Appam, Appam - Telugu

అక్టోబరు 24 – వేరొక ఆదరణకర్త!

“మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును” (యోహాను. 14:16).

యేసు అను ఆదరణకర్త, పరిశుద్ధాత్మ యకు వేరొక ఆదరణకర్తను మొట్టమొదటిగా శిష్యులకు పరిచయము చేయుచున్న మాటలను ఇక్కడ చదువుచున్నాము. శిష్యులను తన యొక్క నామమునందు ప్రార్థించునట్టుగా చెప్పిన యేసు, ఇక్కడ పరిశుద్ధ ఆత్మను మనకు అనుగ్రహించునట్లుగా తానే స్వయముగా వేడుకొనుచున్నాడు.

తండ్రియగు దేవుడు రెండు ప్రాముఖ్యమైన వాగ్దానములను దయచేసెను. మొదటిది, యేసు అను మెస్సయ్యను వాగ్దానము చేసెను. రెండోవదిగా, పరిశుద్ధాత్మను వాగ్దానము చేసెను. “నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును; …. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును” అని చెప్పెను (యోవేలు. 2:28,29). పాత నిబంధనలో ఇవ్వబడియున్న ఇట్టి రెండు వాగ్దానములు, కొత్త నిబంధనలో నెరవేరెను.

పాత నిబంధన పరిశుద్ధులు పరిశుద్ధాత్ముడు వారిలో నిరంతరముగా నివాసము చేయుటకు కోరిరి. దావీదు కూడాను: “నా అంతరంగములో స్థిరమైన (మనస్సు) ఆత్మను నూతనముగా పుట్టించుము” (కీర్తనలు. 51:10) అని అడిగి ప్రార్ధించెను.

అయితే వారి యొక్క అంతరంగము అను పాత్ర, పాపములను నివారించుటకు గొర్రె పశువు వంటి బల్లుల వలన పరిపూర్ణత చెందలేదు. యేసు క్రీస్తు సిలువలో తన్ను తాను సజీవ బలిగా, పాప నివారణ బలిగా, లోకమంతటి యొక్క పాపములను మోసుకుని తీర్చేటువంటి దేవుని యొక్క గొర్రె పిల్లగా సమర్పించుకున్న తర్వాతనే, పరిశుద్ధాత్ముడు భూమి మీద కుమ్మరించబడెను.

అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపియైన ఆత్మయగు ఆదరణకర్తె (యోహాను. 15:26) పరిశుద్ధాత్ముడు. బైబిలు గ్రంథమునందు ఆయన తండ్రి ఆత్మ అనియు (మత్తయి. 10:20) కుమారుని ఆత్మ అనియు (గలతీ. 4:6) పిలవబడుచున్నాడు.

క్రీస్తు ప్రార్థించినట్లుగా, పరిశుద్ధాత్ముడు పెంతుకోస్తు దినమునందు, మేడ గదిలో కనిపెట్టుకొని ప్రార్థించిన ప్రతి ఒక్కరి మీదను దిగివచ్చెను. నేడును విశ్వాసముతో ప్రార్ధించుచున్న ప్రతి ఒక్కరును పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకమును పొందుకొనుచున్నారు. మీరు పొందియున్న పరిశుద్ధాత్ముడు, పరలోకపు అతిధియైనవాడు. నిరంతరమును మీతో కూడా నివాసము చేయును. మీ యొక్క శరీరమును తన యొక్క ఆలయముగా మలచుకుని, మీలో నుండి ఆసక్తితో ప్రార్థించుచున్నాడు. మిమ్ములను తన యొక్క నివాసస్థలముగా చేసుకుని మిమ్ములను మహిమ చేత నింపుచున్నవాడు.

మీలో క్రీస్తును నివాసము చేయుచున్నాడు, పరిశుద్ధాత్ముడు కూడాను నివాసము చేయుచున్నాడు. “ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీయందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయైయున్నాడు” (కొలస్సీ. 1:27). అదే సమయమునందు, పరిశుద్ధాత్ముడు కూడా మీలో నివాసము చేయుచున్నాడు. “మహిమా స్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు” (1. పేతురు. 4:14).

దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మీకు ఆదరణ ఇచ్చువాడుగాను, సహాయము చేయువాడుగాను ఉన్నాడు.

నేటి ధ్యానమునకై: “లోకము సత్యస్వరూపియగు ఆత్మను చూడకను, ఆయనను ఎరుగకను ఉండును గనుక ఆయనను పొందనేరదు; ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును గనుక, మీరు ఆయనను ఎరుగుదురు” (యోహాను. 14:17).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.