జూలై 30 – ఆలయము ఏపాటిది!
“యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు: ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము; మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు (ఇల్లు) ఆలయము ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది?” (యెషయా. 66:1).
పూర్వకాలము నుండి జనులు దేవుణ్ణి ఆరాధించుటకు పలు స్థలములను వెదకి ఎంచుకొనుచున్నారు. ధనవంతులు మిద్దెను భవనమును, చేరి వచ్చుటకు గోపురములను నిర్మించి దేవుణ్ణి ఆరాధించుచున్నారు. పేద ప్రజలు చిన్న ఆలయమును కట్టుచున్నారు. కొందరు చెట్టు క్రిందను, మరికొందరు కొండలలోను దేవునికి ఆలయమును కట్టుచున్నారు.
కానీ “ఆకాశము నాకు సింహాసనము, భూమి నాకు పాదపీఠము. నేను ఉన్నతమును మహోన్నతమైన సింహాసనమునందు ఆసీనుడనై యుండువాడను. నేను లోపల ప్రవేశించునట్లు ఎవరి వలన నాకు ఆలయము కట్టగలరు?” అని ప్రభువు అడుగుచున్నాడు. భూతలము పట్టజాలనంత, ఆకాశము పట్టజాలనంత, మండలములు పట్టజాలనంత, పరలోకము పట్టజాలనంత దేవునికి మనము ఎటువంటి ఆలయమును కట్టగలము.
దేవుడు తన యొక్క నోటి మాట వలన సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములన్నిటిని కలుగజేసినవాడు. ఆయన ఎంతటి గొప్పవాడు అను గ్రహింపు రవంత కూడాను లేకుండా ఒక చిన్న రాయిని ఉంచి, దానినే గుడిగా మలచి, దేవుణ్ణి లోపల పెట్టి బయట తాళమును కూడా వేలాడదీయుచున్నారు.
దేవుడే తన కొరకు ఒక ఆలయమును కట్టియున్నాడు అను సంగతిని, దేవుడు కట్టిన ఆలయము రాయిచేతను గాని, ఇటుకచేతను గాని కట్టబడలేదు అను సంగతిని, అట్టి ఆలయము అది మన యొక్క శరీరమునైయున్నది అను సంగతిని, మనమే ఆయన ఆలయము అను సంగతిని మనుష్యుడు మరచిపోయెను.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మీరు దేవుని ఆలయమునై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల, దేవుడు వానిని పాడుచేయును; దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరే ఆ ఆలయమునైయున్నారు” (1. కోరింథీ. 3:16,17). దేవుడు మనుష్యుని యొక్క శరీరమునందు నివాసము చేయుటకు కోరుచున్నాడు. కానీ మనుష్యుడు అయనను తననుండి దూరముగా ఎక్కడికో తీసుకొని వెళ్లి అక్కడ పెట్టి, తలుపులు వేసి తాళమును వేయుటకే కోరుచున్నాడు.
కారణము ఏమిటి? దేవుడు తనలో ఉండినట్లయితే తన మనస్సుకు నచ్చినట్లు జీవించలేడు. మనస్సుకు నచ్చినట్లుగా సిగరెట్టు కాల్చి, మద్యము త్రాగలేడు. సిగరెట్టు పొగయు, మధ్యపు ఘాటును లోపల ఉన్న దేవుణ్ణి ఊపిరాడకుండా చెయును కదా?
మనలో ప్రభువు నివాసము చేయుచున్నాడు అంటే అది ఎంతటి ఆశ్చర్యమైన అంశము! శరీరము వ్యాధి బారిన పడుచున్నదైయున్నది. భయంకరమైన ప్రమాదము ఏర్పడినట్లయితే నుజ్జునుజై పోవుచున్నదైయున్నది. ఎదురుచూడని సమయమునందు మరణమును సంధించ వలసినదైయున్నది. కానీ ప్రభువు మనలనే ఆయన యొక్క నివాసస్థలముగా ఎన్నుకొనెను. అనిత్యమైన మనలను నిత్యమైన వారిగా ఉండుటకు, మన్నైయున్న శరీరమును మహిమలో రూపాంతరము చెందుటకు ఎన్నుకొనేను. దేవుని బిడ్డలారా, మీరు ఆయన ఆలయమునైయున్నారు.
నేటి ధ్యానమునకై: “విస్తార జలముల ఘోషలకంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషలకంటెను, ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు (అనుకూలము) అలంకారమునైయున్నది” (కీర్తనలు. 93:4,5).