Appam, Appam - Telugu

ऑगस्ट 12 – “ప్రభువును వెదకుడి!”

“నేను యెహోవా యొద్ద విచారణచేయగా, ఆయన నాకుత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను” (కీర్తనలు. 34:4).

ప్రభువును వెతుకుచున్నప్పుడు వచ్చుచున్న ఆశీర్వాదములు లెక్కించలేనివి. మీరు ప్రభువును వెదుకుదురా అని ఆయన యొక్క కన్నులు తపనతో ఎదురుచూచుచూనే ఉన్నది. మీరు ఆయనను వెతుకుచున్నప్పుడు, నిశ్చయముగానే కనుగొందురు. తట్టుచున్నప్పుడు తెరచుటకును, అడుగుచున్నప్పుడు ఇచ్చుటకును, ప్రభువు కృపలో ఐశ్వర్య వంతుడైయున్నాడు. ప్రభువును పూర్ణ హృదయముతోను మీరు వెదికిన యెడల నిశ్చయముగానే ఆయనను కనుగొనగలరు (యిర్మీయా. 29:13).

చేప కడుపులో నుండి యోనా ప్రభువును వెదికెను. ప్రభువు ఆయనకు చెవియొగ్గి, ప్రాణబిక్షను ఇచ్చి, ప్రభువు యొక్క పరిచర్యను కొనసాగించి చేయుటకు కృపను కనబరిచెను. దావీదు గృహలో ఉన్నప్పుడు, చేసిన విన్నపము అని 142 ‘వ కీర్తనలో వ్రాయబడియున్నది.

ఒక సింహము ఎరను వెతుకుచున్నప్పుడు ఒక రకమైన ఉత్కండ కోపముతో చిన్ని పాటి మృగములను వెతుకుచున్నదో, దానికంటే దారుణముగా సౌలు దావీదును వెతుకుచూ ఉండెను. సాతాను కూడా దావీదునుకు విరోధముగా ఉండెను. అటువంటి పరుస్థుతులలోను దావీదు దేవుణ్ణి వెదికెను. “నేను యెహోవా యొద్ద విచారణచేయగా, ఆయన నాకుత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను” (కీర్తనలు. 34:4) అనుటయే దావీదు యొక్క సాక్ష్యము.

ప్రభువును వెతుకుచున్నప్పుడు దావీదునకు సింహము యొక్క జ్ఞాపకము రాగా: “సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువయైయుండదు” (కీర్తనలు. 34:10) అని వ్రాసేను. సమస్యలను తలంచి తలంచి సోమసిల్లిపోయి కూర్చుండి పోకుడి. పోరాటములను చూచి నీరసిల్లి నిలుచుండి పోకుడి. ఎట్టి పరిస్థితిలోను ప్రభువును వెదుకుడి. మీకు సహాయము చేయునట్లుగా ఆయన త్వరగా వచ్చును.

బహుశా రావలసిన అనేక మేలులు పలు సంవత్సరములుగా ఆటంకపరచబడి ఉండవచ్చును. పిల్లల యొక్క వివాహపు కార్యములు కలిసి రాకపోవచ్చును. అట్టి సమయములయందు ఉపవాసము నుండి ప్రభువు యొక్క ముఖమును వెదకుడి. మీలో ఏమి కొదువ కలదు. ఎట్టి పాపము కలదు. ఏ మనుష్యునిపైన ద్వేషము వైరాగ్యము కలదు అను సంగతిని పరిశీలించి చూచి ఆటంకములను ఎత్తి పడవేసి ప్రార్థించుడి. నిశ్చయముగానే ప్రభువు మీకు చెవియొగ్గి మేలును ఆశీర్వాదమును అనుగ్రహించును.

హన్నా గొడ్రాళైయుండి కానీమాటలను నిత్యము వినుచు ఉండుటకు ఇష్టపడలేదు. ప్రభువు యొక్క ఆలయమునకు వచ్చి ప్రభువును వెతికెను. మ్రొక్కుబడితో హృదయమును కుమ్మరించి ప్రార్థించెను. ప్రభువు ఆమెకు సహాయము చేసి ఆశీర్వాదకరమైన సంతతిని కృపగా దయచేసెను. మీకు కూడా అద్భుతమును చేయును.

దేవుని బిడ్డలారా, ఇకను మీరు నిందను అవమానమును నొందరు. మీయొక్క దుఃఖదినములు సమాప్తములాయెను.

నేటి ధ్యానమునకై: “మీరు యెహోవా పక్షపువారైన యెడల ఆయన మీ పక్షముననుండును; మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మును విసర్జించును” (2. దినవృ. 15:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.

// Day of week // Sunday=0, Monday=1, Tuesday=2, Wednesday=3, Thursday=4, Friday=5, Saturday=6