Appam, Appam - Telugu

సెప్టెంబర్ 01 – తప్పెను!

“నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు (జార) తడబడుటకు సిద్ధమాయెను” (కీర్తనలు. 73:2).

ప్రభువు కృపగా మన అందరికి కాళ్ళను ఇచ్చియున్నాడు. అందు నిమిత్తము మనము ప్రభువునకు కృతజ్ఞత గలవారిగా ఉండవలెను. కాళ్ళు లేకుండా మనుష్యుడు పడేటువంటి వేదనను చూచుచున్నప్పుడు, మనకు తెలియకుండానే వారిపై జాలి కలుగుచున్నది.

అయితే మనకు ఒక కట్టు దిట్టము కలదు. మన యొక్క కాళ్ళను మనస్సును, శరీరమును కోరుకునేటువంటి స్థలమునకు నడవనీయ్యకుండా భయ భక్తితోను, జాగ్రత్తతోను కాపాడుకొనవలెను. దేవాలయమునకు నడిచి వెళ్లి, ప్రభువును స్తుతించి పాడుటకు ప్రాధాన్యతను ఇవ్వవలనే గాని, చలన చిత్రములకును, లోకపు ఉల్లాసములకును ప్రాధాన్యతను ఇవ్వకూడదు.

తడబడుట, జారుట అను రెండు పదములు పైన చెప్పబడిన వచనమునందు ఉపయోగించబడియున్నది. శరీరమునందు బలము లేకున్నట్లయితే కాళ్లు తడబడును. నిలబడుచున్న స్థలము జారేటువంటిదిగాను, నాచు పట్టినదిగాను ఉండినట్లయితే అట్టి స్థలమున కాళ్లు జారుచున్నదై ఉండును. పాపముతో నిండిన లోకములో కాళ్లు తడబడకుండా, జారకుండా నడుచుటకు మనకు ఉన్నత బలము కావలెను. ఉన్నత బలమును పొందుకొనుచున్నప్పుడు, మన యొక్క కాళ్లు లేడీ కాళ్ళలవలె అగును.

ఒక్కసారి ఒక యవ్వనస్థురాళ్ళు, తన యొక్క తల్లిదండ్రులు చెప్పిన మాటను వినకుండా ఒక బండరాయి మీదకి ఎక్కెను. మరికొద్ది నిమిషాలలో ఆ బండరాయి మీద నుండి జారి క్రిందకు పడిపోయెను. ఆమెకు బలమైన డబ్బలు తగిలి నొప్పి చేత అల్లాడిపోయెను. దేవుని బిడ్డలారా, ఎట్టి స్థలమునందు కాళ్ళు జారును అని, మీ యొక్క హృదయము గ్రహింప చేయుచున్నదో, వెంటనే అట్టి స్థలమును విడిచి పారిపోవుడి. యోసేపు అలాగుననే తన వస్త్రము పోయినను పరవాలేదు అని పోతిఫరు యొక్క భార్య వద్ద నుండి తప్పించుకొని పరుగులు తీసెను.

అయితే అవ్వను చూడండి, సర్వసాధారణముగా సర్పము వద్ద మాట్లాడుచూనే నిలబడెను. ప్రభువును సందేహ పడేటువంటి మాటలను సర్పము మాట్లాడుచున్నప్పుడు, ఆమె ఆ మాటలను ఖండించి మాట్లాడలేదు. తన భర్త వద్ద గాని, ప్రభువు వద్ద గాని ఆలోచనను అడగవలెను అని కోరుకొనలేదు. ఆమె తనంతట తానుగా తీర్మానించి నిషేధించబడ్డ ఫలమును భుజించెను. తాను చెడి, తన భర్తను కూడా చెడిపోవునట్లు చేసెను.

కీర్తనకారుడు చెప్పుచున్నాడు: “నాశనకరమైన గుంటలోనుండియు, జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండమీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను” (కీర్తనలు. 40:2). ప్రభువు మిమ్ములను లేవనెత్తి పైకెత్తియున్నాడు. కల్వరి రక్తముచేత కడిగి శుద్దీకరించియున్నాడు. పాప క్షమాపణను, రక్షణ సంతోషమును అనుగ్రహించియున్నాడు. ఇకపై మీరు కాళ్లు జారు స్థలములో మీరు నిలబడకూడదు.

“నా మార్గములను నేను పరిశీలనచేసికొంటిని, నీ శాసనములతట్టు నా కాళ్ళను మరలుకొంటిని” (కీర్తనలు. 119:59) అని దావీదు చెప్పుచున్నాడు. దేవుని బిడ్డలారా, మీ కాళ్ళను శాసములతట్టునకు తిన్నగా త్రిప్పుడి.

నేటి ధ్యానమునకై: “నీ పాదము తొట్రిల్లనియ్యడు; నిన్ను కాపాడువాడు కునుకడు. ఇదిగో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు” (కీర్తనలు. 121:3,4).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.