Appam, Appam - Telugu

జూన్ 07 – నా ధ్యానము!

“నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది! దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను” (కీర్తనలు. 119:97).

గొప్ప చక్రవర్తియైన ఇజ్రాయేలు దేశమును పరిపాలించిన దావీదు రాజునకు వెయ్యి రకముల పనులు ఉండియుండ వచ్చునును. చెప్పలేనంత సమస్యల చేత పీడించబడుచు ఉండవచ్చును. విస్తారమైన వ్యతిరేకతలును, శత్రువులును నిత్యమును బెదిరించుచు ఉండవచ్చును. వాటి మధ్యలోను ఆయన: “దినమెల్ల ధర్మశాస్త్రమును నేను ధ్యానించుచున్నాను” అని ఉత్సాహముతో చెప్పుచున్నాడు.

టిండేల్ అను భక్తుడు తన అనుభవమును వ్రాయుచున్నప్పుడు: ‘మా ఇండ్లలో కిటికీల తెరలు వెయ్యబడిన వేళలో మా పితరులు బైబిలు గ్రంథమును కన్నీటితో పాఠించెదరు. కన్నీటి బిందువులు ఆ మాటను మరుగుపరిచినప్పుడు ప్రాణము యొక్క దర్శనముకు అది జీవము పోసేను. వ్యాపారము నష్టమైనప్పుడును, వృత్తిలో అభివృద్ధి లేనప్పుడును, అన్ని వైపులా అంధకారముతో నమ్మిక అనగారి పోయినప్పుడును మా పిత్తర్ల యొక్క ఒకే నమ్మిక బైబులు గ్రంథమే.

అదే సమయము సంతోషమునందును, ఆనందమునందును, సంపన్న అభివృద్ధినందు కూడాను వారికి మార్గదర్శిగా ఉండినది ఆ బైబిలు గ్రంథమే. అది ఒక నీరుకట్టిన తోటగానే మాకు ఉంటూ వచ్చెను’ అని ఆయన చెప్పెను.

దావీదు రాజు దినమంతయును ధర్మశాస్త్రము నాయొక్క ధ్యానము అని చెప్పుచున్నాడే. బైబిలు గ్రంధమును ఎలాగు మనము ధ్యానించుట? ఒక చక్కటి ఉద్యానవనమునందు సువాసన వెదజల్లు పుష్పములు విస్తారముగా నిండియుండెను. మొదట ఒక్క చిన్నది వచ్చెను, ఒక పువ్వు అందముగా ఉన్నది అని చూచి, తుంచి, వాసనను చూచి, సిగలో పెట్టుకొనెను. కొంత సమయమునకు ఆ పుష్పము వాడి వడలిపోయెను.

ఆ తరువాత ఒక సీతాకోకచిలుక వచ్చెను. ప్రతి ఒక్క పుష్పము పైనను ఒక నిమిషము కూర్చుండి వెళ్ళిపోయెను. దాని తర్వాత ఒక తేనెటీగ ఎగుర్కుంటూ వచ్చెను. ఒక పుష్పపై వ్రాలెను. లోపలికి వెళ్లి తేనెను జుర్రుకొనెను. దాని కాళ్లకంతయు మకరందపు ధూళిని సేకరించుకొనెను. వాటి నంతటిని రొమ్మున హత్తుకొనెను. దాని తరువాత తన గూడునకు ఎగిరి వెళ్ళిపోయెను.

బైబిలు గ్రంధము చదువుటయందు మనము ఆ తేనెటీగ వలె నడుచు కొనుచున్నామా? కొందరు వేగముగా పఠించేసి వెళ్లిపోవుచున్నారు. నేడును కొందరు తమకు కావలసిన ఒక వాగ్దానమును మాత్రమే పట్టుకొనుచున్నారు. అయితే మిగతా కొందరు బైబిలు గ్రంథము యొక్క సమీపమున ఆశతో కూర్చుండి తేనెకంటను జుంటితేనె ధారలకంటెను మధురమైన అట్టి మాటలను భుజించుటతో పాటు ఇతరులకు కూడా అందించి లాభమును సమకూర్చుచున్నారు.

కీర్తన గ్రంథమునందు దావీదు చెప్పుచున్నాడు: “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును” (కీర్తనలు. 1:2,3).

దేవుని బిడ్డలారా, లేఖన వచనములను ఆశతో చదివెదరా? బైబిలు గ్రంథము అనుట ప్రభువు మీకు వ్రాసియిచ్చిన ఉన్నతమైన ఉత్తరముగా తలంచి దానిని పూర్ణ హృదయముతో అంగీకరించుదురు గాక!

నేటి ధ్యానమునకై: “అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి, తేనెకంటెను జుంటితేనె ధారల కంటెను మధురమైనవి” (కీర్తనలు. 19:10).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.