జూన్ 13 – ప్రార్ధన చేయునప్పుడు
“నీవైయితే ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొనుము, రహస్యమందున్న నీ తండ్రిని చూచి ప్రార్థనచేయుము” (మత్తయి. 6:6).
మత్తయి వ్రాసిన సువార్తలో 5,6,7 మొదలగు మూడు అధ్యాయములును కొండమీది ప్రసంగము అని పిలువబడుచున్నది. ఈ కొండమీది ప్రసంగములో విజయవంతమైన క్రైస్తవ జీవితమును గూర్చి 23 రకముల మూలాంశములతో యేసు బోధించెను. అందులో ఉపవాసము, ప్రార్థన వంటి అంశముల భావములు మిగుల ప్రాముఖ్యమైనవి. ప్రభువు నేర్పించిన ‘మాదిరి ప్రార్థన’ ఇక్కడే చోటుచేసుకుని ఉన్నది.
యేసు యొక్క దినములలో అనేక వేషధారులు ఉండిరి. వ్యర్ధమైన ఢంభములకును, విస్తారమైన మాటలకును వారు ప్రాముఖ్యతను ఇచ్చిరి. మనుష్యుల చూపునకు భక్తిపరులవలె వేషము వేయు వ్యర్థ ప్రార్ధనలు కోకోలలైయుండెను. ఆత్మతోను సత్యముతోను ఆరాధించుట ఎలాగు అను సంగతియు, ప్రార్థించుట ఎలాగు అను సంగతియు యూదా ప్రజలకు తెలియకుండెను.
మీ తండ్రిని చూచి మీరు ప్రార్థించుటకు ముందుగానే మీకు ఏది కావలెను అని ఆయన ఎరిగియున్నాడు అను సంగతిని యేసు వారికి గ్రహింపజేసి కనబరిచెను (మత్తయి. 6:8). ఆయనను మనము ప్రార్థించవలసినది మన యొక్క బాధ్యత. సొమ్మసిల్లక పట్టు విడువక ప్రార్థించవలసినది మన యొక్క బాధ్యత. అట్టి ప్రార్ధన మన యొక్క అంతరంగపు లోతులలో నుండి వాస్తవముగా దేవుని చూచి ప్రార్థించ వలసినదైయున్నది.
ప్రార్ధన క్రైస్తవ జీవితమునందు అతి పెద్ద స్తంభము. ఇట్టి స్తంభము దృఢముగా ఉంటేనే ఆత్మీయ జీవితము స్థిరముగా ఉండును. అంత మాత్రమే కాదు, ప్రార్ధన అనేది ప్రభువు మనకు దయచేసియున్న మహా గొప్ప భాగ్యమైయున్నది. మన యొక్క బరువులు, భారములు, కన్నీళ్లు, చింతలు, మనోవేధలు అన్నియును ప్రార్థనా సమయమునందు ప్రభువు యొక్క పాదములయందు దించ్చి పెట్టుచున్నాము. మన యొక్క ప్రేమను, కృతజ్ఞతను స్తోత్రముతో ఆయనకు తెలియజేయుచున్నాము. ప్రార్ధన పరలోకపు తండ్రితో మనకు తిన్నని సంబంధమును ఏర్పరచుచున్నది. అవును, నిశ్చయముగానే ప్రార్థన సమయము అనుట పరలోకమును, భూమియు ఏకమవుచున్న ఒక సమయమునైయున్నది.
అపో. పౌలు చెప్పెను: “మీరు దేనిని గూర్చియు చింతపడకుడి గాని, ప్రతి విషయములోను మీ ప్రార్థన విజ్ఞాపనములను కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థనలతోను విన్నపములతోను దేవునికి తెలియజేయుడి. అప్పుడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును” (ఫిలిప్పీ. 4:6,7). మనము మన యొక్క ప్రార్థనా విజ్ఞాపనలను కృతజ్ఞతాపూర్వకముగా తండ్రికి తెలియజేసినట్లయితే మనలో నివాసము చేయుచున్న పరిశుద్ధాత్ముడు మనలను సర్వ సత్యములోనికి త్రోవ నడిపించుకుని వెళ్ళును (యోహాను. 16:13).
ప్రభువు మనలను ఆదరించి ఓదార్చుచున్న సమయము ప్రార్థనా సమయమే. ఆయన ప్రేమ గల హస్తము మన యొక్క కన్నీళ్లను తుడచి, మనలను స్థిరపరచి బలపరచుచున్నది. ఆయన యొక్క ప్రసన్నత మనలను ఉత్సాహపరచి, సహాయము చేయుచున్నది. ఆత్మీయ జీవితమునందు, భద్రత, శక్తి, సహవాసము అన్నియును ప్రార్థనవలనె లభించుచున్నది. అందుచేతనే దావీదు రాజు: “నాకు సహాయము వచ్చు కొండల తట్టున నా కన్నులను ఎత్తుచున్నాను. భూమ్యాకాశములను కలుగజేసిన యెహోవావలనే నాకు సహాయము వచ్చును” అని చెప్పెను (కీర్తనలు. 121:1,2).
నేటి ధ్యానమునకై: “రహస్యమునందు చూచు నీ తండ్రి బహాటముగా నీకు ప్రతిఫలమిచ్చును” (మత్తయి. 6:6).