Appam, Appam - Telugu

నవంబర్ 16 – వర్ధిల్లదు!

“నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు; న్యాయవిమర్శలో నిన్ను దోషారోపణ చేయు ప్రతి వాని నాలుకను నీవు నేరస్థాపన చేసెదవు; యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు” (యెషయా. 54:17)

ప్రభువు మన పక్షములో ఉన్నందున మనకు విరోధముగా రూపించబడు ఎట్టి ఆయుధమును వర్ధిల్లకుండా పోవును. ఇది ప్రభువు మనకు అనుగ్రహించియున్న స్థిరమైన వాగ్దానము. ఆయుధములు రూపించబడినను, అతి భయంకరమైన అగ్ని అస్త్రములు విసరబడినను అవి వర్ధిల్లదు అని వాక్కునిచ్చుచున్నాడు!

ఒక స్థలములో అతిపెద్ద పేలుడు బాంబు ఉంచబడి ఉన్నది అని అనుకోనుడి. ఆ బాంబు పేలినట్లయితే భయంకరమైన ప్రమాదమును ఏర్పరచవచ్చును. అయితే ఎదురు చూడని రీతిలో అకస్మాత్తుగా వర్షము కురియుచున్నది. ఆ పేలుడు బాంబు తడిచిపోవుట చేత పని చేయకుండా పోవుచున్నది. అట్టి ఆయుధము వర్ధిల్లకుండా పోవుచున్నది.

దేశములన్నియును విస్తారముగా ఖర్చుపెట్టి అత్యధిక ఆయుధములను రూపించుచున్నారు. ఒకదానితో ఒకటి ద్వేషమును, పగను కలిగియుండి విస్తారమైన ఆయుధములను తయారు చేయుచున్నారు. సద్దాము హుస్సేను మొదలుకొని పలు శత్రురాజ్యాలును ఇశ్రాయేలునకు విరోధముగా ఎన్నో బాంబులను వేయించునే ఉండెను.

అయితే ఇశ్రాయేలీయుల వైపున బాంబులను అడ్డగించు బలమైన దీటైన బాంబుల పరిక్రమము ఉన్నందున అవి మధ్య ఆకాశములోని శత్రువుల వేయిచున్న బాంబులను ఎదుర్కొని నామరూపాలు లేకుండా చేసి వేసెను. ఆ ఆయుధములు వర్ధిల్లకుండా పోయెను! ఎగురుచూ కాయుచున్న పక్షి వలే ప్రభువు ఇశ్రాయేలీయులపై ఆదరణ కలిగియుండెను. ఏ ఆయుధమైనను వర్ధిలకుండా పోయెను.

బైబులు గ్రంథమునందు ఒక చక్కటి సంభవమును మనము చూడవచ్చును. ప్రభువు యొక్క జనమునైయున్న యూదులను నశింపచేయుటకు అహష్వేరోషు యొక్క మంత్రియునైయున్న హామాను గొప్ప ప్రణాళికలన్నిటిని గీసెను, ఆయుధములను రూపించెను. తనను గౌరవించి నమస్కరించని యూదుడైన మొర్దకైను ఉరి తీయుటకు యాబై మూరల ఎత్తయిన ప్రత్యేకమైన ఊరికొయ్యను ఒకటి సిద్ధము చేసెను. చివరకు ఏమాయెను? ప్రభువు యొక్క హస్తము తారసపడెను. సమస్తమును తలకిందులుగా మారిపోయెను. మొర్దకైను ఉరితీయుటకు హామాను ఏ ఉరికొయ్యనైతే చెయించెనో, ఆదే ఉరికొయ్యలో హామాను ఉరి తీయబడెను.

మీకు విరోధముగా ఎవరైతే లేచుచున్నారో, అట్టివారు ప్రభువునకు విరోధముగా లేచుచున్నారు. మీకు విరోధముగా ఎవరైతే కుట్రను పన్నుచున్నారో, అట్టివారు ప్రభువునకు విరోధముగా కుట్రను చేయుచున్నారు.

దేవుని బిడ్డలారా, నేడు మీకు కలిగియున్న సమస్య, మీ యొక్క సమస్య కాదు. ఆ సమస్యను ప్రభువు తన యొక్క సమస్యగా భావించి, మీ కొరకు యుద్ధమును చేయను. మీ కొరకు వాదించును, మీ కొరకు సమస్తమును చేసి ముగించును. మరలా ఆ వాగ్దానమును వ్రాయుచున్నాను. “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు; న్యాయవిమర్శలో నిన్ను దోషారోపణ చేయు ప్రతి వాని నాలుకను నీవు నేరస్థాపన చేసెదవు” (యెషయా. 54:17).

నేటి ధ్యానమునకై: “ఇదిగో, దీవించుమని నాకు సెలవాయెను; ఆయన దీవించెను, నేను దాని మార్చలేను” (సంఖ్యా. 23:20).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.