మే 29 – పంపబడితిని!
“దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని” (దానియేలు. 10:11).
‘నేను పంపబడితిని’ అని ఆ దేవదూత దానియేలునకు దేవుని యొక్క వర్తమానమును తీసుకొని వచ్చుటతో పాటు, దానియేలును బలపరచి, ధైర్యపరచునట్లుగాను వచ్చెను.
దేవదూతలు ఎవరు? వారు దేవుని యొక్క రధములు అని పిలవబడుచున్నారు. దేవుని యొక్క రధములు పదివేల కొలదిగాను, వేవేల కొలదిగాను ఉన్నాయి (కీర్తనలు. 68:17). గుర్రములు తగిలించిన రధములను రాజు పంపించునట్లుగా తన యొక్క వర్తమానమును మోసుకొని వెళ్ళునట్లుగా రధములవలె వారిని దేవుడు పంపించుచున్నాడు. దేవుని యొక్క వర్తమానమును, రధములవలె అక్కడికి ఇక్కడికి తీసుకొని వెళ్ళుట దేవుని దూతలకు మనస్సునందు గొప్ప సంతోషము.
దేవునిదూతలకు మూడు ప్రాముఖ్యమైన పనులు ఉన్నాయి. మొట్టమొదటిది, దేవుని యొక్క వర్తమానమును తమ యొక్క పిల్లలకు మోసుకుని వచ్చుచున్న వర్తమానమును అందించే పని. రెండోవది, దేవుని యొక్క పిల్లల కొరకు యుద్ధము చేసి శత్రువులను హతము చేసేటువంటి పని. మూడోవదిగా, ప్రభువును ఆరాధించి మనస్సునందు ఆనందించే పని. మిగతా సమయములలో వారు దేవుని ఎదుట నిలబడి ఆయనను సేవించుచుందురు. ఆయనయందు ఆనందించుచు ఉందురు. ఆయన యొక్క స్వరమును విని దాని ప్రకారము చేయుచున్నారు.
లూకా. 1:19 నందు, ప్రభువు చేత పంపించబడిన గాబ్రేలు అని దేవదూత వయస్సు మళ్ళిన జెకర్యా వద్దకు వచ్చెను. ఆ తరువాత మరియా వద్దకు వచ్చినప్పుడు ఎలాగున ఆమే మెస్సయ్యాను తీసుకొని రాబోవుచున్నది అను సంగతిని తెలియజేసెను. అదే దేవదూతలు రక్షణను స్వతంత్రించు కొనబోవుచున్న ప్రతి ఒక్కరికి పరలోకపు వర్తమానమును తీసుకొని వచ్చుచున్నారు.
ఒక చిన్న గ్రామములయందు ఆలయ ప్రతిష్టను చేయుచున్నప్పుడు, అక్కడ నిలువుగాను అడ్డముగాను విస్తారమైన చిన్న చిన్న విద్యుత్తు దీపములతో అలంకరించి ఉండెను. అక్కడ ఆరాధన ముగించబడుచున్న సమయము వచ్చుచున్నప్పుడు, అకస్మాత్తుగా విద్యుత్తునందు లోపము ఏర్పడుటచేత ఆలయమునందుగల అందరిని విద్యుత్తు పట్టుకొనెను. వారందరును మరణము యొక్క సరిహద్దులకు వచ్చి ఉన్నామన్న సంగతిని గ్రహించిరి.
అయితే ప్రభువు తన దేవదూతను పంపించుటకు సంకల్పించెను. అతడు తిన్నగా దిగివచ్చి వెను వెంటనే విద్యుత్తు తీగను తెంచివేసి అక్కడ ఉన్న వారందరిని కాపాడెను. అతడు నిశ్చయముగా సాధారణమైన మనుష్యునిగా ఉండియుండడు. కారణము, సాధారణమైన మనుష్యునిగా ఉండినట్లయితే ఆ విద్యుత్తు అతనిని కూడా కాల్చివేసియుండును.
“నేను పంపించబడితిని” అని ఆ దేవదూత చెప్పుచున్నప్పుడు, పంపించున్న దేవుని యొక్క ప్రేమను మనము తలంచి అత్యానంద భరితుల మవ్వుచున్నాము. పరలోకపు కుటుంబమునందు సభ్యుడిగా ఉండేటువంటి ధన్యతను తలంచి ఉప్పొంగుచున్నాము.
“ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యెదుట నేను మోకాళ్లూని” అని అపోస్తులుడైన పౌలు సూచించుచున్నాడు” (ఎఫెసీ. 3:14).
నేటి ధ్యానమునకై: “అతడు మరల నన్ను ముట్టి, నన్ను బలపరచి, నీవు బహు ప్రియుడవు, భయపడకుము, …. ధైర్యము తెచ్చుకొమ్ము. ధైర్యము తెచ్చుకొమ్ము” (దానియేలు. 10:18,19).