అక్టోబరు 30 – ప్రథమఫలముగా!
“వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్ల కొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు” (ప్రకటన. 14:4).
సీయోను కొండమీద గొర్రె పిల్లయైనవానితో నిలబడుట, ధన్యతలోను అతి గొప్ప ధన్యత! ఈ భూసంబంధమైన జీవితము, అట్టి ఔన్నత్యమైన జీవితమునకు సిద్ధపడేటువంటి ఒక జీవితమునైయున్నది. అక్కడ గొర్రె పిల్లయైనవానితో నిలబడుటకు అర్హతను పొందుకొను వారు ఎవరు అను సంగతిని చూచెదము.
వీరు విమోచింపబడినవారు. “దేవుని కొరకును గొఱ్ఱెపిల్ల కొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు” (ప్రకటన. 14:4). అవును, ప్రభువు మిమ్ములను కల్వరిలో క్రయధనమును చెల్లించి తన కొరకు సంపాదించుకొనెను.
కావున, మీరు మీకు సొంతమైనవారు కాదు; ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా విమోచించినట్లుగా, మిమ్ములను కూడాను కల్వరి రక్తము చేత ప్రభువు విమోచించియున్నాడు. కావున లోకము యొక్క పాపేచ్ఛలనుండియు, లోకము యొక్క స్నేహమునుండియు, లోకము యొక్క వేషధారణ నుండియు ప్రత్యేకింపబడి పరిశుద్ధ జీవితమును జీవించునట్లుగా మిమ్ములను సమర్పించుకొనుడి.
అనేకులు మనుష్యులను ప్రియ పరచుటకు తలంచి ప్రభువును దుఃఖపరచుచున్నారు. ప్రభువును వెంబడించుటయందును, ప్రియ పరచుటయందును, రక్త సంబంధాలు గాని, శారీరక ప్రేమ గాని మీకు అడ్డుగా నిలబడకూడదు. యేసుక్రీస్తు చెప్పెను: “తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు” (మత్తయి. 10:37) అని చెప్పెను.
దేవుని చేత విమోచింపబడినవారు ప్రత్యేకింపబడిన జీవితమును గూర్చిన అవశ్యతను తెలుసుకొనవలెను. సృష్టిలో: “దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.మరియు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక” (ఆది.కా. 1:4,6) అని దేవుడు పలికెను.
అట్టి ప్రత్యేకింపబడిన జీవితమును అబ్రహము యొక్క జీవితములోను ప్రభువు తీసుకొని వచ్చెను. “యెహోవా అబ్రహామును చూచి: నీవు లేచి నీ దేశమునుండియు, నీ బంధువుల యొద్దనుండియు, నీ తండ్రి యింటినుండియు బయలుదేరి, నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము” (ఆది.కా. 12:1) అని చెప్పెను.
చూడుడి, మొట్టమొదటిగా, ప్రభువు అబ్రహామును ఆయన ఊరును విడిచి, బంధువులను విడిచియు వేరు చేసెను. రెండోవదిగా, లోతును విడిచియు, లోతు యొక్క కుటుంబ సభ్యులను విడిచియు ప్రత్యేకంచెను. మూడోవదిగా, హాగరును విడిచియు, ఇస్మాయేలును విడిచియు ప్రత్యేకించెను. నాలుగోదిగా, ఇస్సాకును విడిచియు, పిల్లవాని వాత్సల్యతను విడిచియు ప్రత్యేకించెను, తనకి ఇష్టమైన వాటన్నిటిని అబ్రహాము బలిపీఠముపై పెట్టవలసినదాయెను.
దేవుని బిడ్డలారా, ఇట్టి సత్యమును మీరు ఎన్నడును మరచిపోకుడి. విలువ పెట్టి కొనబడినవారైన మీరు పరిశుద్ధ జీవితమును చేయవలెను.
నేటి ధ్యానమునకై: “ఇదిగో, దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును” (ప్రకటన. 21:3).