జూన్ 12 – అద్భుతములు!
“స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను” (అపో.కా. 6:8).
ఆదిమ సంఘమునందు గొప్ప ఉజ్జీవమును తీసుకొచ్చిన స్తెఫను సాధారణమైన స్థితిలో నుండి హెచ్చింపబడినవాడు. మొదట సంఘమునందు పరిచారికుడిగా ఉండినవాడు. బంతి వడించుటను గమనించునట్లుగా నియమించ బడినవాడు. అలాగున ఉండినప్పటికిని ప్రభువు స్తెఫనును బలముతోను, శక్తితోను వాడుకొనెను. కారణము, స్తెఫనుపై దేవుని యొక్క నింపుదల ఉండెను. మూడు అంశములయందు ఆయన నింపబడినవాడై ఉండెను.
మొదట స్తెఫను పరిశుద్ధ ఆత్మచేత నిండుకొనినవాడై ఉండెను అని అపో.కా. 6:5 లో చదువుచున్నాము. పరిశుద్ధ ఆత్మను పొందుకొనుట ఒక తొలి అనుభవము. అయినను, ఎల్లప్పుడును ఆత్మచేత నింపబడి జీవించుటయే అత్యున్నతమైన అనుభవముగా ఉన్నది.
పరిశుద్ధ ఆత్మచేత నీంపబడియున్నపుడు, దేవుని యొక్క బలముచేతను, కృపా వరములచేతను, ఆత్మ వారములచేతను నిప్పబడియుందుము. అందుచేతనే యేసుక్రీస్తు, మీరైతే పైనుండి శక్తిని పొందుకొను వరకును యెరూషలేము పట్టణములో వేచి యుండుడని చెప్పెను (లూకా. 24:49). మీరు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఉండినట్లయితే అద్భుతములను, సూచకక్రియలను చేయు శక్తిని పొందుకొందురు.
రెండోవదిగా, స్తెఫను విశ్వాసముతో నిండుకొనినవాడై ఉండెను. (అపో.కా. 6:5). “విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైయుండుట అసాధ్యము” (హెబ్రీ. 11:6). ప్రార్థించుచున్నప్పుడు విశ్వాసముతో చేయవలెను. పొందుకొందుము అను నమ్మికతో అడగవలెను. అప్పుడు అవి మీకు కలిగియుండును.
స్తెఫను ప్రభువును విశ్వాసముతో హత్తుకొనెను. విశ్వాసము వలన సమస్తము సాధ్యము అను సంగతిని ఎరిగి యుండినందున అట్టి విశ్వాసమును కార్యసాధకము చేసి అద్భుతములను చేసెను. మీరు ప్రభువును విశ్వసించినట్లయితే, ఎట్టి పర్వతమైనను మీదుట నిలబడలేదు. ఎట్టి ఆటంకముయైనను మిమ్ములను అడ్డగించి నిలిపి వేయలేదు.
మూడోవది, స్తెఫను బలముతో నిండుకొనినవాడై ఉండెను. మనలోని ప్రతి ఒక్కరికిని బలము కావలెను. అభిషేకము ద్వారా అట్టి బలమును పొందుకొనుచున్నాము. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను అనునదియే; దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను” (అపో.కా. 10:38).
అట్టి బలము పరలోకము యొక్క శక్తిగాను, దేవుని యొక్క శక్తిగాను ఉన్నది. స్తెఫనును నింపిన అదే ప్రభువు నేడును మిమ్ములను కూడా పరిశుద్ధ ఆత్మతోను విశ్వాసముతోను, బలముతోను నింపుటకు కోరుచున్నాడు. మీ యొక్క గిన్నె నిండి పొర్లునట్లుగా మిమ్ములను నింపును. ఆయన సమస్తమును అన్నిటిచేత నింపుచున్న దేవుడైన ప్రభువు కదా! దేవుని బిడ్డలారా, స్తెఫనును వాడుకొనినవాడు పక్షపాతము గలవాడు కాదు, మిమ్ములను కూడాను వాడుకొనుటకు శక్తి గలవాడైయున్నాడు.
నేటి ధ్యానమునకై: “ప్రభువు వారికి సహకారుడైయుండి, వెనువెంట జరుగుచు వచ్చిన సూచకక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను” (మార్కు. 16:20).