Appam, Appam - Telugu

నవంబర్ 14 – చెవియొగ్గును!

“ఎవడైనను దేవభక్తుడైయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవిని ఆలకించును” (యోహాను. 9:31).

అనేకమంది: “ప్రభువు నాతో మాట్లాడట లేదే, ఆయన నాతో మాట్లాడుటకు నేను ఏమి చేయవలెను?” అని అడుగుచున్నారు. ప్రభువు రెండు రకములైన నిబంధనలను ఈ స్థలమందు పెట్టుటను చూచుచున్నాము. మొట్టమొదటిది, ప్రతి ఒక్కరును దేవునియందు భయభక్తులు గలవారై ఉండవలెను. రెండవది, ప్రభువునకు చిత్తమైన దానిని వారు చేయవలెను.

ఒక సహోదరీ తన యొక్క కుటుంబ ఆశీర్వాదము కొరకు ఉపాసముండి ఆసక్తితో ప్రార్థించుచుండెను. ప్రభువు ఆమెతో మాట్లాడి: “నీ సహోదరిని పైనయున్న చేదును, ద్వేషమును తీసివేసి సమాధానపడుము” అని మట్లాడెను. అయితే ఆ సహోదరికి అది ఇష్టము లేకుండెను. ఆమె అంతరంగమునందు నిండుగా ద్వేషమును వైరాగ్యమును ఉండెను. తన్ను తాను తగ్గించుకుని సహోదరి వద్దకు వెళ్లి క్షమాపణను అడగలేదు.

దాని తర్వాత ఆ సహోదరి అనేక విన్నపములను, విజ్ఞాపనలను ప్రభువు ఎదుటకు తీసుకొని వచ్చినప్పుడు, దేనికిని ప్రభువు జవాబును ఇవ్వలేదు. ఇందువలన ఆ కుటుంబంలో అనేక ఆశీర్వాదములు అడ్డగించబడెను. పిల్లలైతే చదువుకొని అభివృద్ధి చెందలేకపోయెను, వివాహము కాలేదు, అన్నిటా ఆటంకములే, అన్నిటియందును అడ్డంకులే. ఆమె ప్రార్థించుచున్నప్పుడెల్లను “మొదట నీ సహోదరునితో సమాధానపడుము” అని ప్రభువు మరలా మరలా చెప్పుచూనే ఉండెను. ఆమె ఇంతవరకు సమాధాన పడలేదు.

యేసుక్రీస్తు తండ్రి యొక్క సమస్త నీతిని నెరవేర్చుటకు తన్ను తాను తగ్గించుకుని సమర్పించుకొని బాప్తీస్మమును పొందినప్పుడు తండ్రి యొక్క స్వరమును వినెను. “ఈయనే నా ప్రియ కుమారుడు; ఈయనయందు నేను ఆనందించుచున్నాను”. నేడును బాప్తీస్మము అను ఇట్టి చిన్ని ఆజ్ఞను కూడాను నెరవేర్చలేని అసంఖ్యాకులైన క్రైస్తవులు కలరు. అట్టి వారితో ప్రభువు ఎలాగున మాట్లాడ గలడు?

యేసు చెప్పెను: “పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే పరలోకరాజ్యములో ప్రవేశించును గాని, నన్ను చూచి: ప్రభువా! ప్రభువా! అని నన్ను పిలుచు ప్రతివాడును ప్రవేశింపడు” (మత్తయి. 7:21). ఒక సంగతిని దిట్టముగా తెలుసుకొనుడి. దేవుని చిత్త ప్రకారము లేని సేవకుడును, దేవుని చిత్తమునకు విరుద్ధముగా ప్రవర్చించుచున్న ప్రవర్చనమును, దేవుని చిత్తప్రకారము లేని అద్భుతములు అన్నియును దుష్ట క్రియలైయున్నవి. ఒక దినమున ప్రభువు అట్టి వారిని చూచి: “అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని” వారితో చెప్పును (మత్తయి.7:23).

ప్రభువు యొక్క చిత్తమును అడిగి, ఆయనకు చెవియోగ్గి, ఆయన చిత్తము చేయుచున్న మనుష్యుడు ధన్యుడు! అట్టి వారి యొక్క అంతరంగమునందుగల మనస్సులో మెండుతనము ఉండును. లోకము ఇవ్వాలేని, తీసివేయలేని సంతోషము ఉండును. అతడు భూమి మీద జీవించు దినములన్నిటను ప్రభువును సంతోషపరుచుచు నిత్యత్వమునందు దేవుని సముఖములో ఉండును.

యేసు సెలవిచ్చుచున్నాడు: “కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును” (మత్తయి. 7:24).

నేటి ధ్యానమునకై: “దేవుని చిత్తము ప్రకారము జరిగించువాడు నిరంతరమును నిలుచును” (1. యోహాను. 2:17)

Leave A Comment

Your Comment
All comments are held for moderation.