Appam, Appam - Telugu

జూన్ 16 – కడుగు హస్తములు

“అంతట పళ్లెములో నీళ్లు పోసి, శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను”    (యోహాను. 13:5)

క్రీస్తు యొక్క హస్తమును చూడుడి. ఆయన యొక్క హస్తములు శిష్యుల యొక్క పాదములను పట్టుకొని ప్రేమతో కడిగెను. పవిత్రపరిచెను.    “మీ పాదములు పరిశుద్ధముగా ఉండవలెను; మీ ప్రవర్తన అంతయు దేవునికి ప్రీతికరముగా ఉండవలెను”  అనుటయే మన ప్రియ ప్రభువు యొక్క కాంక్షయైయున్నది.

ఒకసారి మా యొక్క తండ్రిగారు. ఒక ఆలయపు ఆరాధనయందు పాల్గొన్నప్పుడు అక్కడ పాదములను కడిగి ప్రభువు బల్లను ఇచ్చు అలవాటు ఉండుటను చూచెను. ఇద్దరేసి మందిగా వేరుపరచి, ఒకరి పాదమును మరొకరు కడిగిరి.

మా తండ్రిగారు మొదటిసారిగా మరొకరి పాదమును పట్టి, నీళ్లు పోసి రుద్ది కడిగినప్పుడు, ఆయన హృదయమునందు గొప్ప తగ్గింపును ప్రభువు తీసుకొని వచ్చెను‌. అంత మాత్రమే గాక, క్రీస్తు యొక్క ప్రేమను, త్యాగమును తలంచి శ్రవించిపోయెను. ప్రభువు తన యొక్క పాదములను కడుగుతున్నట్టు గ్రహించెను. ఆయన యొక్క కన్నుల నుండి కన్నీళ్లు కారుటకు ప్రారంభించెను.

సాధారణముగా ఒకరు మరొకరి యొక్క పాదమును పట్టి కడుగుటకు  కోరుకొనరు. అందులోని మురికిని, మలీనమును, పుండు మొదలగు వాటిని శుబ్రపరచుటకు కోరుకొనరు. ఒకరి యొక్క అంతస్థు, గౌరవము, హోదా అన్నియు ఆ సమయమునందు ఏమీ లేకుండా పోవుచున్నది.

ఒక బిచ్చగాడును, ధనవంతుడును ఒకే ఆలయపు ఆరాధనయందు పాల్పొందుచున్నారని అనుకొనుడి. ఎన్నడును ఆ ధనవంతుడు ఆ బిక్షగాని యొక్క పాదమును కడుగుటకు కోరుకొనడు. ప్రతి ఒక్కరును తమకు సమమైన అంతస్తును, చదువును, నాగరికత ఉన్న వారినే వెతుకుదురు గాని బిక్షగాల్లనుగాని, వ్యాధిగ్రస్తులనుగాని వెతకరు.

యేసుక్రీస్తు ఎట్టి భేదమును చూడలేదు. తనను ముఫ్ఫై వెండి నాణెములకు పట్టిచ్చి అమ్ముటకు పడియున్న ఇస్కరియోతు యూదా పాదములను కూడా ఆనందముతో కడిగెను. తనను ఎరగనని, శపించుకొనుచు, ఒట్టు పెట్టుకొనబోవుచున్న పేతురు యొక్క పాదములను కూడా కడిగెను.

అలాగున కడుగుచున్న ఆయనే ఆకాశ మహాకాశములను, సూర్యుని చంద్రుని కలుగజేసిన సృష్టికర్తయైయున్నాడు. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువైయున్నవాడు. ఆయనకు వేలకొలది పదివేలకొలది దేవదూతలు పరిచర్య చేయుచున్నారు.  అటువంటి ప్రభువు తన్ను తాను తగ్గించుకుని, మన యొక్క పాదములను కడుగుచున్నాడంటే అట్టి త్యాగము ఎంతటి గొప్పది! అట్టి తగ్గింపు ఎంతటి ఆశ్చర్యమైనది!

దేవుని బిడ్డలారా, మీ పాదములను నీళ్లచేత కడుగుచున్నాడు. మీ అంతరంగమును తన యొక్క కన్నీళ్ళ చేత కడుగుచున్నాడు. మీ ప్రాణమును తన యొక్క రక్తముచేత కడుగుచున్నాడు. మీయొక్క ఆత్మను తన యొక్క ఆత్మచేత శుద్ధీకరించుచున్నాడు. మీరు కూడాను తగ్గింపును ధరించుకున్నవారై ఆయన వలె ఇతరులపై ప్రేమను చూపించుడి.

నేటి ధ్యానమునకై: “ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి…”    (1. యోహాను. 4:7).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.