Appam, Appam - Telugu

ఆగస్టు 11 – ఎత్తయిన స్థలములో!

“పక్షిరాజు రాతికొండ మీద నివసించును, కొండపేటు మీదను, ఎవరును ఎక్కజాలని యెత్తు చోటను గూడు కట్టుకొనును. అక్కడ నుండియే తన యెరను వెదకును. దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును” (యోబు. 39:28,29).

ఏ పక్షియూ ఎగరలేని ఎత్తులలో గ్రద్దలు చాలా అందముగా ఎగురుచుండును. అదేవిధముగా, రక్షింపబడిన వారి ప్రాణము లోకము యొక్క ఆకర్షణ శక్తిని దాటుకుని, క్షణికమైన సుఖములను విడచి, పైనున్న వాటికై వేగిరపడుచున్నది. వారి ప్రాణము రెక్కలను కొట్టుకొని పైకి లేచి, ఎత్తైన స్థలములలో ఉన్నతుడైన క్రీస్తుతో కూడా ఎగిరి వెళ్ళుచున్నది.

అపో. పౌలు విశ్వాసులకు వ్రాయుచున్నప్పుడు: “మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే, పైనున్న వాటినే వెదకుడి గానీ భూసంబంధమైన వాటిమీద మనస్సును పెట్టుకొనకుడి;” (కొలస్సీ. 3:1,2) అని వ్రాయుచున్నాడు. పైనున్న వాటినే మీరు వెదకవలెను.పైనున్న వాటినే ఎదురు చూడవలెను. పైనున్న ఎత్తయిన స్థలములోనే ప్రభువుతో కూడా సంచరించవలెను. ఇదియే మీ యొక్క పిలుపు.

మీరు మన్నుకు సంబంధించిన శరీరమును కలిగినవారై ఉండినప్పటికి కూడాను, మీలో అక్షయమైన నిత్య ప్రాణము కలదు. మహిమ నుండి అత్యధిక మహిమను పొందుకొను కాంక్షకలదు. ఆ ప్రాణము నిత్యమైన పరలోకపు రాజ్యమును ఒక దినమున స్వతంత్రించుకొనును. కావున, మీరు ఉత్తముడుగాను, పరిశుద్ధుడిగాను, ప్రభువునకు ఇష్టుడుగాను జీవించుటకు పిలువబడియున్నారు. గ్రద్ద ఎన్నడును నీచమైన స్థలములలో జీవించదు. పెంట కుప్పలను గెలకదు. అది ఎత్తైన స్థలములనే వాంఛించును. అలాగునే మీయొక్క ఉద్దేశములు, తలంపులు, ఆలోచనలు అన్నియును ఉన్నతమైనదిగా ఉండవలెను.

మీ యొక్క ఉద్దేశమును, ఆలోచనయు ఇహ సంబంధమైనదిగా ఉన్నదా లేక నిత్యత్వమునకు సంబంధించినదిగా ఉన్నదా? ఇంకా అనేక మంది వివాహ సమయములలో కుల భేదమును, శుభదినమును, మంచి ఘడియను, నక్షత్రమును చూచుకొనుచూ తిరుగుచున్నారు. ఆ తరువాత, అతి చిన్న విషయమునకు కూడాను దేవుని ప్రేమ లేకుండా కఠినముగా కయ్యములాడు కొనుచున్నారు.

మరి కొందరు అతి చిన్ని పాటి సరిహద్దులలో నిలుచుండి పరిసయ్యలు, సదుకయ్యులవలె ఇతరులపై నిరారోపణ చేయుచునుందురు. అయితే ప్రభువు మిమ్ములను ఉన్నతనమునకు పిలుచుచున్నాడు. “నా… ప్రాణేశ్వరీ, లెబానోను విడిచి నాతోకూడ రమ్ము!” అని పిలచుచున్నాడు (ప.గీ. 4:8).

మనుష్యుడు విమానములో పైకి ఎత్తునకు వెళ్ళుచూ ఉన్నప్పుడు, క్రిందకు చూచుచున్నప్పుడు నేల మీద ఉన్న ఇల్లు, భవనము, నేల, ఆస్తి, అన్నియును చాలా చాలా చిన్నదై, చివరకు కనబడ లేనంతగా పోవును. లోకము యొక్క గొప్పతనము అంతయును ఏమియు లేదు అను సంగతిని, మనుష్యుడు వ్యర్థముగానే ఆలయుచు తిరుగుచున్నాడు అను సంగతిని అతడు అప్పుడే అర్థము చేసుకొనుచున్నాడు .

అలాగునే ఆత్మీయ జీవితమునందు పైపైకి ఉన్నతమునకు వెళ్ళుచున్న పరిశుద్ధులకు లోక స్నేహము, ఆప్యాయతలు అన్నియును అల్పముగా మరుగైపోవుచున్నాయి. దానిపై ఎట్టి పట్టును ఉండదు. రక్షింపబడుటకు పూర్వము గొప్ప ఔనత్వముతో కనబడినవన్నియును, రక్షింపబడిన తరువాత అల్పముగాను, పెంట కుప్పగాను కనబడుచున్నది.

దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క సంపూర్ణతయు, క్రీస్తు యొక్క స్వాథ్యమును, నిత్య రాజ్యమును, మీ యొక్క వాంఛయును, ఉదేశమునైయుండవలెను.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.

// Day of week // Sunday=0, Monday=1, Tuesday=2, Wednesday=3, Thursday=4, Friday=5, Saturday=6