Appam, Appam - Telugu

జూన్ 28 – పేటుబీటులలో విశ్రమించు పావురమా!

“బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా” (ప. గీ. 2:14).

మీరు క్రీస్తునందు మరుగైయుండి జీవించు జీవితమును ప్రభువు కోరుచున్నాడు. అనేకులు తమ్మును బహాటముగా బయట చూపించుకొందురు, అతిశయముగా మాట్లాడుదురు. నన్ను చూడుము, నా అందమును చూడుము, నా హోదాను చూడుము, నా చదువును చూడుము, నా బిరుదులను చూడుము, నా పదవులను చూడుము, పేరు ప్రఖ్యాతులను చూడుము అని చెప్పుచున్నారు. మనుష్యుల ఎదుట తమ్మును గొప్పవారిగా చూపించు కొందురు. ఇటువంటి వారికి పరలోకమునందు పాలు లేదు.

కొండ ప్రసంగములో క్రీస్తునందు తమ్మును మరుగు పరచుకొని జీవించు ఔనత్యమైన జీవితమును ఆయన బోధించెను. దానధర్మములు చేయుచున్నప్పుడును, ప్రార్థించుచున్నప్పుడును, ఉపవాసము ఉన్నప్పుడును ఒక వ్యక్తి తన్ను తాను మరుగుపరుచు కొనవలెను అని ప్రభువు చెప్పెను.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియక ఉండవలెను” (మత్తయి. 6:3). “నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి బహిరంగముగా నీకు ప్రతిఫలమిచ్చును” (మత్తయి. 6:6).

“ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖమును కడుగుకొనుము. అప్పుడు, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు బహిరంగముగా ప్రతిఫలమిచ్చును” (మత్తయి. 6:17,18).

ప్రభువు మిమ్ములను వాడుకొనవలెను అంటే, బండ సందులలోను, కొండ శికరముల పేటుబీటులలోను దాగియుండి జీవించుచున్న పావురముల అనుభవము మీకు ఉండవలెను (ప.గీ. 2:14). మిమ్ములను మరుగుపరచుకొని క్రీస్తును బయలుపరచుడి. నేను తరుగవలెను ఆయన పెరుగవలెను అని బాప్తీస్మము ఇచ్చు యోహాను చెప్పినట్లుగా మిమ్ములను మరుగుపరుచుకుని క్రీస్తును హెచ్చించుడి. ఆయనను గొప్పచేయుడి.

ప్రభువు ఏలియాకు తరిఫీదును ఇచ్చినప్పుడు, మరుగైయుండి జీవించు తరిఫీదునే అత్యధికముగా ఇచ్చేను. ఆహాబు రాజునకు ముందుగా ఏలియా బయలు పరచబడిన వెంటనే; “నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతువాగు దగ్గర దాగియుండుము” (1. రాజులు. 17:3) అని చెప్పెను.

పేరును, ప్రఖ్యాతిని కోరుకొనువారి వలన దాగియుండి ప్రశాంతముగా పరిచర్యను చేయలేరు. అయితే ప్రభువు, కీటకమువలే దాగియుండి జీవించు జీవితమునే మీ వద్ద ఎదురుచూచున్నాడు.

దేవుని యొక్క బిడ్డలకు, ఉన్నత స్థితియందు జీవించుట మాత్రము తెలిస్తే సరిపోదు, దీన స్థితియందును జీవించుట తెలియవలెను. కొదువను స్వీకరించుట కూడాను తెలియవలెను, దాగియుండి జీవించుటకు కూడాను తెలియవలెను. ఎట్టి స్థితిలోను ప్రభువు ఉంచినను మనస్సునందు సంతోషముగా ఉండుటకు నేర్చుకొనవలెను.

నేటి ధ్యానమునకై: “ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును” (కీర్తనలు. 27:5).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.