Appam, Appam - Telugu

నవంబర్ 13 – స్నేహితునికి!

“నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా?” (ఆది.కా. 18:17).

అబ్రహాము ‘దేవుని స్నేహితుడు’ అని పిలువబడెను (యాకోబు. 2:23). కావున ప్రభువు అబ్రహామునకు పదిసార్లు దర్శనమిచ్చేను. పలుమార్లు తనంతట తానుగా అబ్రహామును వెతికి వచ్చి ఒక స్నేహితునివలె మాట్లాడెను. అబ్రహాము యొక్క కలలయందు మాట్లాడెను.

ప్రభువునకు స్నేహితుడు కావలెను. ప్రభువు యొక్క భారములను అంగీకరించి, ఆయనతో కలిసి ప్రార్థించుచున్న స్నేహితులను ఆయన యొక్క కన్నులు వెతుకుచున్నాయి. సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నశింపచేయు సంగతిని గూర్చి ప్రభువు అబ్రహాముతో మాట్లాడినప్పుడు, అబ్రహాము వెంటనే మోకరించి, “నీతిమంతులు నశింపబడకూడదు” అని వైరాగ్యముతో ఆసక్తిగా ప్రార్థించెను.

అబ్రహామే బైబిలు గ్రంధములో మొట్టమొదటిగా ఆసక్తితో గోజాడు ప్రార్ధనను చేసినవాడు. అబ్రహాము ప్రార్థించగా ప్రార్థించగా ప్రభువు వెనువెంటనే జవాబును ఇచ్చుచూనే ఉండెను. “సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల, వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును” (ఆది.కా. 18:26) అని వెంటనే జవాబును ఇచ్చెను.

మరలా అబ్రహాము ఒకవేళ నలభై ఐదు నీతిమంతులు ఉండినట్లయితే, అని అడిగినప్పుడు, ప్రభువు “నాశనము చేయననెను” అని చెప్పెను. మరలా అబ్రహాము: “నలభై మంది నీతిమంతులు ఉండిన యెడల” అని అడిగిన దానికి, ప్రభువు: “నలుబదిమందిని బట్టి ఆ స్థలమును నాశనముచేయక యుందునని చెప్పగా” (ఆది.కా. 28:29). అబ్రహాము ముఫ్ఫై, ఇరువై, పది అని అడుగుచు ఉన్నప్పుడు, ప్రభువు సహనముతో బదులును ఇచ్చుచూనే ఉండెను.

యేసుక్రీస్తు యొక్క దినములలో ఆయన యొక్క శిష్యులు ఆయనకు స్నేహితులుగా ఉండెను. యేసు ప్రేమతో సెలవిచ్చిన మాట: “నేను మిమ్ములను స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని” (యోహాను. 15:15)

ప్రభువు మిమ్ములను తన యొక్క స్నేహితునిగా ఎన్నుకునియున్నాడు. పరిచారకులుగా ఎన్నుకొనియున్నాడు. ప్రవక్తలుగా ఎన్నుకునియున్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నాది: “ప్రభువైన యెహోవా తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండ యేమియు చేయడు” (ఆమోసు. 3:7).

హెన్నత్ హేగన్ అను పరిశుద్ధుని యొక్క జీవితమును చదివి బహుగా ఆశ్చర్యపడియున్నాను. ఆయన తన యవ్వన వయస్సులో ప్రభువు తనను నడిపించుట కొరకు నిజముగా సమర్పించుకొని, ప్రభువు యొక్క స్నేహితుడాయెను. ప్రభువు ఎవరికి అంత విజ్ఞాపన చేయనట్లుగా ఆయన వద్దకు వెళ్లుచున్నప్పుడు, ఆయన భారము వహించి ప్రార్థించుచుండును. ఇందువలన ప్రభువు మరలా మరలా ప్రార్థన విజ్ఞాపనలను ఇచ్చి ప్రార్ధించినట్లు చేయను. ఆయన దేవుని సముఖములో కనిపెట్టుకొనియుండి అన్యభాషలో మాట్లాడుచూనే ఉండును. తరువాత ఆ అన్యభాషలను తనకు తానుగా తనలో అనువాదము చేసుకొని, దేవుని చిత్తమును తెలుసుకొనును. పరిశుద్ధాత్ముని చేత త్రోవ నడిపించబడును.

దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క స్నేహితులవ్వుటకు మిమ్ములను సమర్పించుకునుడి.

నేటి ధ్యానమునకై: “మాటలాడువారు మీరు కారు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడు” (మత్తయి. 10:20).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.