటకు కోరుకొనక ప్రవహించి వెళ్లవలెను అని కోరుచున్నాడు. ఆటంకములను తీసివేయుచున్నాడు. నీవు నీ దేశములో ప్రవహించి వెళ్ళుము, నీకు ఆనకట్ట లేదు” అని ప్రేమతో ఆశీర్వదించుచున్నాడు.

ఒక కుటుంబమునందు ఒక సహోదరికి ప్రభువు స్వస్థపరచు వరమును, ప్రవచనపు వరమును ఇచ్చియుండెను. బహు చక్కగా ప్రార్థించుచున్న వారికి లేచి ప్రకాశించవలెను అను ఆశ అత్యధికముగా ఉండెను. అయితే ఆ సహోదరి యొక్క అత్తగారు వారిని పరిచర్యకు వెళ్ళుటకు అనుమతించలేదు. కొండాలు చెప్పుచూను, సొణుగుచూను పరిచర్యను ఆటంకపరచుచూ ఉండెను.

ప్రభువు ఒక దినమున తారసపడెను. ఆటంకమును తొలగించి, పరిచర్యలోనికి ఆ సహోదరిని తీసుకొని వెళ్ళుటకు కోరెను. అత్తగారిలో కల్వరి ప్రేమను ప్రభువు కుమ్మరించెను. ఆత్మ భారమును అనుగ్రహించెను. కొన్ని దినముల లోగా అత్తగారును కోడలు కలిసి పరిచర్యలోనికి దిగిరి, రెండంతల ఆశీర్వాదము. వయస్సులో పెద్దవారైన అత్తగారి యొక్క ఆలోచనలును, సహోదరి యొక్క ఆత్మీయ వరములును పరిచర్యలో మిగుల ప్రయోజనకరముగా ఉండెను.

నేడు ఆనకట్టలవలె ఆటంకములు మీ పరిచర్యలో ఉన్నాయా? లేవవలసిన స్థాయికి లేవలేక, ప్రకాశింపవలసిన స్థాయికి ప్రకాశింపలేక ఉన్నారా? ఆటంకమైయున్న ఎట్టి ఆనకట్టనైనను మార్చుటకు కోరుచున్నాడు. బైబిలు గ్రంథము సెలవిస్తున్నది: “(ప్రాకారములు) ఆటంకములను పడగొట్టువాడు వారికి ముందుగా నడిచిపోవును; వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా లోపల ప్రవేశించి దాటిపోవుదురు; వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండి నడిచి వెళ్ళును” (మీకా. 2:13).

ఒకవైపున ప్రభువు ఆటంకములను తొలగించువాడు. మరోవైపున ఒంక్కరిగా ఉన్నవాటిని తిన్నగాచేయువాడు. అరణ్యమునందు త్రోవలను, ఎడారులలో నదులను కలుగజేయువాడు. దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితములో ఆనకట్ట అడ్డుపడునట్లుగా గొప్ప ఆటంకములను చూచుచున్నారా? ఏదో ఒక కరకములో అడ్డగించబడియున్న పరిస్థితిని గ్రహిస్తున్నారా? నేడు ప్రభువు బలమైన పరాక్రముగల సూరుడిగా మీ కొరకు ఏంతెంచియున్నాడు. ఆత్మ సంబంధమైన జీవితములో ఒక విడుదలను, పరిచర్యలో ఒక ఉజ్జివమును, ఆత్మల సంపాదయమునందు ఒక వేగమును ఆయన మీకు అనుగ్రహించును.

నేటి ధ్యానమునకై: “ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు; ఇక మీదట మీకు అపాయము సంభవింపదు” (జెఫన్యా. 3:15).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.