Appam, Appam - Telugu

నవంబర్ 01 – ప్రభువు యొక్క మాటలు!

“నరులు ఆహారమువలన మాత్రమే గాక, యెహోవా నోట నుండి సెలవిచ్చిన ప్రతి మాటవలనను బ్రదుకుదురు” (ద్వితీ. 8:3).

నూతనముగా రక్షింపబడుచున్న క్రైస్తవులుయైనను సరే, అత్యధిక అనుభవము గల క్రైస్తవులుయైనను సరే, క్రైస్తవ మార్గములో ప్రభువు యొక్క నోట నుండి బయలుదేరుతున్న మాటను విని, దాని ప్రకారము నడువవలసినది అవశ్యము. అప్పుడే ప్రభువు చిత్తము యొక్క కేంద్రములో ఉండగలము. జీవితము కూడాను శక్తిగలదిగాను, సమృద్ధి గలదిగాను ఉండును.

అనేకులు ప్రభువు యొక్క స్వరమును శ్రద్ధాశక్తులతో వినుటకు తప్పిపోవుట చేత, దేవుని చిత్తమును నెరవేర్చలేక ఉన్నారు. తమ జీవితమును గూర్చి దేవుడు ఉంచియున్న ఔన్నత్యములను తెలుసుకొన కుండా ఉన్నారు. తమ యొక్క మనస్సును, శరీరమును కోరుకొనుటను చేయుచున్నారు. అయితే, ప్రభువు యొక్క మార్గములు, మనుష్యుని యొక్క మార్గములకంటేను వెయ్యి రెట్లు గొప్ప ఔన్నత్యముగలదై ఉన్నాయి.

మీరు ప్రభువు యొక్క మార్గములో నడచుచున్నారా? ఆయన యొక్క స్వరమునకు చెవియొగ్గుచున్నారా? మీరు ఆసక్తితో ప్రార్ధించి ముగించిన తరువాత, ప్రభువు మీతో మాట్లాడుటకు చోటును ఇచ్చుచున్నారా? ప్రభువు యొక్క పరిపూర్ణమైన చిత్తమును మీ యొక్క జీవితములో చేయుచున్నారా? కొద్దిగా ఆలోచించి చూడుడి.

అనేకుల యొక్క ప్రార్ధన జీవితము ఏకముఖ మార్గముగానే ఉన్నది (one way traffic). ప్రభువు మన యొక్క ప్రార్థనను ఆలకించుచున్నాడు, అది వాస్తవమే. దానికంటే అత్యధికముగా మీతో మాట్లాడుటకు కోరుచున్నాడు. తన యొక్క మార్గములను మీకు బోధించుటకు కోరుచున్నాడు. “నీ మీద నా దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” (కీర్తనలు. 32:8) అని వాక్కును ఇచ్చుచున్నాడు.

ప్రభువు ఎన్నో రహస్యములను వారి వద్ద మాట్లాడవలెను అని కోరినను, వారి యొక్క జీవితమును గూర్చి గొప్ప ఔన్నత్యమైన ప్రణాళికలను వివరించుటకు కోరినను, వారు ప్రభువునకు సమయమును ఇచ్చుటనులేదు. ఆయన మాట్లాడుటను వినుటనులేదు.

మీరు పొందుకొనియున్న అభిషేకమును రగిలించి మండించుటతో పాటు, పరిశుద్ధాత్మునితో లోతైన మధురమైన సంబంధమును కలిగియుండుడి. ఆయన యొక్క మృదువైన స్వరమును వినుటకు ధపికయు, తపనయు కలిగియుండుడి. ఎల్లప్పుడును పరిశుద్ధాత్ముని చేత నడిపించబడుచున్న గొప్ప ఔన్నత్యమైన స్థితిలోనికి రండి.

దాసులు యజమానుడి యొక్క ఆజ్ఞలను కనిపెట్టుచు ఉండవలెను. పిల్లలు తండ్రి యొక్క ఆలోచనలకు చెవియొగ్గవలెను. స్నేహితులు స్నేహితుల యొక్క ఆలోచనలను అంగీకరించవలెను. వధువు వరుని యొక్క స్వరమునకై ఆశతో ఎదురు చూడవలెను. ప్రభువు మీకు యజమానుడిగాను, ప్రేమగల తండ్రిగాను, అంతరంగ వాత్సల్యముతో ఆప్యాయతను చూపించు స్నేహితుడు గాను, అదే సమయంలో ఆత్మ ప్రియుడుగాను ఉన్నాడు. దీనికంటే అతి మధురమైన ఆయన యొక్క మాటలకు మీరు చెవియోగవలసినది అవశ్యము కదా?

దేవుని బిడ్డలారా, మీరు ఆయన యొక్క మాటలను అంగీకరించుచున్నప్పుడు, ఆయన యొక్క నోట నుండి వచ్చుచున్న ప్రతి ఒక్క మాటవలనను బ్రతుకుదురు.

నేటి ధ్యానమునకై: “నా గొఱ్ఱెలు నా స్వరమునకు చెవియొగ్గును; నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును” (యోహాను. 10:27).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.