Appam, Appam - Telugu

నవంబర్ 26 – ప్రార్థించవలెను!

“ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును” (యోహాను. 16:24).

ప్రార్ధించవలెను అని అంతరంగీక గ్రహింపును మీలో తట్టి లేవనెత్తుడి. అత్యున్నతమైన ప్రార్ధనా యోధునిగా ఉండవలెను అను తపన మీలో ఉండవలెను. ప్రార్థన ఆత్రుతను పూరి కోల్పోటువంటి పుస్తకములను చదువుడి. ప్రార్థనను మీ హృదయము యొక్క ప్రతి నాడితోను, శ్వాసతోను ఏకము చేసుకొనుడి.

వృద్ధాప్యమునందు ఒకరు నూతనముగా రక్షింపబడెను. ప్రార్థించవలెను అను తపన ఆయనకు ఉండెను. అయితే ప్రార్థించుటకు తెలియదు. ఆయన యొక్క సంఘకాపరి అయిన వద్దకు వచ్చి “అయ్యా ప్రార్థన అనుట చాలా సులువైనది. ప్రభువుతో మనస్సును విప్పి మాట్లాడుటయే ప్రార్ధన. మీరు ఎల్లప్పుడును ఉదయమున లేచిన వెంటనే, మీ చెంతన ఒక కుర్చీని వేసి ఆ కుర్చీలో యేసు క్రీస్తు కూర్చుండి ఉన్నట్లుగా తలంచుకొనుడి.

మీరు మీ స్నేహితుల వద్ద ఎలా మనస్సును విడిచి ఉత్సాహముగా మాట్లాడుచుందురో, అలాగునే క్రీస్తుని కూడా స్నేహితునిగా భావించి మస్తమును మాట్లాడుడి. మీ యొక్క సమస్యలను చెప్పుడి, పోరాటములను తెలియజేయుడి. ఆయన మిమ్ములను స్నేహితుడు అని పిలిచియున్నాడు. కావున ధైర్యముగా ఆయనను మీరు సమీపించవచ్చును” అని చెప్పెను.

ఆ దినము మొదులుకొని ఆయన తనకు ముందుగా ఒక కుర్చీని వేసుకుని అందులో యేసు కూర్చుండినట్లుగా భావించి స్నేహితుడి వద్ద మాట్లాడుచున్నట్లు యేసునితో మాట్లాడటకు ప్రారంభించెను. అలాగున మాట్లాడుచూ మాట్లాడుచూ ఉండగా ఆయనకు మిగుల ఉత్సాహము ఏర్పడెను. అది అత్యధిక సంతోషమును ఇచ్చేను. ప్రభువు తన యొక్క ప్రార్థన ఆలకించుచున్నాడు అను తలంపు పరవశింపచెసెను. ఎక్కడికి వెళ్ళినను ఆ కుర్చీని తనతో పాటు వెంటపెట్టుకొని వెళ్ళుటకు ప్రారంభించెను. భోజనము తిను చున్నప్పుడు భోజన బల్లకు సమీపమున వేసుకొనును. రాత్రి యందు పండుకొనుచున్నప్పుడు మంచము ప్రక్కనే వేసుకొనును. ఇది యేసుక్రీస్తు యొక్క కూర్చి. ఏ ఒక్కరును దీనిపై కూర్చుండ కూడదు అని చెప్పుచుండును.

ఆయన వయస్సు మళ్ళీనవాడై వ్యాధి బారిన పడినప్పుడు కూడాను ఆయన యొక్క కన్నుల ఎదుట ఆ కుర్చీ ఎల్లప్పుడును ఉండెను. ప్రభువును నా ఎదుట ఎల్లప్పుడును ఉంచుకొని ఉన్నందున నేను కదల్చబడను అని చెప్పెను. కొన్ని దినముల తరువాత ఆయన యొక్క మాట ఆగిపోయెను. ఆయన మరణించు సమయములో మిగుల కష్టపడి తన యొక్క రెండు చేతులను చాపి ఆ కుర్చీపై పెట్టెను. ఆయన యొక్క ప్రాణము వెడలి పోయెను. అది ఎంతటి చక్కటి అంశము అది!

ప్రభువును ప్రేమతో తేరి చూచుట కూడాను ఒక ప్రార్ధనయే. “భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి; దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు” (యెషయా. 45:22) అని ప్రభువు చెప్పెను. “నాకు సహాయము వచ్చు కొండలతట్టు నా కన్నులను ఎత్తుచున్నాను. యెహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు” (కీర్తనలు. 121:1,2) అని చెప్పెను దావీదు! దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మీ సమీపమున నిలబడి మిమ్ములను గమనించుచున్నాడు అను సంగతిని గ్రహించినవారై కొనసాగించి ప్రార్థించుడి.

నేటి ధ్యానమునకై: “మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” (యోహాను. 16:23).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.