నవంబర్ 02 – ప్రభువు యొక్క మహిమ!
“లెమ్ము, తేజరిల్లుము; నీకు వెలుగు వచ్చియున్నది, యెహోవా మహిమ నీమీద ఉదయించెను. ఇదిగో చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది; అయినను నీమీద యెహోవా ఉదయించుచున్నాడు; ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది” (యెషయా. 60:1,2).
కాలములు గతించే కొలది ఈ లోకము అనునది చీకటి వైపునకును, కారు చీకటి తట్టునకు వెళ్లుచూనే ఉన్నది. అంత్యక్రీస్తు యొక్క క్రూరత్వమైన పరిపాలన తట్టునకు వెళ్లుచూనే ఉన్నది. చీకటి శక్తులు బలమును పుంజుకొనుచున్నది. సాతాను అనేకులను వంఛించేటువంటి గొప్ప సూచనలను చేయుచునే ఉన్నాడు.
అదే సమయములో, మనము ప్రభువు యొక్క మహిమకరమైన రాకడను ఎదుర్కొనుటకు వేగిరపడుచున్నాము. యేసుక్రీస్తు తండ్రి యొక్క మహిమను పొందియున్నవాడై ప్రధాన దూత యొక్క బూర శబ్దముతో మధ్యాకాశము నుండి దిగి వచ్చును. అప్పుడు క్రీస్తునందు మరణించిన వారు మొదట లేచుదురు. ఆ తరువాత సజీవముగా నిలచియుండు మనము కూడాను మేఘముల మీదకు కొనిపోబడి ఆయనతో కూడా ఉందుము.
చీకటియు, కటిక చీకటియును లోకమును కమ్ముచున్నప్పుడు, ప్రభువు యొక్క మహిమ నీమీద ఉదయించుటకు గల ఉద్దేశము ఏమిటి? మీరు ప్రభువు కొరకు లేచి ప్రకాశింపవలెను అనుటయే. “లెమ్ము తేజరిల్లుము; నీకు వెలుగు వచ్చియున్నది, యెహోవా మహిమ నీమీద ఉదయించెను” (యెషయా. 60:1).
మీరు దేవుని కొరకు బలమైన పరిచర్యను చేయవలెను అంటే, ఇట్టి కృపగల కాలమే బహు చక్కటి కాలమునైయున్నది. ప్రభువు కొరకు ఎంతగా శ్రమించగలమో అంతగా శ్రమించుడి. సువార్తను ఎంతమందికి ప్రకటించగలమో అంతమందికి ప్రకటించుడి.
నీపై ఉదయించుచున్న ప్రభువు యొక్క మహిమలో ఒక వెలుగు కలదు. జ్యోతివలె ప్రకాశించు వెలుగు కలదు. చీకటిలో నుండి వెలుగులోనికి రప్పించిన ప్రభువు మిమ్ములను జనములపై ప్రకాశించు వెలుగుగా ఉంచును. ప్రభువు యొక్క సృష్టిలో, రాత్రిపూట వెలుగును ఇచ్చుటకు చంద్రుడుణ్ణి, నక్షత్రములను కలుగజేసినట్లుగా, మిమ్ములను కూడాను చీకటిలో ఉన్న లోకమునకు వెలుగుగాను ప్రకాశవంతముగాను ఉంచియున్నాడు.
పాపము అనుట చీకటిగాను, సువార్త అనుట వెలుగుగాను ఉన్నది. పాపము అనునది మనిష్యుని యొక్క ప్రాణములోనికి చీకటిని తీసుకొని వచ్చుచున్నది. అంధకారపు యుగాతిపతి అనేకుల యొక్క మనోనేత్రములకు గ్రుడ్డి తనమును కలుగజేసి చీకటిలో బంధించి ఉంచియున్నాడు. మీరు సువార్తను ప్రకటించుచున్నప్పుడు, సువార్త యొక్క ప్రకాశవంతమైన వెలుగు అనునది అంధకారమును ప్రాలద్రోలి, పరలోకపు వెలుగును తీసుకొని వచ్చుచున్నది. అప్పుడు మనుష్యుడు నిత్యత్వమును గూర్చి తెలుసుకొనుచున్నాడు. తేజుమయమైన పరలోక దేశమును గూర్చి తెలుసుకొనుచున్నాడు.
దేవుని బిడ్డలారా, మీయందు గల వెలుగు దిన దినమునకు అత్యధికమగుచూనే ఉండవలెను. అప్పుడే వెలుగు యొక్క పిల్లలుగా నడుచుకుందురు. మహిమగల సువార్తను పూర్ణ ప్రయాసముతో జనులకు ప్రసంగించుడి. ప్రభువు యొక్క రాకడ మిగుల సమీపముగా ఉన్నది.
నేటి ధ్యానమునకై: “మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింప జేయుచునట్టు చూచి, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మహిమనుండి అత్యధిక మహిమను పొందుచు, రూపాంతర పరచబడుచున్నాము” (2. కొరింథీ. 3:18).