Appam, Appam - Telugu

మే 23 – అంతము వరకు నడిపించును!

“ఈ దేవుడు శాశ్వతకాలము నుండి సదాకాలము మనకు దేవుడైయున్నాడు; మరణము వరకు ఆయన మనలను నడిపించును” (కీర్తనలు. 48:14).

ఈ దేవుడు అంతము వరకు సదాకాలమునందును నడిపించును. మరణము వరకు నడిపించును. దాని కొరకే యుగ సమాప్తి వరకును ప్రతి దినమును ఆయన మనతో కూడనే ఉన్నాడు (మత్తయి. 28:20).

బాల్యమునందు తల్లిదండ్రులును, విద్యార్ధి ప్రాయమునందు ఉపాధ్యాయులును, ఉద్యోగ స్థలమునందు అధికారులును మనలను నడిపించుచున్నారు. అయినను మనలను చివరి వరకు నడిపించువాడు మన యొక్క దేవుడైన ప్రభువే. సదాకాలమును మనకు దేవుడైయున్న ఆయనే మనలను మరణము వరకు నడిపించును.

మరణముతో జీవితము అంతమవుచున్నదా? లేదు. మరణము తర్వాత కూడాను ప్రభువు మనలను నిత్య రాజ్యములోనికి త్రోవ నడిపించుచున్నాడు. తేజోమయమైయున్న దేశమునందు, రాత్రి కాలమే లేని పరలోక రాజ్యములో మనలను జీవజలముల బుగ్గల యొద్దకు త్రోవ నడిపించుచున్నాడు.

ఒక దినమున దావీదు తనను త్రోవ నడిపించునట్లుగా ప్రభువు యొక్క హస్తములకు సమర్పించుకొనెను. ప్రభువును తన యొక్క కాపరిగా అంగీకరించెను. చివరిగా ఆయన చెప్పుచున్నాడు: “నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను” (కీర్తనలు. 23:6). అదియే ఆయన యొక్క కదల్చలేని నమ్మికయు, విశ్వాసపు ఒప్పుకోలైయుండెను.

అపో. పౌలు యొక్క జీవితములో. దమస్కు వీధిలో దేవుడు ఆయనను సంధించినప్పుడు, ‘నన్నేమి చేయ కోరుచున్నావు’ అని అడిగి తనను త్రోవ నడిపించునట్లు ప్రభువు యొక్క హస్తములలోనికి సమర్పించుకొనెను. ఏయె దేశములకు వెళ్ళవలెను, ఏయె ప్రజలను దర్శించవలెను అను సంగతి నంతటిని పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు చొప్పున నెరవేర్చెను.

పలు సంఘములకు పత్రికలను వ్రాయుచున్నప్పుడు ప్రభువు యొక్క త్రోవ నడిపింపును తెలియజేసెను. “మీలో ఈ సత్‌క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను” (ఫిలిప్పీ. 1:4) అని చెప్పి దానిని బయలుపరచుచున్నాడు.

తన జీవిత దినములు అంతటను ప్రభువును త్రోవ నడిపించుటకు సమర్పించుకొనిన ఆయన మరణ సమయమునందు ఇలాగున సూచించెను: “నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను దేహమును వెడలిపోవు కాలము సమీపమైయున్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీటము ఉంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకు ….. అనుగ్రహించును” (2. తిమోతికి. 4:6-8).

దేవుని బిడ్డలారా, ఈ దేవుడు శాశ్వతకాలము నుండి సదాకాలము మనకు దేవుడైయున్నాడు. అందుచేతనే ప్రకటన గ్రంథమునందు మనలను త్రోవ నడిపించునట్లుగా వాగ్దానము చేసియున్నాడు: “సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును” (ప్రకటన. 7:17)

నేటి ధ్యానమునకై: “పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగయుగములు నీవే దేవుడవు” (కీర్తనలు. 90:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.