అక్టోబరు 22 – విశ్వాసమును ఉంచుడి!
“దేవునియందు విశ్వాసమును ఉంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి” (యోహాను. 14:1).
కలహమును మాన్పి సమాధానమును సంతోషమును తీసుకుని వచ్చు శక్తి విశ్వాసమునకు కలదు. “విశ్వసించువాడు కలవరపడడు” (యెషయా. 28:16). అనియు. “మన యొక్క విశ్వాసమే లోకమును జెయించుచున్న విజయము” (1. యోహాను. 5:4). అనియు బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది. లోకమును జయించుచున్నవారు ఎన్నడను కలవరపడరు.
నేడు, అనేకులు తమ యొక్క నమ్మికను, విశ్వాసమును మనుష్యులపైనను, నరునిమీదను, రక్తసంబంధికులు మరియు బంధువుల మీదను ఉంచుచున్నారు. మీ యొక్క విశ్వాసము ఎవరు మీద ఉంచబడియున్నది? ‘దేవునియందు విశ్వాసమును ఉంచుడి. నాయందును విశ్వాసమును ఉంచుడి’ అని చెప్పెను యేసుక్రీస్తు.
“విశ్వాసము లేకుండా దేవునికి ఇష్ఠుడైయుండుట అసాధ్యము; దేవుని యొద్దకు వచ్చుచున్నవాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా” (హెబ్రీ. 11:6). క్రైస్తవ పునాదియే విశ్వాసమునందే ఉన్నది. పునాది వంటి ఉపదేశమును గూర్చి మాట్లాడిన అపో. పౌలు దేవునియందు ఉంచేటువంటి విశ్వాసమును గూర్చి దిట్టముగా బోధించుచున్నాడు (హెబ్రీ. 6:1). క్రీస్తు అను పునాదిపై దేవునికి మందిరముగా కట్టి లేవనెత్తబడవలెను అంటే దేవునియందు విశ్వాసమును ఉంచుడి.
క్రైస్తవ మార్గమునందు సాధ్యమైనంత మట్టుకు అన్నియును విశ్వాసము నుండే వచ్చుచున్నది. విశ్వాసము వలన రక్షణ కలదు (ఎఫెసీ. 2:8). క్రీస్తు నా కొరకు మరణించెను, పాతి పెట్టబడును, మరల సజీవముగా తిరిగి లేచెను అను సంగతిని విశ్వసించిన తరువాతనే ఒక వ్యక్తి బాప్తీస్మము తీసుకొనుటకు ముందుకు రావలెను. “(నమ్మి) విశ్వాసముగలవాడై బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును” (మార్కు. 16:16).
విశ్వాసము ద్వారానే పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకమును పొందగలము. యేసు చెప్పెను: “నాయందు విశ్వాసముంచు వాడెవడో, …. వాని కడుపులోనుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ” (యోహాను. 7:38,39).
దైవీక స్వస్థతను, ఆరోగ్యమును పొందుకొనవలెనా? మీకు విశ్వాసము ఆవశ్యము. “విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును” (యాకోబు. 5:15). పరిశుద్ధతను పొందుకొనుటకును విశ్వాసమే కావలెను. విశ్వాసము వలన వారి హృదయములను పవిత్రపరిచెను (అపో.కా. 15:9). దేవునియందు విశ్వాసముంచువారు జెయించువారిగా ఉందురు. “మన యొక్క విశ్వాసమే లోకమును జెయించ్చుచున్న విజయము” (1. యోహాను. 5:4).
విశ్వాసము మూలముగా బ్రతుకుట కలదు. కావున, మార్టిన్ లూథర్ “నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును (రోమీ. 1:17) అను మాటకు తగిననట్లుగా విశ్వాసమును పూర్తిగా ఆనుకొని ఉండెను. యేసు చెప్పెను: “నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు” (యోహాను. 14:19). దేవుని బిడ్డలారా, ప్రభువును విశ్వసించుడి. మీరు చింతించి కలవరపడవలసిన ఆవశ్యము లేదు.
నేటి ధ్యానమునకై: “నీవు (నమ్మిన) విశ్వసించినయెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని …. అనెను” (యోహాను. 11:40).