జూన్ 17 – పరిశుద్ధాత్ముని ప్రేరేపణ!
“యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో (అతని) సంసోనును రేపుటకు మొదలు పెట్టెను” (న్యాయా. 13:25).
ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయులు యొక్క బానిసత్వము నుండి విమోచించేటువంటి ప్రత్యేకమైన పాత్రగా ప్రభువు సంసోనును ఏర్పరచుకొనెను. సంసోను అట్టి పిలుపును, ఏర్పాటును లక్ష్యముచెయ్యక, నిర్లక్ష్యముగా జీవించుచున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడలేక అతనిని రేపుటకు మొదలు పెట్టెను.
ప్రభువు కొరకు బీకర కార్యము చేయునట్లుగా నేడును మనలను పరిశుద్ధాత్ముడు రేపుచూనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణను మీయొక్క జీవితమునందు అనుభవించియున్నారా? బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఎందరైతే, దేవుని ఆత్మచేత నడిపించబడుదురో, వారందరు దేవుని కుమారులైయుందురు” (రోమీ. 8:14).
ప్రభువు యొక్క ఆత్ముడు నా జీవితమునందు అత్యధికముగా దయచేయుచున్నది ఒక్క అంశము, విశ్వాసుల కొరకును, సేవకుల కొరకును ప్రార్థించేటువంటి ప్రేరేపణయైయున్నది. కొందరి ముఖమును మనో నేత్రములకు ముందుగా తీసుకొని వచ్చును. కొందరి యొక్క పేర్లను జ్ఞాపకముచేయును. ప్రార్థించునట్లుగా పురిగొల్పును. అట్టి ప్రేరేపణ చేత ప్రార్థనభారమును, ఆత్మభారమును కలుగును. అప్పుడు తగిన మాటలను చెప్పి ప్రార్ధించునట్లుగా గోజాడు ఆత్మను అనుగ్రహించును.
కొంతమంది విశ్వాసులు సంఘమునందు దేవుని ఆత్మ యొక్క ప్రేరేపణ చేత బహు బలముగా ప్రార్థించుచున్నప్పుడు, సంఘమంతయును ఆత్మ చేత నింపబడుటను చూచియున్నాము. దేవుని యొక్క అభిషేకము విశ్వాసులందరిని నిండి పొరులునట్టు చేయును.
అలాగునే సందర్భమునకు తగిన సరియైన పాటలను పాడునట్లుగా పరిశుద్ధాత్ముడు ప్రేరేపణను ఇచ్చును. అట్టి పాటలు మనకు మాత్రము కాక, సంఘమంతటికిని భక్తి అభివృద్ధికి హేతువుగా మారిపోవును.
అలాగునే మనము చేయుచున్న ప్రార్థనలును, పాడుచున్న పాటలును, ఇచ్చుచున్న దైవ సందేశములును పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ చొప్పున ఉండినట్లయితే, అందులో నిశ్చయముగానే ఒక గొప్ప ఆత్మలనూర్పిడి ఉండును. గొప్ప ఫలితమును కూడా మనము ఎదురుచూడవచ్చును. పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ చొప్పున నడుచుటకు మనము చేయవలసిన బాధ్యతలు కలవు.
ఎల్లప్పుడును మన యొక్క అంతరంగమును పరిశుద్ధాత్మునితో ఏకముచేసి ఆయన స్వరము ఏమిటి? ఆయన ఏమి చెప్పుచున్నాడు అను సంగతిని మిగుల శ్రద్ధతో మనము గమనించవలెను. దాని కొరకు పరిశుద్ధాత్ముని యొక్క గ్రహింపు మిగుల ఆవశ్యము. కొన్ని సమయములలో నూతన ఆత్మలను సంధించునట్లుగా ప్రేరేపణను ఇచ్చును. వైద్యశాలకు వెళ్లి వ్యాధిగ్రస్తులతో మాట్లాడునట్లుగా ప్రేరేపణను ఇచ్చును.
దేవుని బిడ్డలారా, ప్రభువు మీతో మాట్లాడుచున్నప్పుడు వెను వెంటనే లోబడుడి. అలాగున లోబడినట్లయితే మరి ఎక్కువగా దేవుని మార్మములను తెలియజేసి మిమ్ములను త్రోవ నడిపించును. లోబడక ఉండినట్లయితే ఆయన కొనసాగించి మిమ్ములను ప్రేరేపించుటకు ఆపివేయును.
నేటి ధ్యానమునకై: “ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు” (మత్తయి. 10:19,20).