సెప్టెంబర్ 18 – ఆకాశమును కృపయు!
“మన పాపములను బట్టి మనకు ప్రతికారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫల మియ్యలేదు. భూమి కంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయనయందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది” (కీర్తనలు. 103:10,11).
భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అను సంగతిని ఇంత వరకు ఎవరును కొలిచి చూడలేదు, కొలిచి చూడను లేరు. మనుష్యులు నేడు ఆకాశమును అంటుచున్న భవనములను కట్టవలెనని ప్రయత్నించుచున్నారు. గొప్ప సాధనను చేయాలని కోరుచున్నారు, “ఆకాశమే మాయొక్క సరిహద్దు” అని ఆకాశమును చూపించుచున్నారు. నేడు కొంతమంది, ఆకాశమును కూడా దాటుకొని పోవుదుము అని సవాలును విడుచుచున్నారు.
ఆది.కా. 11 ‘వ అధ్యాయమునందు, ఆనాటి జనులు, “ఆకాశమున్నంటు శిఖరముగల ఒక గోపురమును నిర్మించి, మనకు పేరు సంపాదించు కొందము రండని” చెప్పుకొనిరి (ఆది.కా. 11:4). అందు నిమిత్తము వారు అతిశయించిరి. కావున నరుల కుమారులు కట్టుచుచున్న నగరమును, గోపురమును చూచుటకు ప్రభువు దిగివచ్చెను, వారు ఒకే జనముగా ఉండెను, ఓకే భాషయు వారికి ఉండెను. ప్రభువు వారి యొక్క భాషలను తారుమారు చేసెను. వారిని భూమియందంతట చెదరగొట్టెను, గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానివేసిరి.
నేడును ఆకాశమున్నంటు భవనములను కట్టునట్లుగా పలు దేశములు పోటీపడుచున్నాయి. అమెరికా తన యొక్క అతిశయము కొరకు న్యూయార్క్ పట్టణములో జంట గోపురాల అంతస్థు భవనమును కట్టియుండెను. శత్రువులు విమానములతో గుద్ది ఆ గోపురములను ధ్వంసము చేసి, గొప్ప వినాశనమును కలుగజేసేరి.
ఫ్రాన్స్ దేశములో ఈఫిల్ గోపురమును, మలేషియాలో పెట్రోనస్ గోపురమును, దుబాయి దేశమునందు గల వాచ్ ఖలీఫాను ప్రపంచము యొక్క ఎత్తైన గోపురములుగా ఉన్నాయి. అయితే దేవుని యొక్క బిడ్డలమైయున్న మనకు ఆకాశమున్నంటు ఎత్తయిన గోపురము ఒకటి కలదు. అది ప్రభువు యొక్క కృప అనుచున్న గోపురము. ప్రభువు యొక్క ఉన్నతమైన కృపను ఎవరి వలనను కొలిచి చూడలేరు. “ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది” (కీర్తనలు. 103:11). “యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది; నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది” (కీర్తనలు. 36:5).
దావీదు రాజు, తనపై దేవుని యొక్క కృప బహు గొప్పగా ఉన్నదను సంగతిని గ్రహించుకొనెను. “నీ చేతిపనియైన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసియున్నావు; మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింప జేసియున్నావు. నీ చేతిపనుల మీద వానికి అధికారమిచ్చియున్నావు, …. వాటినన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచియున్నావు” (కీర్తనలు. 8:1-8) అని ఆయన ప్రభువును ఆకాశమునంత ఎత్తునకు హెచ్చించి, స్తోత్రించి, చెప్పుచున్న సంగతిని బైబిలు గ్రంథమునందు చూచుచున్నాము.
దేవుని బిడ్డలారా, ఇదియే దేవుని కృప యొక్క ఎత్తు. కొలిచి చూడలేని కృప. మహా గొప్ప ఔన్నత్యమైన, మహిమగల కృప.
నేటి ధ్యానమునకై: “ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను” (యిర్మీయా. 51:15).