Appam, Appam - Telugu

సెప్టెంబర్ 23 – ప్రేమించు హృదయము!

“నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణశక్తితోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను” (ద్వితి. 6:5).

ప్రభువు ఇశ్రాయేలు ప్రజలకు పది ఆజ్ఞలను ఇచ్చి ఉండినప్పటికి, అందులో ప్రభువును ప్రేమించుటయే మొదటి ఆజ్ఞగా ప్రధానముగా ఉంచెను. మనము ప్రభువును ప్రేమించవలెను, పొరుగువారిని కూడాను ప్రేమించవలెను. అవును, క్రైస్తవ మార్గమే ప్రేమ యొక్క మార్గము. అది ప్రభువు యొక్క ప్రేమను రుచిచూచేటువంటి మార్గము మాత్రము గాక, అట్టి ప్రేమను వెల్లడిపరచుచున్న మార్గము.

మీరు ప్రభువు యొక్క ప్రేమను పొందుకొనుటతోపాటు నిలిచిపోకుడి. ప్రభువుపైన అమితమైన ప్రేమను ఉంచి, ఆయనను ఘనపరచుడి. ఆయనను ఉత్సాహముగా స్తుతించి ఆనందించుడి. లోర లోయను పిలుచుచున్నట్లు, ప్రభువు యొక్క హృదయము మీ యొక్క ప్రేమ కొరకు పరితపించుచున్నది.

“దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు” (1. యోహాను. 4:8). కొందరి అజ్ఞానము చేత ప్రేమయే దేవుడు అని చెప్పుచున్నారు. ప్రేమ ఎన్నడును దేవుడు కాలేదు. ప్రేమ దేవుని యొక్క ప్రధానమైన గుణాతిశయమే. కల్వరి యొక్క ప్రేమ త్యాగముతో మిమ్ములను వెదకి వచ్చెను. అట్టి ప్రేమ చేత శిలువ యొక్క వేదనను సహించి పాప క్షమాపణను, విడుదలను, ఆశీర్వాదములను ప్రభువు మీకు ఇచ్చుటకు సంకల్పించెను. మీ కొరకు చివరి బొట్టు రక్తమును కూడా కుమ్మరించి ఇచ్చిన వానిని, మీరు ప్రేమించకుండా ఉండుట ఎలా?

ఏ క్రైస్తవని వద్దైతే దేవుని ప్రేమ లేకుండునో, అతడు క్రైస్తవుడు అని పిలువబడలేడు. అందుచేతనే అపో. పౌలు ప్రేమ కొరకు ఒక పూర్తి అధ్యాయమును వ్రాసెను, (1. కొరింథీ. 13 ‘వ అధ్యాయము). “నేను మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను మాటలాడినను, ప్రేమలేని వాడనైతే, మ్రోగెడు కంచును, గణగణలాడు తాళమునైయుందును” (1. కోరింథీ. 13:1). అని ఆయన వ్రాసియున్నాడు.

కొందరికి ఆత్మవరములను, శక్తులను ఇచ్చి, ప్రభువు బలమైన అద్భుతములను చేయుచున్నప్పుడు, వారు అతిశయమును మనస్సునందు గర్వమును చెంది, ఆది ప్రేమలో నిలిచియుండకుండా పడిపోవుచున్నారు. ప్రభువైతే, మన యొక్క మొదటి ప్రేమను, పరిపూర్ణమైన ప్రేమను కాంక్షించుచున్నాడు. అందుచేతనే పేతురుని చూచి : పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? నా పట్ల వాత్సల్యతను కలిగియున్నావా? వీరందరికంటెను నీవు నన్ను అత్యధికముగా ప్రేమించుచున్నావా అని అడిగెను. క్రీస్తును మనము మనసారా ప్రేమించవచ్చును, ఆయనను ప్రేమించకుండా ఉండుట ఎలా?

స్వార్థపూరితమైన ప్రేమను ఎత్తి పడవేయుడి. వేషధారణతో కూడిన ప్రేమ వద్దే వద్దు. కల్లా కపటము లేని హృదయముతో ప్రభువును ప్రేమించుటకు తీర్మానించుడి. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపముల నుండి మనలను కడిగి విడిపించి, ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక” (ప్రకటన. 1:6).

నేటి ధ్యానమునకై: “మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది” (1. యోహాను. 4:10).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.