జూలై 26 – ఆత్మలో కలవరము!
“విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము” (ప్రసంగి. 12:12).
బుద్ధియు జ్ఞానమును మనుష్యునికి ఆవశ్యము. కానీ అనేకులు అత్యధికమైన విద్య చేతను, దేవునికి విరోధమైన ఆలోచనల చేతను, గలిబిలి చెందినవారై “పరిణామ సిద్ధాంతము చొప్పున, ప్రభువు ఈ లోకమును సృష్టించలేదు. అది తనంతట తానుగా రూపించబడెను” అని వాపోవుచున్నారు.
దేవుణ్ణి స్తుతింపనందున వారి హృదయము అంధకారము చెంది, చెడు ఆలోచనలో చిక్కుకొని వారు కలతచెందినవారై ఉన్నారు. ఇట్టి వారు ప్రశ్నలను అడుగుచు జవాబును కనుగొనలేకయే దాటిపోవుచున్నవారు. తమ సొంత జ్ఞానము చేత సృష్టికర్తయైన ప్రభువు యొక్క ఆలోచనలను తెలుసుకొనుటకు ప్రయత్నించువారు.
బుద్ధి లేక తెలివి అనుట కేవలము విద్యలో నుండి మాత్రము గాక, పలురకాల పరిస్థితులయందును, స్నేహితులయందును, అలవాటులద్వారాను కలుగుచున్నది. ఇందువలన పలు సమయములలో ప్రతి ఒక్కరి హృదయము కలత చెందుచున్నది.
ఉదాహరణముగా, ఒక వ్యాపారి తన వద్దనున్న విస్తారమైన సరుకులు యొక్క వెల ఉన్నపణముగా తగ్గిపోయేను అని తెలుసుకున్న వెంటనే రాబోవుచున్న నష్టము గూర్చి కలత చెందుచున్నాడు. ఎంతకెంతకు ఆలోచించుచున్నాడో, అంతకంతకు అతని హృదయము దిగులుపడుటకు ప్రారంభించుచున్నది. దానికి తగిన పరిష్కారము అతనికి లభించదు. కానీ మీరు, ప్రభువును విశ్వసించి ప్రభువుపై భారమును మోపివేసి, ఆయనను స్తుతించుటకు ప్రారంభించుడి. “అప్పుడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును” (ఫిలిప్పీ. 4:7).
ఇశ్రాయేలు రాజు కరువు వచ్చుటను గ్రహించి కలత చెందెను. (2. రాజులు. 6:25-30). కానీ ప్రవక్తయైన ఎలీషా ప్రభువుతో ఉండినందున రాజును ఓదార్చేను. అప్పుడు ప్రభువు ఒక యుద్ధ శబ్దపు ఘోషను శత్రువులు వినునట్లుగా చేసెను (2. రాజులు. 7:6). అందువలన వారు తమ వస్తువులను విడిచిపెట్టి పారిపోయిరి. ప్రభువు చేసిన అద్భుతము వలన ఒకే దినమునందు కరువు నుండి విడిపించబడిరి.
ప్రభువును వెతుకువారిని జ్ఞానముచేత కలుగు కలతగాని, దుర్వార్త వలన కలుగు కలతగాని అట్టి వారిని కృంగదియలేదు. దేవుని సమాధానము వారి యొక్క హృదయమును, తలంపులను క్రీస్తు యేసునందు కాపాడును.
మీయొక్క బుద్దిని జ్ఞానమును ప్రభువు కొరకు సమర్పించుడి. సమస్త జ్ఞానమునకు మించిన జ్ఞానము దైవ జ్ఞానమైయున్నది. కేవలము ఉత్తినే బైబిలు గ్రంథమును పఠించకుండా ప్రార్థనతో పఠించుడి. అప్పుడు బైబిలు గ్రంథమునందు గల లోతైన మర్మములను, ప్రత్యక్షతలను ప్రభువు మీకు బయలుపరచి మిమ్ములను ఆశీర్వదించును.
దేవుని బిడ్డలారా, బైబులు గ్రంథమును రాత్రింబగళ్ళు ధ్యానించుచున్న మనుష్యుడు ధన్యుడు.
నేటి ధ్యానమునకై: “అప్పుడు వారు: ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు, మన హృదయము మనలో మండుచుండలేదా? అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి” (లూకా. 24:32).