జూన్ 23 – ఎమ్మాయు!
“వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడదూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్లెను” (లూకా. 24:13).
జీవితము అనునది ఒక పయనము. లోకమునందు పుట్టిన ప్రతి ఒక్కరు తమ పయనమును ప్రారంభించిరి అనుట వాస్తవమే. అయితే అట్టి పయనము ఎక్కడ ముగించుచున్నారు అనుటయే ప్రాముఖ్యమైనది.
ఒకనాడు ఒక మనుష్యుడు ఒంటరిగా తన పయనమును ఎరుషలేము నుండి బయలుదేరి యెరికో తట్టునకు వెళ్లెను. అయితే, అతని దౌర్భాగ్యము ఏమిటంటే, మార్గ మద్యములో అతడు దొంగల చేతులలో చిక్కుకొనెను. అతని పరిస్థితి దయనీయముగా ఉండెను. ఇక్కడ చూడండి, మరొక్క ఇద్దరు ఎరుషలేము నుండి ఎమ్మాయు అను గ్రామమునకు పయనమై వెళ్ళిరి.
ఎరుషలేము అంటే, అక్కడ దేవాలయము, దేవుని యొక్క ప్రజలు, స్తుతి ఆరాధన, దేవుని యొక్క పాటలు, దేవునియందలి ఆనందము అను సమస్త దైవ ఆశీర్వాదములు కలదు. అయితే వీరిద్దరును అటువంటి గొప్ప ఔన్నత్యమైన దేవుని స్థలమును విడిచిపెట్టి ఎమ్మాయు గ్రామమునకు పయనమును చేసిరి. దుఃఖముఖముతోను, యూదులకు భయపడినవారిగాను, యూదుల వలన ఏమైనా ప్రమాదము జరుగునేమో అను కలతతో పయనించిరి.
అయితే అట్టి సమయమునందు ఎదురు చూడని రీతిలో యేసు క్రీస్తు వారిని సంధించెను. అయితే వారు, ఆయనే యేసు అని గుర్తు పట్టలేదు. వారి యొక్క కన్నులు దుఃఖము చేత మరుగుచేయబడి యుండెను. యేసు ప్రేమతో వారి తట్టున చూచి, వారు దుఃఖముగలవారై త్రోవలో నడుచుచు, ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా (లూకా. 24:17).
దేవుణ్ణి విడిచిపెట్టి దూరముగా వెళ్లిపోవుచున్న వారిపై ప్రభువు ఎంతటి అక్కరగలవాడై ఉన్నాడు అను సంగతిని, ఎంత ప్రేమతో పలకరించుచున్నాడు అను సంగతిని చూడుడి. మనుష్యులు భయమునందును, పాపపు బీతియందును, పంచలత్వమునందును, దుఃఖమునందును నడుచుచు వెళ్ళుచున్న వారిని చేయి విడిచిపెట్టుటకు ప్రభువు కోరుకొనుటలేదు. ఆయన యొక్క ప్రేమ గల హస్తముతో వారిని హక్కును చేర్చుకొనుచున్నాడు!
మీరు ఈ లోకము యొక్క పయనమునందు దుఃఖముఖముగల వారిగా వెళ్ళుచుయుండ వచ్చును. సంచలత్వముతోను, మనస్సునందు విరక్తితోను నడుచుచు వెళ్లవచ్చును. అయినను మిమ్ములను ఎరిగియున్న ప్రభువు ఒక్కడు కలడు. మిమ్ములను సంధించి మంచి దారిలో నడిపించుటకు ప్రభువు ఒక్కడు కలడు. నేడు యేసు మిమ్ములను సంధించుటకు కోరుచున్నాడు. మీయొక్క కన్నీటిని తుడచి తిన్నని మార్గమునందు నడిపించుటకు ప్రభువు కోరుచున్నాడు.
ఆనాడు ఎమ్మాయు శిష్యులు అయనను అన్యుని వలె భావించిరి. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అప్పుడు ఆయన (యేసు) వారిని చూచి, మీరు దుఃఖముఖము గలవారిగా నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా, వారిలో క్లెయొపా అనువాడు యెరూషలేములో బసచేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగక ఉండుటకు నీవు అన్యుడవా అని ఆయనను అడిగెను” (లూకా. 24: 17,18).
అయితే ఆయన అన్యుడుగా ఉండలేదు గాని, ప్రేమగల స్నేహితుడిగా సమీపమునుకు వచ్చి వారి యొక్క జీవితమును సరిదిద్దును. దేవుని బిడ్డలారా, నిశ్చయముగానే మీ యొక్క జీవితమును కూడాను ఆయన సరిదిద్దును.
నేటి ధ్యానమునకై: “వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి” (లూకా. 24:31).