సెప్టెంబర్ 28 – ఒకరియందొకరు ప్రేమ!
“సహోదర ప్రేమ విషయములో ఒకరియందొకరు అనురాగముగలవారై, ఘనత విషయములో ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనుడి” (రోమీ. 12:10).
ఇశ్రాయేలు దేశమునందు ఇద్దరు సహోదరులు ఉండెను. పెద్దవాడు వివాహితుడై భార్య మరియు పిల్లలుగలవాడు. చిన్నవాడు వివాహము కాని యవ్వనస్థుడు. ఆ ఇద్దరు అన్నదమ్ములును గోధుమలను నూర్పిడి చేసి తమ తమ కోట్లలో సమకూర్చి పెట్టుకునియుండిరి. ఒక రోజున రాత్రిపూట అన్నదమ్ములు ఇద్దరికిని నిద్ర పట్టలేదు.
పెద్దవాడు తలంచెను, “అయ్యో! నా తమ్ముడు పాపము, వివాహము కానివాడు. నాకైతే ఇద్దరు పిల్లలు. అందరు కలిసి శ్రమిస్తున్నాము. తమ్ముడు బాగుండాలి” అని చెప్పి ఆ రాత్రి తన యొద్ద ఉన్న ఒక పనలకట్టను తీసుకుని వెళ్లి తమ్ముడు యొక్క కోట్లలో పెట్టి వచ్చెను.
అదే రాత్రి తమ్ముడును లేచి, “నా అన్నయ్య పాపము, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెద్ద కుటుంబమును ఎలా కాపాడుతాడు? అని తలంచి తన యొక్క కొట్లలోని తన వద్దనున్న ఒక పెద్ద పనలకట్టను తీసుకుని వెళ్లి పెట్టి వచ్చెను. ఇలాగున ఒకరిపై ఒకరు వాత్సల్యతను కలిగి తరుచుగా ధాన్యములను, మరియు కానుకలను ఒకరి తెలియకుండా ఒకరు పెట్టి వచ్చేవారు.
ఒకరోజు రాత్రి పూట అలా ఇద్దరు దాన్యయమును తీసుకుని వచ్చుచుండగా ఒకరినొకరు ఎదురుపడ వలసిదాయెను. చిన్నవాడు పెద్దవాడిని హక్కున హత్తుకొని: “అన్నయ్యా, మీ కొరకే తీసుకుని వచ్చుచున్నాను” అని చెప్పెను. అన్నయ్య కూడాను తమ్ముడ్ని హక్కున కౌగిలించుకొని: “తమ్ముడు నీ కొరకే తీసుకొని వచ్చుచున్నాను, నిన్ను అధికముగా ప్రేమించుచున్నాను” అని చెప్పెను. ఇద్దరు కూడాను అలాగున హత్తుకుని ఏడ్చిరి. ప్రభువు ఆ సంగతిని చూచెను. “నా పిల్లలు యొక్క ఇట్టి ప్రేమగల పునాదిపై నాకు ఒక ఆలయము ఉండవలెను” అని చెప్పెను.
దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క గుణాతిశయములు మీలోనికి రావలెను. క్రీస్తు దయతోను, జాలితోను మిమ్ములను క్షమించుచున్నట్లుగా, మీరు కూడాను ఇతరులను మనఃపూర్వకముగా క్షమించుడి. ” ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అను బంధమైన ప్రేమను ధరించుకొనుడి” (కొలస్సీ. 3:14).
దేవుడు ప్రేమా పూర్ణుడైయున్నాడు. ప్రేమా పూర్ణుడైయున్న యేసునకు మీరు పిల్లలు కదా? కావున, మీరు క్రీస్తు యొక్క దైవీక ప్రేమను ధరించుకొనవలసినది అవశ్యమైయున్నది. ‘అభిషేకమును పొందుకున్నాను; బాప్తీస్మమ్మును తీసుకున్నాను. పరలోకమునకు ఎగిరి వెళ్లబోవుచున్నాను’ అని చెప్పుచు, హృదయములో ప్రేమ లేకున్నట్లయితే అందువలన ఏమి ప్రయోజనము?
“మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే, మ్రోగెడు కంచును, గణగణలాడు తాళమునైయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు, జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను” (1. కోరింథీ. 13:2).
నేటి ధ్యానమునకై: “దేవుడు మనలను ఈలాగున ప్రేమింపగా మనము కూడాను ఒకరినొకరు ప్రేమింప బద్ధులమైయున్నాము” (1. యోహాను. 4:11).