Appam, Appam - Telugu

మే 20 – ప్రభువు యొక్క త్రోవలో నడిపించును!

“నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైయున్న యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైయున్న యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును” (యెషయా. 48:17).

ప్రభువు నడిపించునట్లుగా మనము మనలను ఆయన యొక్క హస్తములకు సమర్పించుకున్నప్పుడు ఆయన దేవుని యొక్క చిత్తము చొప్పున మనలను నడిపించును. చక్కని త్రోవలో నడిపించును. ఆయన నడిపించుచున్నాడు అంటే తోడుగా ఉన్నాడు అనుటయే అర్థము. అందుచేతనే దావీదు రాజు: “గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ ఆఅపాయమునకు భయపడను; నీవు నాకు తోడైయుందువు; నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును” (కీర్తనలు. 23:4) అని చెప్పుచున్నాడు.

నేడు మనుష్యుడు తనకు తానే నడిపించుకొనుటకు ప్రయత్నించుచున్నాడు. నన్ను నడిపించుటకు మరెవ్వరును అవసరము లేదు. జ్ఞానమును, తెలివియు, బుద్ధి సామర్థతయు మొదలగునవి అన్నియు తనకు ఉన్నది అని తలంచుచున్నాడు. తనకు చక్కగా కనబడుచున్న త్రోవలు చివరకు మరణపు త్రోవలుగా మారుచున్నది. మరి కొందరిని దెయ్యములును, అపవిత్ర ఆత్మలును త్రోవ నడిపించుచున్నాయి. ఇచ్చల ఆత్మలును, వ్యభిచారపు ఆత్మలును, తాగుడు మత్తు ఆత్మలును త్రోవ నడిపించుచున్నాయి.

యోసేపు యవ్వనస్తుడిగా ఉండినప్పుడు దేవుని యొక్క నడిపింపులో పలు ప్రశ్నలు తలెత్తి ఉండవచ్చును. ‘ఎందుకని నా సహోదరులు మిధ్యానియ్యుల చేతికి నన్ను ఆమ్మివేసిరి? ఎందుకని నేను ఐగుప్తునకు వచ్చితిని? పోతిఫరు ఇంట బహు నమ్మకస్తునిగా ఉండేవాడినే, ఎందుకని నాపై ఇంతటి అన్యాయమైన నెరారోపణలు? అయ్యో చెరసాలయందు నా ప్రాణము ఇనుపసువ్వల మధ్యన బంధించబడెనే! ప్రభువేనా నన్ను నడిపించుచున్నది? అని విలపించి ఉండవచ్చును. అయితే ఒక దినమున ప్రభువు సమస్త కీడులను మారునట్టు చేయనప్పుడు ప్రభువును ప్రేమించు వారికి సమస్తమును మేలునకే సమకూడి నడుచుచున్నదని అర్థము చేసుకొనెను.

ఐగుప్తు దేశమునకు ప్రధానమంత్రిగా హెచ్చింపబడినప్పుడు, మహా గొప్ప కరువు కాలమునందును తన కుటుంబ సభ్యులను పోషించుటకు త్రాణి గలవానిగా ఉండునట్లు ప్రభువే తనను నడిపించెను అను సంగతిని అర్థము చేసుకొనెను. అందుచేత ప్రేమతో తన సహోదరులను చూచి: ‘మీరు కాదు దేవుడే నన్ను ఈ స్థలమునకు పంపించెను’ అని సంతోషముతో చెప్పెను (ఆది.కా. 45:5-8). యోసేపును త్రోవనడిపించెను, దావీదును త్రోవనడిపించెను, దానియేలును త్రోవనడిపించెను, ఒక్కొక్క పరిశుద్దున్ని త్రోవ నడిపించుచు వచ్చుచున్నాడు, నిశ్చయముగానే మిమ్ములను కూడా త్రోవ నడిపించును. కావున ఎక్కడికి వెళ్ళుట, ఎవరి వద్దకు వెళ్ళుట అని మనస్సునందు కలవరపడకుడి.

మా తండ్రిగారి యొక్క త్రోవలను తిరిగి చూచుచున్నాను. ప్రారంభమునందు ఆయన ఒక చిన్న పచారీ సరుకుల దుకాణమునందు పనిచేసెను. తరువాత ఒక సంవత్సరపు కాలము ఉపాధ్యాయునిగా ఉద్యోగము చేసేను. భారతీయ ప్రభుత్వమునందు ఇన్కమ్టాక్స్ రంగములో పదహారు సంవత్సరములు పనిచేయుటకు ప్రభువు కృపను దయచేసెను. పరిశుద్ధాత్ముడు ఆయనను త్రోవ నడిపించి ఆయన యొక్క పరిచర్యయందు ఆయనను నిలబెట్టెను. ఇంతవరకు నడిపించినవాడు ఇక మీదట కూడాను నడిపించును అను బలమైన విశ్వాసమే చివరి వరకు ఆయనలో ఉండెను. అవును, దేవుని బిడ్డలారా, ఆయన త్రోవ నడిపించుచున్న బలమైన దేవుడు. నిశ్చయముగా మిమ్ములను కూడా త్రోవ నడిపించును.

నేటి ధ్యానమునకై: “మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? తనకు వెలుగు లేకయే చీకటిలో నడచువాడు, యెహోవా నామమును ఆశ్రయించి, తన దేవుని నమ్ముకొనవలెను” (యెషయా. 50:10).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.