జూలై 05 – ఇక రానైయున్న శబ్దము!
“ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దమును విందురు” (యోహాను. 5:28).
ఆకాశ మహాకాశములను కలుగజేసిన ప్రభువు, మనతో పలు రకములయందు మాట్లాడను. ప్రకృతి ద్వారాను (కీర్తనలు. 19:1), లేఖన వాక్యముల ద్వారాను. (సామెతలు. 6:21,22), బోధకుల ద్వారాను (యెషయా. 30:20,21), కలలు మరియు దర్శనముల ద్వారాను (యోవేలు. 2:28), అన్యభాషల ద్వారాను (యెషయా. 28:11), ఇంకా వేలకొలది మార్గములలో ప్రభువు మాట్లాడును. మృతులు వినునట్లుగా పరలోకము నుండి ఆర్బాటముతోను ఆయన మాట్లాడును.
లాజరు మరణించి నాలుగు దినములాయెను. “లాజరూ, బయటికి రమ్ము” అని ప్రభువు దగ్గరగా చెప్పి పిలిచినప్పుడు, చనిపోయిన లాజరు సజీవముగా లేచి బయటికి వచ్చెను (యోహాను. 11:43). చనిపోయిన యాయూరు యొక్క కుమార్తెను: “తలితాకుమి చిన్నదాన లెమ్ము” అని చెప్పి ప్రాణాలతో లేపేను. (మార్కు. 5:41). అదేవిధముగా నాయీనను ఊరి వెధవరాలి యొక్క కుమారుడ్ని: “చిన్నవాడా, లెమ్ము” అని చెప్పి ప్రాణాలతో లేపేను (లూకా. 7:14). వారు అందరును మరణించినవారే, అయినను వారి యొక్క చెవి ప్రభువు యొక్క మాటకు చెవియోగ్గినందున ప్రాణాలతో తిరిగి లేచిరి.
ఈ లోకమునందు ఇంతవరకు కోట్ల కొలదిమంది మరణించియున్నారు. సముద్రములో పడి మునిగిపోయిరి, మంటకు కాలిపోయిరి, వ్యాధి చేత పీడించబడిరి, విపత్తులో చిక్కుకునిరి, యుద్ధమునందు పోరాడి మరణించిన వారు అనేకులు కలరు. ఎరీతిగా మరణించినను: “సమాధులలో నిద్రించు అనేకులలో; కొందరు నిత్యజీవమును అనుభవించుటకును, కొందరు నిత్యముగా నిందపాలగుటకును హేయులగుటకును మేలుకొని లేచెదరు” (దానియేలు. 12:2) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది.
మృతి పొందుచున్న చివరి సమయము వారి యొక్క ఆత్మీయ జీవితము ఎలాగున్నది అను సంగతిని బట్టియే వారి యొక్క పునర్థానము కూడాను ఉండును. అంతము వరకు విశ్వాసమునందు నిలకడగా నిలిచియుండి, ప్రభువుతో ప్రేమలో ఐక్యపరచ బడినవారు, మొదటి పునర్థానమునందు ప్రథమ ఫలముగా కనబడుదురు.
“పరిశుద్ధలైన భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువైనది” (కీర్తనలు. 116:15) అనియు, “తమకు సూటిగానున్న మార్గమున నడచువారు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు” (యెషయా. 57:2) అనియు బైబిలు గ్రంధము చెప్పుచున్నది. ఒక దినము వచ్చును, అప్పుడు బూరెలు ధ్వనించబడును, ప్రధాన దూత ఆర్భాటము చేయును. ఆకాశము నుండి గొప్ప ధ్వనితో ప్రభువు యొక్క ఆర్భాటపు శబ్దమును విని మృతులైన వారు సజీవులుగా తిరిగి లేచెదరు.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విందురు; అప్పుడు, మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు” (యోహాను. 5:29).
దేవుని బిడ్డలారా, ఆకాశము నుండి ధ్వనించబడుచున్న శబ్దము శక్తి గలది. అది జీవింపచేయునది. మీరు చనిపోయిన తర్వాత, ప్రభువు యొక్క శబ్దమును వినుటకు ముందుగా, సజీవముగా ఉన్నప్పుడే ఆకాశమునందు పుట్టుచున్న శబ్దమునకు చెవియొగ్గుడి. పునద్దానపు శక్తితో పరిశుద్ధ జీవితమును చేయుడి. నీతిమంతులుగా ఉండుడి.
నేటి ధ్యానమునకై: “ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి” (1. పేతురు. 2:24).