ఆగస్టు 31 – నవీన స్వభావమును ధరించుకొనుడి!
“కావున, మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును (వదలు) చెరిపివేసుకొని, మీ చిత్తవృత్తియందు నూతన పరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను” (ఎఫెసీ. 4:22-24).
మీరు శక్తిని ధరించుకొనవలెను అంటే, నవీన స్వభావమును ధరించుకొనవలెను. అప్పుడు మాత్రమే ప్రభువు కొరకు లేవగలరు. ప్రాచీన స్వభావము మోసకరమైన దురాశవలన నిండియున్నది. నవీన స్వభావము నీతి గలదైయున్నది (ఎఫేసి. 4:22). ప్రభువే అట్టి నవీన స్వభావమును, ఒక మనుష్యునిలోని అంతరంగ పురుషున్నియందు సృష్టించుచున్నాడు.
ఒకడు క్రీస్తునందు ఉన్నయెడల, నూతన సృష్టిగా ఉన్నాడు. పాతవి అన్నియు గతించిపోయెను. సమస్తమును నూతన మాయెను. మీయొక్క జీవితమునందు గల మురికి గుడ్డలను తీసి పడవేసి, క్రీస్తు యొక్క నీతిని ధరించుకొనుడి. ఆనాడు బర్తమయి అను గ్రుడ్డివానిని ప్రభువు పిలిచినప్పుడు, అతడు ముందుగా కప్పుకొనియున్న పై వస్త్రమును ఎత్తి పడవేసేను. ఆదాము యొక్క చొక్కాయి నాకు వద్దు. ప్రాచీన పాప పురుషుడు నాకు వద్దు. నా యొక్క స్వనీతి అంతయును మురికి గుడ్డవలెయున్నది. ప్రభువు అనుగ్రహించుచున్న రక్షణవస్త్రము నాకు చాలును అని క్రీస్తు తట్టునకు నడిచెను.
చిన్న కుమారుడు మారుమనస్సును పొంది తండ్రి వద్దకు వచ్చినప్పుడు, అతని యొక్క మురికి వస్త్రము తీసివేయబడెను. విలువైన వస్త్రము అతనికి ఇవ్వబడెను (లూకా. 15:22). మీరు తీసి పడవేయవలసిన వస్త్రములను తీసి పడసినట్లయితే, నూతన ఆత్మీయ వస్త్రములను ధరించుకొనగలము.
దేవుని మహిమను కోల్పోయి అంజూరపు ఆకులతో కచ్చడములను ధరించుకునియున్న ఆదాము అవ్వలకు ప్రభువు చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అలాగునే మీకును ఆత్మీయ వస్త్రములను దయచేయునట్లుగా యేసు సిలువలో కొట్టబడెను. మీరు ప్రభువు యొక్క కుటుంబములో జతపరచ బడినవారైయున్నారు. రాజాధిరాజు యొక్క పిల్లలుగాను, వారసులుగాను ఉన్నారు. ప్రభువు మీ యొక్క వస్త్రములను గమనించుచున్నాడు. ఆత్మీయ మహిమగల వస్త్రములను ఇచ్చుచున్నాడు.
‘సీయోను, లెమ్ము లెమ్ము’ అని చెప్పిన ప్రభువు దానితోపాటు ‘నీ సుందర వస్త్రమును ధరించుకొనుము’ అని చెప్పుచున్నాడు. ఆత్మీయ మహా గొప్ప ఔన్నత్యమైన ఒక వస్త్రము ఉంది అంటే అట్టి వస్త్రము క్రీస్తే. క్రీస్తును ధరించుకొనుడి. క్రీస్తు లోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు కదా (గలతి. 3:27). “ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి” (రోమీ. 13:14).
క్రీస్తును ధరించుకొనవలెను అంటే, క్రీస్తు యొక్క గుణాతిశయములను, స్వభావములను ధరించుకొనవలెను. ఆయన కనికరము, జాలి, దయ, కటాక్షము, ప్రేమ, సంతోషము, పరిశుద్ధత అనేటువంటి ఆయన యొక్క సద్గుణములను ధరించుకొనవలెను. యేసు మనస్సునందు తగ్గింపుగలవాడై శిష్యుల యొక్క పాదములను కడిగెను. బాప్తీస్మము పొందునప్పుడు తన్ను తాను తగ్గించుకొని బాప్తిస్మముయిచ్చు యోహాను వద్దకు వచ్చెను. మీ వద్ద అట్టి తగ్గింపు కలదా?
నేటి ధ్యానమునకై: “నేను నీతిని వస్త్రముగా ధరించుకొనియుంటిని; గనుక అది నన్ను ధరించెను; నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను” (యోబు. 29:14).