Appam, Appam - Telugu

జూన్ 05 – మౌనము!

“నేను ఏమియు మాటలాడక మౌనినైతిని, క్షేమమును గూర్చియైనను పలుకక నేను మౌనముగా నుంటిని” (కీర్తనలు. 39:2).

మాట్లాడటకు ఒక కాలము కలదు అనియు, మౌనముగా ఉండుటకు ఒక కాలము కలదు అనియు ప్రసంగి చెప్పుచున్నాడు (ప్రసంగి. 3:7). ఎప్పుడు మౌనముగా ఉండవలెనో, అప్పుడు మనము మౌనముగా ఉండి తీరవలెను.

కథోలిక సంఘపు మఠములలో కొన్ని మఠములు మౌనపు స్వామివారుల మఠములు అని పిలవబడుచున్నాయి. అక్కడ ఉన్న క్రైస్తవ స్వాములవార్లు ఎవరితోను మాట్లాడరు. పలు మాసములు వారు మాట్లాడక అలాగునే ఉందురు. నేను ఇజ్రాయేలు దేశమునకు వెళ్లిన్నప్పుడు, ఏలియా దాగుకొనియున్న కేరుతు వాగు వద్ద అటువంటి మౌన వ్రతము ఉన్న స్వాములవార్లు గల మఠమును చూచితిని. ఏలియా కేరుతు వాగు నీటి వద్ద మౌనముగా ఉండినట్లుగా తాము కూడా మౌనముగా ఉన్నట్లు వారు వ్రతమును పూనుకొని ఉన్నారు.

పాత నిబంధనను మనము చదివి చూచినట్లయితే, పాపము నిమిత్తము దుఃఖించువారు మౌనముగా తమ తలలపై ధూళిని గాని లేక బూడిదను గాని పోసుకొనుటయును, గోనెపట్ట ధరించు కొనుటయును తమ్మును శుద్ధీకరించుకొను దినముగా అట్టి దినమును నియమించు కొనియుండుటను చూడవచ్చును.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “సీయోను కుమారి యొక్క పెద్దలు మౌనులై నేలపై కూర్చుందురు; తలలమీద బుగ్గి పోసుకొందురు; గోనెపట్ట కట్టుకొందురు; యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తలవంచుకొందురు” (విలాప. 2:10). తమ్మును తాము నలుగగొట్టుకొని మౌనముగా ఉండు ఉపవాసమును ప్రభువు చూచుచున్నాడు. వారి యొక్క చెరనంతటని మార్చుచున్నాడు. వారి యొక్క కన్నీటినంతటిని ఆనంద గానముగా చేయుచున్నాడు.

దావీదు తన జీవిత దినములయందు మౌనపు దినమును ఏర్పరచుకొని అట్టి దినమునందు ప్రభువు యొక్క వాక్యములను చదివి నెమ్మదిగా ధ్యానించుటకు ప్రారంభించెను. అట్టి మౌనము ధ్యానమునకు తగినట్లుగా ఉండెను. అట్టి మౌనము లోకము యొక్క శబ్దమునకు చెవులను మూసివేసి ప్రభువు యొక్క స్వరమునకు అంతరంగమును తెరచుచున్న సమయముగా ఉండెను. అట్టి సమయమునందు ఆయన యొక్క ఆత్మలో ఆయన మండించబడెను.

ఎప్పుడెంత పలు రకములైన ప్రకటనల శబ్దములు చెవులలో వినబడుచు ఉన్నాయో, అట్టి శబ్దములు మనిష్యుని యొక్క జీవితమును తమకు నచ్చినట్లుగా మలుచుకొనుచున్నాయి. పలు శబ్దములు మన యొక్క చెవులలో నిత్యమును ధ్వనించుచున్నందున ప్రభువు యొక్క స్వరమును వినుటకు తగినంత సమయము లేకుండా పోవుచున్నది. ప్రభువు యొక్క స్వరమును వినుటకు కొంత మౌనపు సమయములను మీ కొరకు కేటాయించుకొనుడి. మౌనముగా ప్రభువు యొక్క పాదముల యొద్ద కూర్చుండి ఆయన యొక్క స్వర్ణమయమైన ముఖమును తేరి చూడుడి.

ఒకసారి పాపాత్మురాలైన ఒక స్త్రీ ప్రభువు వద్దకు వచ్చెను. కన్నీటితో ఆయన యొక్క పాదములను తడిపెను. ఆమె యొక్క నోట నుండి ఒక్క మాటయైనను రాలేదు. కన్నులు మాత్రము కన్నీటిని రాళ్చుచూనే ఉండెను. ప్రభువు ఆమె యొక్క పాపములను క్షమించెను. ‘కుమార్తె, నీయొక్క పాపములు క్షమించబడెను’ అని ఆమెతో చెప్పెను. దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు ప్రతిష్ట చేయబడుచున్న మౌనము మీకు ఆశీర్వాదములను తీసుకుని వచ్చును.

నేటి ధ్యానమునకై: “అయితే యెహోవా, తన పరిశుద్ధాలయములో ఉన్నాడు; ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక” (హబక్కూకు. 2:20).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.