మే 22 – సత్యములోనికి నడిపించును!
“సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు, మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును” (యోహాను. 16:13).
లోక ప్రకారమైన జీవితమునందు ప్రభువు మనతో నడిచి, మనలను త్రోవ నడిపించుట మాత్రము గాక, ఆత్మసంబంధముగాను మనలను త్రోవ నడిపించుచున్నాడు. మనలను త్రోవ నడిపించుట కొరకే దేవుడు సత్య స్వరూపియగు ఆత్మయైన ఆదరణకర్తను మనకు అనుగ్రహించియున్నాడు. ఆయన వచ్చుచున్నప్పుడు సర్వ సత్యములోనికి మిమ్ములను నడిపించును (యోహాను. 16:13) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది.
సర్వ సత్యములోనికి మనము త్రోవ నడిపించబడితేనే ప్రాణములో పరిపూర్ణత చెందగలము. ఏదో ఒక సత్యమును ప్రాముఖ్య పరుచుటకును మిగతా సత్యములను తృణీకరించినట్లయితే మనము పరిపూర్ణత చెందలేము. కావున మనలను నడిపించుచున్న ప్రభువు సర్వ సత్యములోనికి మనలను త్రోవ నడిపించునట్లు సత్య స్వరూపియగు ఆత్మయైన ఆదరణకర్త ద్వారా మనకు బోధించి నడిపించుచున్నాడు.
లేఖన గ్రంథము అనునది సత్య గ్రంథము అని పిలవబడుచున్నది. దేవుని కుమారుడైన యేసు కూడాను సత్యము అని పిలవబడెను. “నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను” (యోహాను. 14:6). అని ఆయన శృంగనాథము చేసి చెప్పెను. అదే రీతిలో పరిశుద్ధాత్ముడు కూడాను సత్య స్వరూపియగు ఆత్ముడు అని పిలువబడుచున్నాడు (యోహాను. 16:13). మీరు పరిపూర్ణ సత్యములోనికి త్రోవ నడిపించ బడుచున్నప్పుడు మీయొక్క జీవితము అంతటను విడుదల సంపూర్ణమైయుండును. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును” (యోహాను. 8:32).
భారతదేశము స్వాతంత్రము పొందుచున్నప్పుడు దేశము యొక్క ప్రాముఖ్యతకు ఎట్టి మాటను ఎన్నుకుందాము అని దేశము యొక్క నాయకులు ఆలోచన చేసిరి. చివరకు “సత్యమేవ జయతే” అను మాటను ఎన్నిక చేసుకొనిరి. సత్యమే జయము పొందును. లోకమునందు వేల సంఖ్యలో మతములును మార్గములును ఉండినప్పటికిని సత్యమే జయము పొందును అనుటయే దాని అర్థము. లేఖన గ్రంథము చొప్పున చూచినట్లయితే సత్యమైయున్న యేసుక్రీస్తే జయమును పొందును.
కావున మనము జయము పొందునట్లుగా సత్యమైయున్న యేసు క్రీస్తు యొక్క మార్గమునందును, సత్యస్వరూపియగు ఆత్మ త్రోవ నడిపించుచున్న సంపూర్ణమైన సత్యములోనికిని వచ్చి తీరవలెను. సత్యమేవ జయతే అను మాటను సత్యమే జయించును అని తెలుగు భాషలో అనువాదము చేసిరి. సత్యమే అను మాటకు వాస్తవము అనుట అర్థము. మన యొక్క జీవితమునందు వాస్తవము అవశ్యముగా ఉండవలెను. కొద్దిపాటియందు మనము నమ్మకమైన వారిగా ఉండినట్లయితే అనేక వాటిని మీద అధికారిగా ప్రభువు మనలను నియమించును.
పిలాతు ఎదుట యేసు నిలబడినప్పుడు, పిలాతు యేసుని చూచి సత్యము అనగా ఏమిటి అని అడిగెను. యేసు అట్టి ప్రశ్నకు జవాబు చెప్పే లోపల పిలాతు వలన ఓపికతో ఉండలేకపోయెను. సత్యమును గూర్చి ఎరుకుటకు కోరినను అంగీకరించుటకు అతనికి మనస్సు లేకుండెను. కారణము, ఆయన దేవుని ప్రియ పరచక, మనుష్యులను ప్రియ పరచుటకు కోరి, సత్యవంతుని సిలువ వేయుటకు అప్పగించెను. నేడును అనేకులు సత్యమును సిలువవేయుచున్నారు.
దేవుని బిడ్డలారా, సత్యము కొరకు వైరాగ్యముగా నిలబడినట్లైతే సత్యము మీ కొరకు వైరాగ్యముగా నిలబడును.
నేటి ధ్యానమునకై: “ధర్మశాస్త్రము మోషేద్వారా అనుగ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను” (యోహాను. 1:17).