జూలై 13 – కుమారుడా ధైర్యముగా ఉండుము!
“కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నది” (మత్తయి. 9:2).
లోకము పలు రకములుగా మిమ్ములను సోమ్మసిల్లున్నట్లుగా ప్రయత్నించుచున్నది. సాతాను నిస్పృహలను, దుఃఖములను తీసుకుని వచ్చుచున్నాడు. దుష్టులైన ప్రజలు కఠినమైన మాటలచేత మనస్సును వేదనపరచున్నారు. కానీ మన ప్రియ ప్రభువైయితే, ఎల్లప్పుడును మిమ్ములను ఆదరించి, ఓదార్చి బాలపరచువాడై ఉన్నాడు.
“కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నది” అని ఆ పక్షవాయు గలవానిని చూచి చెప్పుచున్న మాటను కొద్దిగా ధ్యానించి చూడుడి. బహుశా ఆ పక్షవాయు గలవానిని, క్రీస్తుని వద్దకు తెచ్చినప్పుడు అక్కడ ఉన్న వారందరును: ‘ ఇతడు తమ మూలపితరులు యొక్క శాపములను అనుభవించుచున్నాడు; బాగా అనుభవించాలి’ అని తమ యొక్క ఉద్దేశమును తెలియజేసి ఉండవచ్చు. కానీ, అతడు వ్యాధి చేత పూర్తిగా బలహీనుడైయుండెను.
అతడు జీవించు దినములన్నిటను ఇతరులపై ఆధారపడి జీవించవలెను. వాని వలన అతనికి మాత్రము గాక ఇతరులకు కూడాను కష్టము. ప్రభువు ప్రేమతో అతనిని చూచి మొదటిగా, కుమారుడా, అని పిలిచెను. ఎంతటి మధురమైన మాట ఆ మాట! నీవు నా కుమారుడవు. నేను నిన్ను నా యొక్క పోలిక చొప్పున, నా యొక్క స్వరూప్యమునందును కలుగజేసియున్నాను. నీవు నా యొక్క బిడ్డవు. కుమారుడా, అని పిలిచిన ఆ పిలుపు ఆ సహోదరుడ్ని ఎంతగా బలపరిచియుండును.
దేవుని బిడ్డలారా, మీరు బహుశా మనస్సునందు నిస్ప్రుహచెంది ఉండవచ్చును. అయితే ప్రభువు మిమ్ములను ప్రేమతో: “కుమారుడా, కుమార్తె” అని పిలచుచున్నాడు. అట్టి దైవీక స్వరమును ధ్యానించు చూడుడి. అట్టి వాత్సల్యత గల స్వరమును మీయొక్క చెవులు వినునుగాక.
రెండోవదిగా, ‘నీవు ధైర్యముగా ఉండుము’ అని చెప్పుచున్నాడు. అవును, మీరు ధైర్యముగా ఉన్నప్పుడు, మీలో దైవీక బలము వచ్చును. మీరు ధైర్యముగా ఉన్నప్పుడు, పరలోక శక్తి మిమ్ములను నింపును. ధైర్యముగా ఉన్నప్పుడు విశ్వాసపు యోధులుగా మారిపోవుదురు.
మూడోవదిగా, “నీ పాపములు నీకు క్షమింపబడియున్నది” అని ప్రభువు చెప్పుచున్నాడు. వ్యాధికి గల కారణమును అర్థము చేసుకొనిన ప్రభువు, ఆ వ్యాధికి కారణమైయున్న పాపమును తొలగించుటకు సంకల్పించెను. పాపమును తొలగించినప్పుడు మరలా ఆ పక్షవాయు రోగము రాదు. రోగములు పీడించదు.
అవును, కేవలము పై పైన స్వస్థపరచి పంపించుటకు ప్రభువు కోరుటలేదు. ఆ పక్షవాయు రోగము యొక్క వేరైయున్న పాపమును పూర్తిగా అతని యొక్క జీవితములో నుండి పెరికి పడవేయుటకు ప్రభువు సంకల్పించెను. రెండు అద్భుతములను అతడు పొందుకొనెను. ఒకటి, అతని యొక్క శరీరమునందు స్వస్థత. రెండోవదిగా ఆత్మీయ స్వస్థత. శరీరము నందు గల పక్షవాయువు రోగము తొలగిపోయెను. ప్రాణములో పాపము వలన వచ్చిన రోగము కూడాను తొలగిపయెను. హల్లెలూయా!
నేటి ధ్యానమునకై: “పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవానిని చూచి – నీవు లేచి నీ మంచ మెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా. వెంటనే వాడు లేచి, తన యింటికి వెళ్లెను” (మత్తయి. 9:6,7).