సెప్టెంబర్ 09 – వాక్యము బ్రతికించును!
“నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము” (కీర్తనలు. 119:25).
ప్రభువు యొక్క మాటకు బ్రతికింపచేయు శక్తి కలదు. కావున, యేసు చెప్పెను: “నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి” (యోహాను.6:63). ఎంతకెంతకు మీరు లేఖన గ్రంథమును పఠించుచున్నారో, ఎంతకెంతకు వాగ్దానములను విశ్వాసపు ఒప్పుకోలుగా చెప్పుచున్నారో, అంతకంతకు బ్రతికింపచేయు శక్తి మీపై బలముగా దిగి వచ్చును.
అబ్రహామునకు డెభ్భైఐదు సంవత్సరముల వయస్సైపోయి, ఆయన యొక్క శరీరము పిల్లలు పుట్టలేని స్థాయికి చచ్చిపోయియుండెను. ఆయన భార్యయైయున్న సారాకు స్త్రీల యొక్క ధర్మము నిలిచిపోయి గర్భము చచ్చి పోయియుండెను. పిల్లలు పుట్టవలెను అంటే వారిలోనికి బ్రతికింపచేయు దేవుని యొక్క శక్తి దిగితీరవలెను. ప్రభువు యొక్క వాగ్దానమును దృఢముగా పట్టుకొనుటయే అబ్రహాము చేసిన అంశమునైయుండెను.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక; రమారమి నూరేండ్ల వయస్సు గలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును అతడు అవిశ్వాసముతో ఆలోచించలేదు, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసము వలన బలమునొందెను” (రోమీ. 4:19-21).
అబ్రహాము పొందుకొనిన వాగ్దానపు వచనములు, ఆయన విశ్వాసమును బలపరిచెను. ప్రభువు పైన నమ్మికను తీసుకొని వచ్చెను. కావున విస్తారమైన జనమనకు ఆయన తండ్రిగా ఉన్నాడు. అబ్రహాము యొక్క శరీరమును బ్రతికింపజేసిన ప్రభువు, మీయొక్క శరీరములను కూడా బ్రతికింపచేయును. కావున, దావీదు విశ్వాసముతో చెప్పుచున్నది: “అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరల మమ్ము బ్రదికించెదవు, భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరల మమ్మును లేవనెత్తెదవు” (కీర్తనలు. 71:20).
ప్రభువు మీకు అనుగ్రహించుచున్న వాగ్దానములను దృఢముగా పట్టుకొని ఉంచుకొనుడి. ఆకాశమును భూమియు గతించి పోయినను ఆయన యొక్క వాగ్దానములు గతించిపోదు. మీరు పట్టుకునియున్న ప్రభువు యొక్క వాగ్దానములు ఆత్మీయు జీవమునై ఉన్నందున నిశ్చయముగానే మిమ్ములను అవి బ్రతికించును.
“నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు; నీతిని బట్టి నన్ను బ్రదికింపుము.
నీ వాక్యము నన్ను బ్రదికించియున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రదికించితివి; నేనెన్నడును వాటిని మరువను” (కీర్తనలు. 119:40,50,93).
దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితియందును సొమ్మసిల్లిపోకుడి, మనస్సునందు కృంగిపోకుడి. ఇకమీదట నా వల్ల ఏమియు చెయ్యలేను అని నిరుత్సాహపు మాటలను మాట్లాడకుడి. మిమ్ములను బ్రతికింపచేయుటకు, ప్రభువు యొక్క వచనము కనిపెట్టుకొనియున్నది. మీరు నిశ్చయముగానే బ్రతికింపబడి ఆది స్థితికి వచ్చెదురు.
నేటి ధ్యానమునకై: “…. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము; …. నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము” (కీర్తనలు. 119:153,154).