అక్టోబరు 18 – శాస్త్రుల పరిసయ్యుల కంటే అత్యధిక నీతి!”
“శాస్త్రుల నీతికంటెను, పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను” (మత్తయి. 5:20).
కొండ ప్రసంగమునందు నాలుగు సార్లు ప్రభువు, నీతిని గూర్చి మాట్లాడియున్నాడు. దేవుని పిల్లల యొక్క నీతి అనునది, శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటేను అత్యున్నతముగా ఉండవలెను.
పరిసయ్యుల నీతి అని ఒకటి కలదు. అది వారమునకు రెండుసార్లు ఉపవాసము ఉండు నీతియైయున్నది. తాము కలిగియున్న అన్నిటియందును దశమ భాగమును ఇచ్చేటువంటి నీతి. అట్టి నీతులను వివరించి పరిసయ్యుడు ప్రార్ధించుచునప్పుడు, “దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు; నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని, తనలోతాను ప్రార్థించుచుండెను” (లూకా. 18:11,12).
మీ యొక్క నీతి పరిసయ్యులు మరియు సదుకయ్యులు వంటి నీతి కంటే అత్యధికముగా ఉండవలెను. వారైతే వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచుచున్నప్పుడు; మీరు ఉసము చేయక ఉండవచ్చునా? వారే పదియవవంతును చెల్లించుచున్నప్పుడు మీరు చెల్లింపకుండా ఉండవచ్చునా?
మన దేశమునందు నమ్మకముగాను, యదార్థముగాను జీవించుటకు తలంచుచున్న అనేకమంది సన్మార్గులు ఉన్నారు. భగవంతుని యొక్క పాదములను ఎలాగైనను చేరవలెను అని ప్రయత్నించుచున్న ఋషులు, మునీశ్వరులు, సన్యాసులు, సాధువులు, యోగీశ్వరులు మొదలగువారు ఉన్నారు. ఒక క్రైస్తవుని యొక్క జీవితము వారి కంటే గొప్ప ఔన్నత్యయమైన జీవితముగా ఉండవలెను కదా? నీతి గల జీవితమును జీవించుటకు మిమ్ములను సమర్పించుకొనుడి.
ఒక క్రైస్తవుడు తాను లంచము పుచ్చుకొనుడు అని గొప్ప అతిశయముతో మాట్లాడెను. ఆ సంగతిని విన్న ఒక బ్రాహ్మణ సహోదరి, “నేను కూడాను లంచము పుచ్చుకొనను. కొత్త సంవత్సరమునందు కార్యాలయమునకు చెందిన ఒక ఒప్పందదారుడు వచ్చి పది డైరీలను అందరికీ పంచిపెట్టెను. అది కూడాను ఒక విధముగా లంచమే అని నేను తలంచి దానిని పుచ్చుకొనలేదు. అయితే మీరు పుచ్చుకొనుటను నేను చూసాను ఎక్కడ మీ యొక్క నీతి?” అని అడిగెను. ఆమెకు బదులు చెప్పుటకు ఆయన వల్ల కాలేదు.
ఒక సేవకుడు చెప్పెను: “నేను తెల్లవారుజామున పండుకుని నిద్రించుచున్నప్పుడు, ఉదయమున ఐదు గంటలకల్లా మసూదిలో మహమ్మదీయులు నమాజు కొరకు పిలుపును ఇచ్చుటను విన్నాను. ఆ సంగతి నా యొక్క హృదయములో లోతుగా గ్రహింపచేసినందున, ఇప్పుడు వారు నమాజు చేయుటకు ముందుగానే నేను లేచి ప్రార్థించుచున్నాను. నా యొక్క నీతి అత్యధికముగా ఉండవలెనని ప్రయత్నించుచున్నాను” అని చెప్పెను.
ఇస్లామీయులు ఒక రోజునకు ఐదు మార్లు నమాజు చేయుచున్న అలవాటును కలిగియున్నారు. దావీదు వారి యొక్క నీతి కంటేను తన యొక్క నీతి అత్యధికముగా ఉండవలెను అనుట కొరకు. “అబద్ధము నాకసహ్యము అది నాకు హేయము; నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయవిధులను బట్టి, దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను” (కీర్తనలు. 119:163,164).
నేటి ధ్యానమునకై: “మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను” (యోబు. 27:5).