Appam, Appam - Telugu

సెప్టెంబర్ 16 – మహిమగల నిరీక్షణ!

“ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీయందున్న క్రీస్తు, మహిమగల నిరీక్షణయైయున్నాడను సంగతిని” (కలస్సీ. 1:27).

అపో. పౌలు సుమారుగా పద్దెనిమిది దైవ మర్మములను తన యొక్క పత్రికలలో వ్రాసియున్నాడు. “ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను” (1. కోరింథీ. 4:1).

మిమ్ములను పరిచర్యకు పిలిచినవాడు క్రీస్తు. పరిచర్యను అనుగ్రహించినవాడు క్రీస్తు. మీ కొరకు పరిచర్యను చేయుచున్నాడువాడు క్రీస్తు. ఆయన కొరకు పరిచర్యను చేయుచున్న వారికి ఆయన తన యొక్క మర్మములను బయలుపరచుచున్నాడు.

మర్మము అంటే అందరును ఎరిగేటటువంటి ఒక అంశము కాదు. అది నియమించబడిన కొందరికి మాత్రమే చెప్పబడుచున్న రహస్యపు సందేశమైయున్నది. ప్రభువు తన యొక్క మర్మములను లోకస్థులకు బయలుపరచకుండా, ఎన్నుకొనబడిన తన యొక్క పిల్లలకు మాత్రమే బయలుపరచుచున్నాడు. పాత నిబంధన పరిశుద్ధులకు కూడాను బయలుపరచని కొన్ని మర్మములను కొత్త నిబంధనలో ప్రభువు తన యొక్క వధువు సంఘమునకు బయలుపరచుచున్నాడు.

దేవుని యొక్క మర్మములలో ప్రాముఖ్యమైనది ఒకటి, ఆకాశ మహాకాశములలో పట్టజాలని దేవుడు మనుష్యులలో నివాసము చేయుటయైయున్నది. ఈ సంగతిని లోకస్థులు గ్రహించలేరు. “ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి” (యోహాను. 1:14).

క్రీస్తు మహిమగల నిరీక్షణగా మనలో నివసించుచున్నపుడు, పరిశుద్ధాత్ముడు కూడాను మనలో నివాసము చేయుచున్నాడు. “మహిమా స్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు” (1. పేతురు. 4:14). కావున, “మీరు దేవుని ఆలయమునైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?” (1. కోరింథీ. 3:16) అని బైబిలు గ్రంధము అడుగుచున్నది.

అంత మాత్రమే కాదు, దేవుని యొక్క శక్తియు, మహత్యమును, ఆత్మ వారములును, ఫలములును అన్నిటిని మనము మనలో పొందుకొనియున్నాము. “ఆ బలాధిక్యము మా మూలమైనది కాక, దేవుని దైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు” (2. కోరింథీ. 4:7).

ఒకసారి ఒక సహోదరుడు తన భార్యను కోపములో కొట్టివేసెను. ఆయన ఆ సంగతిని ఒక నేరముగానే భావించలేదు. అయితే ప్రభువు ఆయన యొక్క ప్రార్థనా సమయములో “కుమారుడా, నీవు ఎందుకని నన్ను కొట్టావు? ఎందుకని నీవు నన్ను వేదనపరిచావు? ముణికొల్లును తన్నుట నీకు కఠినమా” అని మాట్లాడెను. ఆ సహోదరుడు తన యొక్క తప్పును బహు లోతుగా గ్రహింపడెను.

దేవుని బిడ్డలారా, క్రీస్తు మీలో ఉన్నట్లయితే, దానితోపాటు మీలో మహిమగల నిరీక్షణయు ఉండును. మహిమగల నిరీక్షణ ఉన్నప్పుడు, మహిమగల ఆకాంక్షయు మీలోనికి వచ్చును.

నేటి ధ్యానమునకై: “మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల యెడల” (రోమీ. 9:23).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.