జూన్ 18 – మరువబడదు!
“అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా? అయినను వాటిలో ఒకటైనను దేవుని యెదుట మరువబడదు” (లూకా. 12:6).
ప్రభువు యొక్క వాగ్దానములు ఎంతగానో మనలను ఓదార్చుచున్నది! ఆకాశపు పక్షులను గమనించి చూడుడి అని ప్రభువు చెప్పెను. అవును, ఆకాశపు పక్షులను గమనించుచున్నప్పుడు, వాటిని పరామర్శించుచున్న పరమ తండ్రి మనలను ఎంత అత్యధికముగా ప్రేమను చూపించి పరామర్శించును అను విశ్వాసము మనలోనికి వచ్చుచున్నది.
పిచ్చుకలలో బలహీనమైనవి పిల్ల పిచ్చుకలై ఉన్నవి. వాటి యొక్క ఈకలు నెమలివలె అందముగా ఉండవు. గొంతు కోకిల వలె మధురముగా ఉండదు. ఆహారమునకై భుజించు గిన్నే కోడివలె దాని మాంసము రుచికరమైనది కాదు. అది మిగుల మృదువైనది. మనుష్యుని యొక్క ఆశ్రయమును వెతుకుచూ పరిగెత్తుకొని వచ్చుచున్నదైయున్నది.
అయితే ప్రభువు అట్టి పిచ్చుకులపై అక్కర గలవాడైయున్నాడు. లోకస్తులు వాటికి ధరను కట్టినప్పటికీని, ప్రభువు యొక్క చిత్తము లేక వాటిలో ఒక్కటైనను నేలపై ఒరిగి పడదు.
ఆకాశపు పిచ్చుకలవలె వేల కొలది ఆకాశ పక్షులు లోకమందు ఉన్నాయి. వాటిలో చిన్నదియు పెద్దవియు ఉన్నవి. పలు రకాల అలవాట్లు గలవైయున్నవి. అయితే పరమ తండ్రి వాటిలోని ప్రతిదానిని ప్రతి దినమును పోషించుచున్నాడు. అవి రాబోవు కాలమును గూర్చి చింతించుటయు లేదు; కూర్చుకొనుటను లేదు.
దేవుడి బిడ్డలారా, అట్టి దేవుడు మిమ్ములను పోషించుటకు ఎరిగియున్నాడు. మీయొక్క ప్రతి అంశమందును బహు అక్కరగలవాడై ఉన్నాడు. ఇది ఎంత గొప్ప ఔన్నత్యమైనది! ఆయన లక్షల కొలది ఇశ్రాయేలీయులను అరణ్యమునందు పోషించలేదా? ప్రతి దినమును అరణ్యమునందు మన్నాను కురిపించలేదా? పుర్రెలు పెట్టలను పాళెమునందు వచ్చి పడునట్లు చేయలేదా? (ద్వితీ. 2:7).
ఏలియాను చూడుడి; కరువు కాలమునందు అద్భుతముగా కాకుల ద్వారా పోషించెను. త్రాగుటకు ప్రభువు కేరూతు వాగు నీటిని దయచేసెను. ఇంకను కరువు అత్యధికమైనప్పుడు, సారెపతు వెధవరాలి ఇంట పిండియు నూనెయు కొదువ కాకుండునట్టు చేసి తన యొక్క ప్రవక్తను పరామర్శించెను. ఏలియా అరణ్యమునందు ఉన్నప్పుడు దేవుని దూతను పంపించి ఆహారమును తినిపించెను. ఆ! మన ప్రభువు యొక్క ప్రేమయు, అక్కరయు ఎంత అత్యధికమైనది!
కొత్త నిబంధనకు రండి. యేసుక్రీస్తు రాత్రింబగల్లును అరణ్యమునందు ప్రసంగించినప్పుడు, ఐదువేల మందిని పోషించెను. ఐదు రొట్టెలును, రెండు చేపలతో ఐదువేల మందికి పంచిపెట్టెను. అవును, అట్టి దేవుడు మన యొక్క అవసరతలన్నిటిని దర్శించుటకు శక్తిమంతుడైయీన్నాడు.
అందుచేత అపో. పౌలు వ్రాయుచున్నప్పుడు: “నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును” (ఫిలిప్పీ. 4:19) అని వ్రాయుచున్నాడు.
నేటి ధ్యానమునకై: “నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు యెంతో గొప్పది; నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది” (కీర్తనలు. 31:19).