జూలై 29 – సంచరించుచున్న ప్రభువు!
“పగలు చల్లపూట సమయమున …. తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును వారు వినిరి” (ఆది.కా. 3:8).
ప్రభువు సంచరించువాడు. దేవుని బిడ్డల యొక్క గృహములయందును, ఆరాధన స్థలములయందును, దిగివచ్చి సంచరించువాడు. ఇద్దరు లేక ముగ్గురు ఆయన యొక్క నామమునందు ఏకీభవించి చేరి వచ్చినట్లయితే చాలును, ప్రభువు యొక్క ప్రసన్నత అక్కడికి దిగి వచ్చును. ప్రభువు వారి మధ్యలోనికి వచ్చి సంచరించుటకు ప్రారంభించును.
‘నా యొక్క నామమును ప్రసిద్ధిచేయు ప్రతి స్థలమునందును నేను వచ్చెదను, సంచరించెదను, నిన్ను ఆశీర్వదించెదను’ అని ప్రభువు వాగ్ధానమును చేయుచున్నాడు. ఆకాశమును భూమిని కలుగజేసిన మహా గొప్ప ప్రభువు మనుష్యుల మధ్యలో నివాసము చేసి వారికి మేలు చేయునట్లు సంచరించుచు వచ్చుట ఎంతటి అద్భుతమైన ఒక అంశము!
సింహపు గృహలో సంచరించుటకు ప్రభువు వచ్చునా? నిశ్చయముగానే వచ్చును. దానియేలునకు సహాయము చేయునట్లు సింహములనోళ్లను ముయుటకు ఆయన దిగివచ్చెను. అగ్నిగుండమునందు వెయ్యబడిన షద్రక్కు, మేషెకు, అబేద్నెగులతో కూడా విడుదల నాయకుడిగా సంచరించెను. యేసు అను నామమునందు భూమి మీదకి వచ్చినప్పుడు సొలోమోను మండపమునందు ఆయన సంచరించుచుండెను (యోహాను. 10:23).
యేసు పునరుత్థానుడైన తరువాత నిలువుటంగి ధరించి, రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండి, సువర్ణ దీపస్తంభముల మధ్యలో సంచరించుచుండెను (ప్రకటన. 1:13). ఇట్టి దీపస్థంబములు సంఘమును బయలుపరచుచున్నదై ఉండినప్పటికిని మరోవైపున ప్రభువు కొరకు లేచి ప్రకాశించుటకు సమర్పించుకున్న వారినే చూపించుచున్నది. “నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను” (యెషయా. 60:1).
దీపస్తంభముల మధ్యలో ఎవరు సంచరించగలరు? ప్రత్యక్షపు గుడారమునందు గల దీపస్తంభము మధ్యలో యాజకులు మాత్రమే సంచరించగలరు. యేసు ఎప్పుడు సజీవముగా తిరిగి లేచెనో, ఆనాడే ఆయన ప్రధాన యాజకుడు అను నామమును ధరించుకొనెను (హెబ్రీ. 5:10). పునరుత్థానుడైన యేసు క్రీస్తు మన మధ్యలో ప్రధాన యాచకుడుగా మనలను ప్రకాశింపజేయుటకు శక్తిగలవాడిగా సంచరించుచూనే ఉన్నాడు.
దీపస్తంభముల మధ్యలో సంచరించుచున్న యేసు ఏమి చేసెను? మనలను ప్రకాశింపజేసెను. లోకములోనికి వచ్చి ఎట్టి మనుష్యుడనైనను ప్రకాశింపజేయుచున్న వెలుగే ఆ నిజమైన వెలుగు. కాశింపజేయునట్లు అభిషేక తైలమును కుమ్మరించుచూనే ఉన్నాడు. మకమకలాడుచున్న వత్తిని మండించి ప్రకాశింపజేయుచున్నాడు. ఆత్మీయ వారములను మండించి రేపుచున్నాడు.
దీప స్తంభముల మధ్యలో సంచరించుచున్న యేసు ఇంకా ఏమేమి చేయగలడు అను సంగతిని చూడుడి. ఆయన మాడిపోయిన వత్తిని కత్తిరించి వేయును. ఎవరెవరిలో స్వార్థము, గర్వము, అతిశయము, అహంకారము మొదలగు మాడిపోయిన వత్తి కనబడుచున్నదో వాటినన్నిటిని కత్తిరించి సరిచేయను. దేవుని బిడ్డలారా, అంధకారముతో కమ్ముకొనియున్న ఈ లోకములో ప్రభువు యొక్క వెలుగును తీసుకొని వచ్చునట్లుగా మనము పిలువబడియున్నాము కదా?
నేటి ధ్యానమునకై: “దేవుడు వెలుగైయున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు” (1. యోహాను. 1:5).