మే 18 – స్వస్థత!
“నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును; యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును” (యెషయా. 58:8).
స్వస్థత ప్రభువు వద్ద నుండి మనకు లభించుచున్నది అనుట ఎంతటి గొప్ప ఆశీర్వాదము! వ్యాధి వెంబడి వ్యాధియును, భరించలేని బలహీనతలును మనుష్యుని యొక్క జీవితమును అడగదొక్కు చున్నప్పుడే స్వస్థత యొక్క గొప్పతనమును ఆరోగ్యము యొక్క గొప్పతనమును అతడు గ్రహించు కొనగలుగుచున్నాడు.
నీడ యొక్క గొప్పతనము ఎండలోనే తెలియును. ఆరోగ్యముతో జీవించుచున్న మనుష్యుడు ప్రభువు ఇచ్చిన ఆరోగ్యమును తలంచి చూచి ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించుటలేదు. రోగము వచ్చి అణగద్రొక్క బడుచున్నప్పుడు ప్రభువును దూషించుచున్నాడు, అవమానించుచున్నాడు. నాకు ఎందుకని ఇట్టి వ్యాధి అని సణుగుచున్నాడు.
మనము ఆరోగ్యవంతులమై ఉండవలెను అనుటయే ప్రభువు యొక్క ఉద్దేశమును, చిత్తమునైయున్నది. ప్రభువు మనకు దైవీక స్వస్థతను, దైవీక ఆరోగ్యమును వాక్కునిచ్చియున్నాడు. రోగము వచ్చిన తరువాత ప్రభువు యొక్క కృప వలన మనకు లభించుచున్నది దైవీక స్వస్థత. వ్యాధియే రాకుండా ఉండుట దైవీక ఆరోగ్యము.
“మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగాములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే” (నిర్గమ. 15:26) అని ప్రభువు చెప్పుచున్నాడు.
దైవ సేవకుడైన సైమన్ స్టాండ్లీ, 1953 ‘వ సంవత్సరమున చెన్నై క్రైస్తవ కళాశాలలో విద్యను అభ్యసించెను. ఆయన కళాశాలలో చదువుచున్నప్పుడు యేసుక్రీస్తును అంగీకరించి ఆయన యొక్క పరిచర్య కొరకు తన్ను తాను సమర్పించుకొనెను.
అప్పుడు ఆయన: “ప్రభువా నేను మీ యొక్క పరిచర్యను నమ్మకముగాను యథార్థతతోను చేయుటకు కోరుచున్నాను. నాకు రోగమే గాని, వ్యాధియే గాని, బలహీనతే గాని రాకుండా కాపాడుము” అని గోజాడెను.
ప్రభువు ఆయన యొక్క ప్రార్థనను ఆలకించి దైవీక ఆరోగ్యమును దయచేసెను. దాని తర్వాత దరిదాపులు యాబై సంవత్సరములు గతించిన తర్వాత రోగమే గాని, వ్యాధియే గాని లేకుండా సంపూర్ణ ఆరోగ్యము గలవాడై జీవించెను. ఆయన: “స్వస్థతను ప్రభువు నాకు ఇచ్చినందున ప్రభువును స్తోత్రించుచున్నాను” అని సాక్ష్యమును చెప్పెను.
స్వస్థగల జీవితమును కోరుకుంటే మాత్రము సరిపోదు. మనము దానికి సంబంధించిన నిబంధనలను నిశ్చయముగానే నెరవేర్చవలెను. అట్టి నిబంధనలు ఏమిటి ? మొట్టమొదటిది, మనము దేవుడైన ప్రభువు యొక్క మాటను శ్రద్ధగా వినవలెను. రెండోవది, ప్రభువు దృష్టికి న్యాయమైనది చేయవలెను. మూడోవది, ఆయన ఆజ్ఞలకు విధేయులైయుండవలెను. నాల్గోవది, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి గైకొనవలెను.
దేవుని బిడ్డలారా, ఇట్టి నిబంధనలను నెరవేర్చుటకు ముందుకు రండి.
నేటి ధ్యానమునకై: “నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది” (ఎఫెసీ. 6:2,3).