సెప్టెంబర్ 02 – కాళ్లను చూచుచున్నాడు!
“అందుకాయన: దగ్గరకు రావద్దు; నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము; నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను” (నిర్గమ. 3:5).
ప్రభువు మీ కాళ్ళను చూచుచున్నాడు. కాళ్లకు చెప్పులు మిగుల అవశ్యము. ఐగుప్తులో పస్కాను భుజించుచున్నప్పుడు, కాళ్లకు చెప్పులను తొడుక్కున్నవారై భుజించవలెను అని ప్రభువే చెప్పెను (నిర్గమ. 12:11). చెప్పులను తొడుక్కునియున్న పాదములు, సిద్ధపాటును బయలుపరచుచున్నది (ఎఫేసి. 6:15). ప్రభువు ఇశ్రాయేలు జనులను నలుబది సంవత్సరములు అరణ్యమునందు త్రోవ నడిపించుకుని వచ్చిన్నప్పుడు, వారి యొక్క చెప్పులు పాతగిలి పోలేదు (ద్వితి. 29:5).
అదే సమయములో, ప్రభువు యొక్క సన్నిధికి వచ్చుచున్నప్పుడు, ప్రభువు భయభక్తులకు చెందినవాడు అను సంగతిని గ్రహించి, ఆయన యొక్క సన్నిధిలో తగ్గించుకొని, చెప్పులను విడిచి పెట్టవలెను అని ఆయన కోరుచున్నాడు. సాధారణముగా చెప్పులు చచ్చిన మృగము యొక్క చర్మముతో తయారుచేయబడనవి. చచ్చిన దానిని ముట్టువాడు అపవిత్రుడు అని ప్రభువు యొక్క శాసనము చెప్పుచున్నది. దేవుని సన్నిధిలో నిలబడుచున్నప్పుడు, అటువంటి చెప్పులతో నిలబడకూడదు.
భారతదేశములోను శ్రీలంకలోను, మిగతా దక్షిణ ప్రాంతపు దేశములలోను ఎన్నడును చెప్పులను ధరించుకొని ఆలయములోనికి రారు. అది పరిశుద్ధమైన స్థలము అనుటయే దానికి గల కారణము. ఆలయమును మనము అపవిత్ర పరచకూడదు. అంత మాత్రమే కాదు, మన దేశములో, పెద్దవారిని, సంపన్నులను చూచుటకు వెళ్ళుచున్నప్పుడు చెప్పులను విడిచిపెట్టి వెళ్ళుదురు. కొందరు చెప్పులను తీసివేసి చేత పట్టుకుని దాచిపెట్టుకొని వెళ్లుదురు. యజమానునికి ఎదుట పాలేరు అనువాడు ఎన్నడును చెప్పులను తొడుగుకొనడు.
తప్పిపోయిన కుమారుడు తండ్రిని చూచుటకు వచ్చుచున్నప్పుడు, కాళ్లకు చెప్పులు లేకుండా వచ్చెను. పందిని మేపుతున్నవాడు చెప్పును తొడుగుకొనలేడు. లేమినిబట్టి అతనికి చెప్పులు కూడా లేకుండా ఉండవచ్చును. తండ్రి కుమారుని చూచిన వెంటనే అతని యొక్క హృదయము కరిగిపోయెను. “తండ్రి తన దాసులను చూచి: ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, వీనికికట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి” (లూకా. 15:22) అని చెప్పెను.
మనము, అహము అను చెప్పులను విప్పి ఎత్తి పడవేసి, దేవుని చిత్తము అను చెప్పును ధరించుకొనవలెను. ఒకడు అహముతో దేవుని సన్నిధికి రాలేడు. స్వార్థమును, స్వచిత్తమును ప్రభువు ద్వేషించుచున్నాడు. దేవుని సన్నిధిలో తగ్గింపును ధరించుకున్నవారై వచ్చినట్లయితే, ప్రభువు చేత అంగీకరించబడుదుము. మీ దృష్టికి జ్ఞానివలె మీరు రాకూడదు. జ్ఞానులను సిగ్గుపరచున్నట్లు బుద్ధిహీనులనే ప్రభువు పిలుచుచున్నాడు. బలవంతులను సిగ్గుపరచున్నట్లు బలహీనులనే ఆయన ఏర్పరచుకున్నాడు. మీ యొక్క అంతస్తు, గొప్పతనము, అతిశయములన్నియును దేవుని సముఖములో విడిచిపెట్టి, నిషేధించవలెను.
సిరియా రాజు, ధూపము వేయుటకు పరిశుద్ధ స్థలమునకు వెళ్ళినప్పుడు, తాను ఒక గొప్ప రాజు అను గర్వముతో లోపలికి వెళ్లెను. అక్కడనే ప్రభువు అతనిని మొత్తినందున, అతడు కుష్ఠు రోగిగా ఉండవలసినదాయెను. దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడును తగ్గింపును ధరించుకొనుడి
నేటి ధ్యానమునకై: “నా మార్గములను నేను పరిశీలన చేసికొంటిని, నీ శాసనముల తట్టునకు నా కాళ్ళను మరలుకొంటిని” (కీర్తనలు. 119:59).